తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

కొవ్వును కరిగించే "ఉలవల పచ్చడి" - ఇలా చేసుకుంటే అమృతమే, ఇంకా ఆరోగ్యం! - HOW TO MAKE ULAVA PACHADI

- ఉలవ చారు మాత్రమే కాదు, పచ్చడి కూడా అద్దిరిపోతుంది - అన్నం, టిఫెన్స్​లోకి పర్ఫెక్ట్​ రెసిపీ

How to Make Ulava Pachadi
How to Make Ulava Pachadi (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 22, 2025, 12:00 PM IST

How to Make Ulava Pachadi:ఉల‌వ‌ల గురించి తెలియని వారుండ‌రు. ఇవి తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతుంటారు. అందుకే ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తుంటారు. అయితే, చాలా మంది ఉలవలతో చారు మాత్రమే తయారు చేసుకుంటారు. అయితే ఉలవలతో కేవలం చారు మాత్రమే కాదు రుచికరమైన పచ్చడి కూడా తయారు చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే అమృతమే. పైగా ఈ ఉలవల్లోని పోషకాలు కొలెస్ట్రాల్ను ఇట్టే తగ్గిస్తుంది. మరి లేట్​ చేయకుండా ఈ పచ్చడి ప్రిపరేషన్​కు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు :

  • ఉలవలు - అర కప్పు
  • నూనె - 2 టీస్పూన్లు
  • శనగపప్పు - 1 టేబుల్​ స్పూన్​
  • మినప్పప్పు - 1 టేబుల్​ స్పూన్​
  • ఎండు మిరపకాయలు - 15
  • పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు - 7
  • చింతపండు - చిన్న నిమ్మకాయ సైజ్​
  • పచ్చికొబ్బరి తురుము - 1 / 2 కప్పు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • ఇంగువ - 1 / 4 టీస్పూన్

తాలింపు కోసం :

  • నూనె - 3 టీస్పూన్లు
  • ఆవాలు - అర టీ స్పూన్​
  • జీలకర్ర - అర టీ స్పూన్​
  • కరివేపాకు - 2 రెమ్మలు

తయారీ విధానం:

  • స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి ఉలవలు వేసి లో-ఫ్లేమ్​లో దోరగా 5 నిమిషాలు వేయించుకోవాలి.
  • ఉలవలు వేగి రంగు మారి మంచి వాసన వస్తున్నప్పుడు ఓ ప్లేట్​లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.
  • ఇప్పుడు అదేపాన్​లో నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్​ కాగిన తర్వాత పచ్చి శనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి.
  • అవి వేగిన తర్వాత ఎండు మిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి. ఇక్కడ ఎండు మిరపకాయలు మీరు తినే కారానికి అనుగుణంగా వేసుకోవాలి.
  • ఎండుమిర్చి వేగిన తర్వాత చింతపండు, పచ్చికొబ్బరి తురుము వేసి వేయించుకోవాలి.
  • అనంతరం ఉప్పు వేసి మరో రెండు నిమిషాలు వేయించుకుని స్టవ్​ ఆఫ్​ చేయాలి. చివరగా ఇంగువ వేసి కలిపి ఓ ప్లేట్​లోకి తీసుకుని చల్లారనివ్వాలి.
  • ఉలవలు, ఎండు మిర్చి మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీజార్​లోకి వేసుకుని ముందు ఓ సారి గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ మిశ్రమాన్ని మరీ జోరుగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేలా గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఇలా గ్రైండ్​ చేసుకున్న మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి తీసుకోవాలి.
  • తాలింపు కోసం స్టవ్​ ఆన్​ చేసి కడాయి పెట్టి నూనె వేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత ఆవాలు వేసి చిటపటలాడించాలి.
  • ఆ తర్వాత జీలకర్ర వేసి ఫ్రై చేయాలి. చివరగా కరివేపాకు వేసి ఫ్రై చేసి స్టవ్​ ఆఫ్​ చేయాలి.
  • ఈ తాలింపు మిశ్రమాన్ని ముందే గ్రైండ్​ చేసుకున్న పచ్చడిలో కలిపితే సూపర్​ టేస్టీ ఉలవల పచ్చడి రెడీ.
  • వేడి వేడి అన్నంలోకి వేసుకుని తింటే ఓ పట్టు పట్టొచ్చు. నచ్చితే మీరూ ట్రై చేయండి.

కొలెస్ట్రాల్​ను కరిగించే "ఉలవల కారం పొడి" - వేడి వేడి అన్నంలోకి తింటే అమృతమే!

"మెంతికూర - టమాటా పచ్చడి" చేయాల్సిన పద్ధతి ఇదీ! - సువాసనకే మౌత్ వాటరింగ్​ అయిపోద్ది!

ABOUT THE AUTHOR

...view details