Pawan Kalyan visit Swamimalai temple in Tamil Nadu: ఆలయాల సందర్శనలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఉదయం ఆయన కుంభకోణం సమీపంలోని స్వామిమలై క్షేత్రానికి చేరుకోగా ఆలయ అధికారులు, వేద పండితులు స్వాగతం పలికారు. అక్కడ కుమారస్వామిని దర్శించుకుని పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత వేద ఆశీర్వచనం పొందారు. పవన్ పర్యటనలో ఆయన కుమారుడు అకీరా నందన్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి ఉన్నారు. స్వామిమలైలో స్థానిక బీజేపీ నేతలు పవన్‌ను కలిశారు.
కేరళలో అగస్త్య మహర్షి ఆలయాన్ని సందర్శించిన పవన్ కల్యాణ్
ముందే వద్దు - కేటాయించిన సమయానికే క్యూలైన్లలోకి - భక్తులకు టీటీడీ విజ్ఞప్తి