తెలంగాణ

telangana

ETV Bharat / opinion

సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న విశ్వవిద్యాలయాలు - మరి వాటి కష్టాలు తీరేదెలా? - DEBATE ON UNIVERSITIES ISSUES

Prathidwani Debate on Universities in Telangana : రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో తగినంత బోధనేతర సిబ్బంది లేక, కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు సతమతమవుతున్నారు. మరోవైపు గ్రాంట్లు, అభివృద్ధి నిధులు కూడా అందుబాటులో లేకపోవడంతో విద్యా అధ్యయనం, పరిశోధనలు అంతంత మాత్రమే సాగుతున్నాయి. మరి విద్యాభివృద్ధిని పునరుద్ధరించడానికి ప్రత్యేకంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో నేటి ప్రతిధ్వనిలో తెలుసుకుందాం.

Problems in Universities in Telangana
Prathidwani Debate on Universities in Telangana (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 3, 2024, 10:12 AM IST

Problems in Universities in Telangana :ఆలోచనల వికాసానికి ఆయువుపట్లు విశ్వవిద్యాలయాలు. సమాజగతిని నిర్దేశించే ఈ జ్ఞాన భాండాగారాలు కొన్నేళ్లుగా సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆచార్యుల నియామకాల కోసం ఏళ్ల తరబడి నిరీక్షణ కొనసాగుతోంది. తగినంత బోధనేతర సిబ్బంది లేక పలు విభాగాల్లో పరిపాలన కుంటుపడుతోంది. గ్రాంట్లు, అభివృద్ధి నిధులు అందుబాటులో లేక విద్యా అధ్యయనం, పరిశోధనలు నత్తనడకన సాగుతున్నాయి.

కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు పడుతున్న కష్టాలు వర్ణణాతీతం. అసలు రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల పరిస్థితి ఎందుకింత అగమ్యగోచరంగా తయారయ్యింది? కాంట్రాక్ట్, పార్ట్ టైమ్ అధ్యాపకుల ప్రయోజనాలకు రక్షణ ఎలా లభిస్తుంది? మసకబారిన యూనివర్సిటీల ప్రతిష్ఠను మళ్లీ పునరుద్ధరించేది ఎలా? ఇదే నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details