Minister Atchannaidu on Bird Flu: బర్డ్‌ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. బర్డ్ ఫ్లూ పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలోని 5 పౌల్ట్రీ ఫార్మ్‌లో మాత్రమే సోకిందని వెల్లడించారు. బయో సెక్యూరిటీ జోన్లుగా ఈ ప్రాంతాల్ని ప్రకటించామని తెలిపారు.
బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను కేంద్ర ప్రభుత్వానికి చెందిన ల్యాబ్‌లకు పంపించామని అన్నారు. బర్డ్ ఫ్లూ అంశాలపై దుష్ప్రచారం చేస్తే కఠినంగా వ్యవహిరిస్తామని మంత్రి హెచ్చరించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఎప్పటికపుడు పరిస్థితిని సమీక్ష చేస్తున్నామన్నారు. తెలంగాణ నుంచి వచ్చే కోళ్లను ఏపీకి రాకుండా నిలిపి వేసినట్టు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి అన్నారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా కిలోమీటరు పరిధిలోని ప్రాంతాన్ని సెన్సిటివ్ జోన్‌గా ప్రకటించామని తెలిపారు.
మనుషులకు సోకిన దాఖలాలు లేవు: బర్డ్ ఫ్లూ వైరస్ పట్ల ప్రజలు ఆందోళ చెందాల్సిన అవసరం లేదని పశు సంవర్ధకశాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు అన్నారు. బర్డ్ ఫ్లూ మనుషులకు సోకిన దాఖలాలు లేవన్నారు. విదేశాల నుంచి వలస వచ్చిన పక్షుల వల్ల ఈ వైరస్ వ్యాప్తి చెందినట్లు వెల్లడించారు. ఈ సాయంత్రానికి బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను చంపి పూడ్చిపెడతామన్నారు. ఒక్కో కోడికి గానూ రైతుకు 140 రూపాయలు పరిహారం చెల్లిస్తామని వెల్లడించారు.
ఎన్టీఆర్ జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం- రెండు రోజుల్లోనే 11 వేల కోళ్లు మృతి
రవాణా జరగకుండా చెక్‌పోస్ట్‌లు: బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను అప్రమత్తం చేశారు. ఉంగుటూరు మండలం బాదంపూడిలోని ఓ పౌల్ట్రీ ఫారంలో బర్డ్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో వైరస్ వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. చికెన్, గుడ్ల దుకాణాలు మూసివేయించారు. చికెన్, గుడ్లు రవాణా జరగకుండా చెక్‌పోస్ట్‌లు ఏర్పాటుచేసి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
ప్రభావిత ప్రాంతాల్సో చర్యలు: పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు గ్రామంలో బర్డ్ ప్లూ వ్యాధి నిర్ధారించిన పౌల్ట్రీ ఫారాలను జిల్లా కలెక్టర్ నాగరాణి సందర్శించారు. రెడ్ జోన్ పరిధిలో 5 ఫారాలలో కోళ్లు చనిపోగా మిగిలిన సుమారు 20 వేల కోళ్లను ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రాపిడ్ రెస్పాన్సిబుల్ బృందాలు పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టాయి. కలెక్టర్ నాగరాణి పంచాయతీ అధికారులకు ఇతర శాఖల అధికారులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. బర్డ్ ప్లూ ప్రభావిత ప్రాంతంలో ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెల్లడించారు.
హాబీగా మొదలై మిద్దెపై పొలం వరకు - మొక్కలతో కళకళలాడుతున్న ఇల్లు
నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యంతో మురికి కూపంలా పెన్నానది