తెలంగాణ

telangana

ETV Bharat / opinion

మహారాష్ట్రలో ఉత్కంఠ పోరు- వదినా-మరదళ్ల మధ్య టఫ్ పైట్- శిందే కూతురు గెలుస్తుందా? - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024

Maharashtra Phase 3 Election : మహారాష్ట్రలో మూడో విడత సార్వత్రిక ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మొత్తం 11 స్థానాలకు ఈ దశ ఎన్నికలు జరగునుంది. బారామతి వదినా మరదళ్ల సవాల్‌తో సెగలు కక్కుతుంది. సతారాలో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ వారసులు బరిలో నిలిచారు. అలానే మరో నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేల మధ్య పోరు నెలకొంది.

Maharashtra Phase 3 Elections
Maharashtra Phase 3 Elections

By ETV Bharat Telugu Team

Published : Apr 28, 2024, 7:10 AM IST

Maharashtra Phase 3 Election : మహారాష్ట్రలో మూడో విడత సార్వత్రిక ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. మొత్తం 11 స్థానాలకు మే7న పోలింగ్ జరగనుంది. బరిలో మొత్తం258 అభ్యర్థులు నిలిచారు. వీటిలో సతారా, కొల్హాపుర్‌, బారామతి, సాంగ్లీ, సోలాపుర్‌, మాధా, హాట్కణంగ్లే పశ్చిమ మహారాష్ట్రలోనివి కాగా, లాతూర్‌, ఉస్మానాబాద్‌ మరాఠ్వాడా ప్రాంతంలోని స్థానాలు. రాయ్‌గడ్‌, రత్నగిరి-సింధుదుర్గ్‌ నియోజకవర్గాలు కొంకణ్‌ ప్రాంతంలో ఉన్నాయి. మెజార్టీ సీట్లలో పోరు ప్రధానంగా మహాయుతి (ఎన్​డీఏ), మహా వికాస్‌ అఘాడీ (ఇండియా) కూటముల మధ్యే హోరాహోరీగా ఉంది.

వదినా మరదళ్లు ఢీ
మూడో విడతలో అందరి దృష్టీ ప్రధానంగా బారామతిపైనే కేంద్రీకృతమైంది. ఇక్కడ సిట్టింగ్‌ ఎంపీ సుప్రియా సూలే ఎన్​సీపీ (ఎస్పీ) తరఫున బరిలో దిగారు. పార్టీ అధినేత శరద్‌ పవార్‌ కుమార్తె ఈమె. ఇటీవలె ఎన్​సీపీని చీల్చిన పవార్‌ సోదరుడి కుమారుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ సతీమణి సునేత్రా పవార్‌ ఎన్​సీపీ తరఫున ఈ స్థానంలో పోటీ చేస్తున్నారు. బారామతి పవార్‌ కుటుంబానికి కంచుకోట. ఇక్కడ సూలే 2009 నుంచి ఎంపీగా ఉన్నారు. అంతకుముందు వరుసగా ఆరుసార్లు శరద్‌ పవార్‌ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో సూలే ఓడితే, ఆయనకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లవుతుంది. పార్టీ శ్రేణులపై పట్టు కోల్పోయే ముప్పు కూడా ఉంటుంది. అందుకే కుమార్తె విజయం కోసం శరద్‌ పవార్‌ తీవ్రంగా శ్రమిస్తున్నారు. క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు.

కుటుంబ పోరు
ఉస్మానాబాద్‌ స్థానంలోనూ కుటుంబ పోరు కనిపిస్తోంది. బీజేపీ తరఫున ఎమ్మెల్యే రాణా జగ్జీత్‌సిన్హ్‌ పాటిల్‌ సతీమణి అర్చనా పాటిల్‌ పోటీ చేస్తున్నారు. జగ్జీత్‌సిన్హ్‌ సమీప బంధువైన సిట్టింగ్‌ ఎంపీ ఓంప్రకాశ్‌ రాజె నింబాల్కర్‌కు శివసేన (యూబీటీ) టికెట్‌ ఇచ్చింది.

శివాజీ వారసుడుకు కాంగ్రెస్‌కు వీబీఏ, ఎంఐఎం మద్దతు
కొల్హాపుర్‌ కాంగ్రెస్‌ తరఫున శ్రీమంత్‌ శాహూ ఛత్రపతి మహరాజ్‌ బరిలో నిలిచారు. ఈయన ఛత్రపతి శివాజీ వారసుల్లో ఒకరు. సీఎం ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని శివసేన, సంజయ్‌ మండ్లిక్‌కు టికెట్‌ ఇచ్చింది. ప్రకాశ్‌ అంబేడ్కర్‌ నాయకత్వంలోని వీబీఏ, అసదుద్దీన్‌ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం ఈ స్థానంలో శ్రీమంత్‌ శాహూకు మద్దతు ప్రకటించాయి.

త్రిముఖ పోటీ
సాంగ్లీలో మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) తరఫున రెజ్లర్‌ చంద్రహార్‌ పాటిల్‌, బీజేపీ నుంచి సిట్టింగ్‌ ఎంపీ సంజయ్‌కాకా పాటిల్‌ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌పై తిరుగుబావుటా ఎగరేసిన విశాల్‌ పాటిల్‌ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. దీంతో త్రిముఖ పోటీ నెలకొంది. 1976-85 మధ్య మూడుసార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వసంత్‌దాదా పాటిల్‌ మనవడు విశాల్‌.

ఎమ్మెల్యేల పోరు
సోలాపుర్‌ (ఎస్సీ)లో బీజేపీ రామ్‌ సాత్పుతేకు టికెట్‌ ఇవ్వగా, కాంగ్రెస్‌ ప్రణీతి శిందేను బరిలో దించింది. వీరిద్దరూ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలే. మాజీ సీఎం, కేంద్ర మాజీ హోంమంత్రి సుశీల్‌కుమార్‌ శిందే కుమార్తె ప్రణీతి.

సతారాలో ఛత్రపతి శివాజీ వారసుల్లో ఒకరైన శ్రీమంత్‌ ఛత్రపతి ఉదయన్‌రాజె భోసలే బీజేపీ తరఫున బరిలో నిలిచారు. భోసలే ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఇక్కడ ఎన్సీపీ (ఎస్పీ) తరఫున మాజీమంత్రి శశికాంత్‌ శిందే పోటీ చేస్తున్నారు. రత్నగిరి-సింధుదుర్గ్‌లో పోరు ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ బీజేపీ తరఫున కేంద్రమంత్రి, మాజీ సీఎం నారాయణ్‌ రాణె బరిలో ఉన్నారు. రెండుసార్లు ఎంపీగా గెలిచిన వినాయక్‌ రౌత్‌ (శివసేన-యూబీటీ) నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.

హాట్కణంగ్లేలో శివసేన (యూబీటీ) నుంచి సత్యజీత్‌ పాటిల్‌, శివసేన తరఫున ధైర్యశీల్‌ మానే బరిలో దిగారు. ఇక్కడ మాజీ ఎంపీ రాజు శెట్టి (స్వాభిమానీ పక్ష) బరిలో దిగడం వల్ల త్రిముఖ పోటీ ఉంది. మాధాలో సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌సిన్హ్‌ నాయక్‌-నింబాల్కర్‌ (బీజేపీ), ఎన్​సీపీ (ఎస్పీ) నేత ధైర్యశీల్‌ మోహితె-పాటిల్‌ హోరాహోరీగా తలపడుతున్నారు. లాతూర్‌ (ఎస్సీ) బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ సుధాకర్‌ శృంగారే, కాంగ్రెస్‌ అభ్యర్థి శివాజీరావ్‌ కాల్గే నువ్వానేనా అన్నట్లు తలపడుతున్నారు. రాయ్‌గడ్‌లో ఎన్​సీపీ రాష్ట్రాధ్యక్షుడు, సిట్టింగ్‌ ఎంపీ సునీల్‌ తట్‌కరే బరిలో ఉన్నారు. శివసేన (యూబీటీ) నుంచి అనంత్‌ గీతే పోటీ చేస్తున్నారు.

గెలుపు కోసం 16ఏళ్లుగా గిరిజన నాయకుడి పోరాటం- ఏడోసారి లోక్​సభ బరిలోకి- ఈ సారైనా విజయం వరించేనా? - lok sabha elections 2024

లోక్‌సభ బరిలో నిరుపేద గిరిజన మహిళ- జీరో అకౌంట్ బ్యాలెన్స్‌- నో సోషల్ మీడియా! - lok sabha elections 2024

ABOUT THE AUTHOR

...view details