ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / offbeat

'తిరుపతిలో ఎక్కువ రోజులు భారీ వర్షాలు! - అనూహ్యంగా మారుతున్న వాతావరణం' - WEATHER REPORT ON TIRUPATI

తిరుపతిపై గణనీయంగా వాతావరణ మార్పుల ప్రభావం - ఐపీసీసీ మోడళ్ల ఆధారంగా అధ్యయనం

tirupati_weather_report
tirupati_weather_report (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 13, 2025, 3:47 PM IST

Weather Report in Tirupati: తిరుపతిలో వాతావరణం రోజురోజుకూ మారుతోంది. మున్ముందు వర్షపాతం, ఉష్ణోగ్రత పెరగనున్నాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఈ శతాబ్దం చివరికల్లా తిరుపతి జిల్లా వ్యాప్తంగా అధిక వర్షపాతం నమోదు కావడంతో పాటు భారీ వర్షాలు కురిసే రోజుల సంఖ్య పెరుగుతుందని IPCC (ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానల్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌) మోడళ్ల ఆధారంగా ఓ అధ్యయనం స్పష్టం చేసింది. వర్షాలు ప్రారంభమయ్యే సీజన్​లో నైరుతి రుతుపవనాల వల్ల 30 నుంచి 40 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వర్షపాతం 8 నుంచి 32శాతం అదనంగా నమోదయ్యే అవకాశాలున్నాయని అంచనా.

'గ్యాస్ ట్రబుల్' నుంచి బయటపడేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? - నిపుణులు ఏమంటున్నారంటే!

tirupati_weather_report (ETV Bharat)

అధ్యయనం సాగిందిలా

దిల్లీకి చెందిన ‘ది ఎనర్జీ అండ్‌ రిసోర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌’కు చెందిన పరిశోధకులు తిరుపతి జిల్లాలో వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేశారు. ఈ బృందంలో కాగిత వెంకట్‌రమణ, స్వీడన్‌కు చెందిన ఉప్పసల విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లతో కలిసి పరిశోధించారు. ఈ మేరకు 1981 నుంచి 2010 వరకు భారత వాతావరణశాఖ (IMD)విడుదల చేసిన వర్షపాతం సమాచారం ఆధారంగా ఈ అధ్యయనం సాగింది.

tirupati_weather_report (ETV Bharat)

అధ్యయనంలో వెల్లడైన విషయాలు

  • అధ్యయనంలో భాగంగా 2026 నుంచి 2100 వరకు సమయాన్ని మూడు భాగాలుగా విభజించారు. మూడు భాగాల్లోనూ సీజన్లవారీగా వర్షపాతం పెరుగుతోదని గుర్తించి నైరుతి, ఈశాన్య రుతుపవనాల సమయంలోనే కాకుండా ఇతర సీజన్లలోనూ వర్షాలు కురిసే అవకాశముందని ప్రకటించారు.
  • 1981 నుంచి 2010తో పోలిస్తే శతాబ్దం చివరికి గ్రీన్‌హౌస్‌ వాయుఉద్గారాలు అధికంగా విడుదలయ్యాయని తేల్చారు. ఫలితంగా ఏటా వర్షపాతం 32%, తక్కువగా విడుదలైతే 19% పెరగనుందని అంచనా వేశారు.
  • నైరుతి రుతుపవనాల సమయంలో జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు 21-35% వరకు వర్షపాతం పెరగనుంది. శీతాకాలం, వేసవిలోనూ ఇదే పెరుగుదల నమోదయ్యే అవకాశాలున్నాయి.
  • తిరుపతిలో భవిష్యత్తులో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఏటా 3.3 డిగ్రీలు పెరగనున్నాయని, ఆ పెరుగుదల వేసవిలో 3.6 డిగ్రీల వరకు ఉండొచ్చని తెలిపారు.
  • అక్టోబరు నుంచి డిసెంబరు వరకు దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు మధ్యలో తీరం దాటే తుపాన్లు తిరుపతిలో పరిస్థితులను ప్రభావితం చేస్తున్నాయని పరిశోధనల్లో గుర్తించారు.
  • తిరుపతిలో ఏడాదిలో నమోదయ్యే మొత్తం వర్షపాతంలో 65% ఈశాన్య రుతుపవనాల సమయంలోనే కురుస్తుంది. ఆ సమయంలో వర్షపాతంలో మార్పులను గుర్తించాల్సిన అవసరాన్ని ఈ అధ్యయనం ఎత్తి చూపింది.
tirupati_weather_report (ETV Bharat)

జనాభా అనుగుణంగా

దీర్ఘకాలిక వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తిరుపతిపై ప్రకృతి వైపరీత్యాల ప్రభావం చూపకుండా సరైన ప్రణాళిక రూపొందించాలని పరిశోధనకులు కాగిత వెంకటరమణ పేర్కొన్నారు. తిరుపతి జనాభా 2031 నాటికి పది లక్షలకు చేరుతుందని అంచనా వేస్తూ నగరంలో అభివృద్ధి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వేగంగా చేపట్టాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.

ఫ్యాషన్ ప్రపంచంలో ఆ ఒక్కటి ఎందుకు మారలేదో తెలుసా? - చొక్కా జేబు ఎడమ వైపునే ఎందుకంటే!

న్యూస్​పేపర్​లో వాటిని ఎప్పుడైనా గమనించారా? - ఆ నాలుగు చుక్కలు ఏం సూచిస్తాయంటే!

ABOUT THE AUTHOR

...view details