రాష్ట్రంలో దూకుడు పెంచిన ఏసీబీ - పట్టుబడుతున్న అవినీతి అధికారులు - Prathidhwani on ACB Raids - PRATHIDHWANI ON ACB RAIDS
Prathidhwani on ACB Raids : రాష్ట్రంలో ఏసీబీ ఒక్కసారిగా దూకుడు పెంచింది. తాజాగా రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌తో పాటు మరొకర్ని అరెస్టు చేయడంతో పాటు అవినీతి అధికారుల్ని వదిలిపెట్టేది లేదని ఏసీబీ డీజీ హెచ్చరించారు. కొందరు అధికారుల్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని మరీ అరెస్టులు చేస్తున్నా మిగిలిన వారిలో ఎందుకు భయం కలగడం లేదనే అంశంపై నేటి ప్రతిధ్వని.
Published : Aug 14, 2024, 10:28 AM IST
Prathidwani on ACB Act on Corrupt People : రాష్ట్రంలో అవినీతి అనకొండలపై దూకుడు పెంచింది అవినీతి నిరోధక శాఖ. రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్, సీనియర్ అసిస్టెంట్‌ను లంచం తీసుకుంటుంటుండగానే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లక్షల నగదు, కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇదే సందర్భంగా లంచం తీసుకునే అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తప్పించుకోలేరని హెచ్చరించారు ఏసీబీ డీజీ. కానీ పరిస్థితి ఇంత వరకు ఎందుకు వస్తోంది? ప్రభుత్వాలతో పనిచేయించుకోవడం ప్రజల హక్కు అన్న స్ఫూర్తి ఎందుకు కొడిగట్టిపోతోంది? క్లర్క్ నుంచి కలెక్టర్ వరకు ప్రతిసేవకు ఇంత అని రేటు కట్టి వసూళ్లు చేస్తున్నా ప్రజలు ఎందుకు మౌనంగా భరించాల్సి వస్తోంది? ఈ విషయంలో ఎలాంటి దిద్దుబాటు అవసరం? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.