ETV Bharat / offbeat

ఫ్యాషన్ ప్రపంచంలో ఆ ఒక్కటి ఎందుకు మారలేదో తెలుసా? - చొక్కా జేబు ఎడమ వైపునే ఎందుకంటే! - WHY POCKETS LEFT

ఫ్యాషన్​ ప్రపంచంలో ఎన్నో మార్పులు - లెఫ్ట్​సైడ్​ పాకెట్​ మాత్రం మారలేదు!

Why are Pockets on the Left
Why are Pockets on the Left (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 13, 2025, 12:48 PM IST

Why are Pockets on the Left : కాలానికి అనుగుణంగా ఫ్యాషన్​ ప్రపంచం వేగంగా మారిపోతోంది. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్లుగా ఫ్యాషన్​ డిజైనర్లు కొత్త దుస్తులు డిజైన్​ చేస్తూనే ఉన్నారు. షర్ట్​ డిజైనింగ్​ విషయంలో ఇప్పటి వరకు ఎన్ని మార్పులు వచ్చినా ఒక్కటి మాత్రం మారలేదు! అదేంటంటే, షర్ట్​కి పాకెట్​ ఎడమవైపున ఉండడం! అయితే, షర్ట్​కి పాకెట్​ ఎడమ వైపున మాత్రమే ఎందుకు ఉంటుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇలా డిజైన్ చేయడం వెనుక ఉన్న సీక్రెట్​ ఏంటో ఇప్పుడు చూద్దాం.

స్టైలిష్​గా కనిపిస్తారు!

చాలా మంది మగవారు టీషర్ట్​ కంటే, చొక్కా​ ధరించడానికి ఇష్టడతారు. టీ షర్ట్​లతో పోలిస్తే చొక్కా వేసుకోవడం వల్ల ఫార్మల్​గా కనిపిస్తారు. ఫుల్​ హ్యాండ్స్​, హాఫ్​ హ్యాండ్స్​ షర్ట్​ వేసుకుని ఇన్​షర్ట్​ చేస్తే చూడడానికి స్టైలిష్​గా కనిపిస్తారు. సాధారణంగా ప్రతి చొక్కా​కి ఎడమవైపున కచ్చితంగా జేబు​ ఉంటుంది. ఈ మధ్య కాలంలో టీషర్ట్​లకు కూడా జేబు ఉంటోంది. ఇలా షర్ట్​, టీషర్ట్​కి జేబు ఎడమవైపున ఉండడానికి ఓ కారణం ఉంది.

మొదట్లో జేబులు లేవట!

మొదట్లో చొక్కాలు డిజైన్ చేసినప్పుడు పాకెట్లు ఉండేవి కాదట! అవసరమైన వస్తువుల్ని వెంట తీసుకెళ్లాల్సి వస్తే ఒక చిన్న సంచిలో వేసుకుని నడుముకు తగిలించుకునేవారు. ఆ తర్వాత కోట్లు, వెయిస్ట్​కోట్లు వంటి దుస్తులకు లోపల పాకెట్లు కుట్టడం ప్రారంభించారు. సీక్రెట్​గా ఉండే ఈ జేబుల్లో విలువైన వస్తువులు, డబ్బులు దాచుకునే వారు. రైలులో ప్రయాణాలు చేసినప్పుడు, దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు దొంగల భయం లేకుండా ఈ సీక్రెట్​ జేబులు ఎంతగానో ఉపయోగపడేవి.

దేశంలోనే అతి చిన్న రైలు ఏమిటో తెలుసా? - కేవలం మూడు బోగీలతో ప్రయాణం!

అప్పుడు పుట్టిందే జేబు ఆలోచన!

డబ్బులు, విలువైన వస్తువులు పెట్టుకోవడానికి సీక్రెట్​గా ఓ జేబు ఉంది. కానీ, అందరికీ ప్రతిసారి ఉపయోగించే పెన్నులు, చిన్న డైరీ, కళ్ల జోడు, చిల్లర నాణాలు పెట్టుకోవడానికి వెంట చిన్న సంచి తీసుకెళ్లడం ఇబ్బందిగా ఉండేది. అప్పుడు పుట్టిందే ఈ లెఫ్ట్​సైడ్​ పాకెట్​ ఆలోచన! వీటన్నింటినీ ఈజీగా వెంట తీసుకెళ్లడానికి ఫ్యాషన్​ డిజైనర్లు షర్ట్​కి పాకెట్​ ఏర్పాటు చేశారు. అలా ఆనాటి నుంచి నేటి వరకు చొక్కాకి జేబు ఎడమవైపు ఉంటోంది.

ఎడమ వైపున మాత్రమే ఎందుకంటే!

చొక్కకి జేబు ఎడమ వైపున స్టిచ్చింగ్​ చేయడానికి శాస్త్రీయ కారణం ఏమీ లేదు! ప్రపంచవ్యాప్తంగా కుడి చేతివాటం కలిగిన వారు ఎక్కువ మంది ఉన్నారు. వీరికి ఎడమ చేతితో కుడి చేతి వైపున ఉండే జేబులోని వస్తువులు తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. అందుకే ఫ్యాషన్​ డిజైనర్లు షర్ట్​, టీషర్ట్​కి చిన్న జేబు లెఫ్ట్​సైడ్​ కుట్టడం ప్రారంభించారు. ఇలా అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ట్రెండ్​ కొనసాగుతోంది.

'లవ్​ మ్యారేజ్​ చేసుకున్నాక భర్త, అత్తమామలు కులం పేరుతో వేధిస్తున్నారు!' - నేను ఏం చేయాలి?

బొడ్డుతాడు ప్రాధాన్యమేంటి! - సెలబ్రిటీలు ఎందుకు దాచుకుంటున్నారు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.