ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / opinion

పెన్షన్ డబ్బులు వచ్చేది ఎప్పుడో? - పెన్షనర్ల ఆందోళన - ETV Bharat Pratidwani - ETV BHARAT PRATIDWANI

ETV Bharat Pratidwani: జగన్‌ పాలనలో పెన్షనర్ల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. పెన్షన్ డబ్బులు ఎప్పుడొస్తుందో తెలియక గందరగోళం నెలకొందని వాపోతున్నారు. వృద్ధాప్యంలో పెన్షన్‌ డబ్బులు సమయానికి రాక తీవ్ర అవస్థలు పడుతున్నామని అంటున్నారు. రోజువారీ ఖర్చులు, మందుల కోసం పెన్షనర్లు నానా అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం పెన్షనర్ల పరిస్థితి ఏమిటి అనే అంశంపై నేటీ ప్రతిధ్వని.

ETV Bharat Pratidwani
ETV Bharat Pratidwani

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 30, 2024, 12:08 PM IST

ETV Bharat Pratidwani :దశాబ్దాల పాటు రాష్ట్రానికి సేవ చేశారు. పదవీ విరమణ తరువాత ఇంటికే పరిమితమయ్యారు. ఈ సమయంలో ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ ద్వారా వచ్చే ఆదాయమే ఏకైక ఆధారం. పెన్షన్ డబ్బులు రాకపోతే జీవనం గందరగోళం అవుతోంది. పూట గడవాలన్న, అనారోగ్యంతో ఉన్న వాళ్లు మందులు కొనాలన్నా పెన్షన్ డబ్బులు కావాల్సిందే. కానీ ఐదేళ్లుగా పరిస్థితి తలకిందులైందని రిటైర్డు ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. పెన్షన్ డబ్బులు ఎప్పుడు వస్తుందో తెలియడం లేదని వాపోతున్నారు. ప్రస్తుతం పెన్షనర్ల పరిస్థితి ఏమిటి అనే అంశంపై నేటీ ప్రతిధ్వని.

Senior Citizens Facing Problems by Getting Their Pensions in AP :బాధ్యతల బరువును మోసి జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్‌ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు ఐఆర్‌, డీఆర్‌లకు గండికొట్టి క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు.

జగన్‌ పాలన కొనసాగితే బతికుండగా బకాయిలు అందుకోగలమా?: విశ్రాంత ఉద్యోగులు - Senior Citizens Facing Problems ap

Disbursement of Pension at Door Steps : వయసు పెరిగే కొద్దీ వైద్య, ఇతరత్రా ఖర్చులు పెరుగుతాయనే ఉద్దేశంతో ఇచ్చే క్వాంటం పెన్షన్‌లోనూ జగన్‌ సర్కారు కక్కుర్తి ప్రదర్శించి కోత విధించింది. పీఆర్సీలో కోతలు పెట్టారు. డీఆర్‌ బకాయిలు ఒక్కసారీ ఇవ్వలేదు. ప్రభుత్వం ఒక్కో విశ్రాంత ఉద్యోగికి రూ.1.50 లక్షల చొప్పున డీఆర్‌, పీఆర్సీ బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీంతో అసలు ఈ బకాయిలను అందుకుంటామా? అని విశ్రాంత ఉద్యోగులు డైలమాలో పడిపోయారు. ‘అది చేస్తా ఇది చేస్తా’ అంటూ ఎన్నికల ముందు హామీల వర్షం కురిపించిన జగన్‌ అధికారంలోకి వచ్చాక అందరినీ దగా చేశారు.

పింఛన్లపై వైసీపీ సర్కార్​ మరో కుట్ర - లబ్ధిదారుల్ని ఇబ్బంది పెట్టడమే లక్ష్యం - PENSION DISTRIBUTION ISSUE IN AP

ఐఆర్‌ ఇవ్వకుండా మోసం :గతేడాది సెప్టెంబరులో బకాయిలు చెల్లిస్తామని ఉద్యోగ సంఘాల చర్చల సందర్భంగా ప్రభుత్వం హామీ ఇచ్చింది. వాటిని ఈ ఏడాది జూన్‌కు వాయిదా వేసి, వారిపై పెద్ద బండ పడేసింది. 11వ పీఆర్సీ గడువు 2023 జులైతో ముగిసినందున 12వ పీఆర్సీకి సంబంధించి మధ్యంతర భృతి (ఐఆర్‌) చెల్లించాలి. కానీ, పీఆర్సీ కమిషన్‌ ఏర్పాటు చేసి, ఐఆర్‌ ఇవ్వకుండా ప్రభుత్వం చేతులెత్తేసింది. ఐఆర్‌ ఎందుకు? ఒకేసారి పీఆర్సీ ఇస్తామంటూ తప్పించుకుంది. దీంతో విశ్రాంత ఉద్యోగులు వారికి రావాల్సిన ప్రయోజనాలను నష్టపోయారు.

చంద్రబాబుతోనే రాష్ట్రం సుభిక్షం: పెన్షనర్‌ పార్టీ నేతలు - CM Jagan Neglect Pensioners

ABOUT THE AUTHOR

...view details