తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

ఈవెనింగ్​ టైమ్​ బెస్ట్​​ స్నాక్ "ఎగ్​ 65" - ఎటువంటి సాస్​లు అవసరం లేదు - టేస్ట్​ సూపర్​!

-ఇంట్లోనే చాలా సింపిల్​గా ప్రిపేర్​ చేసుకోవచ్చు! -పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు!

How to Make Tasty Egg 65
How to Make Tasty Egg 65 (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

How to Make Tasty Egg 65:చాలా మంది ఈవెనింగ్​ టైమ్​లో ఓ కప్పు వేడి వేడి టీతో పాటు ఏమైనా స్నాక్స్​ తినాలని ఆరాటపడుతుంటారు. అయితే ఈవెనింగ్​ స్నాక్స్​ అంటే అందరికీ సమోసా, పకోడి, మిక్చర్​ వంటివి గుర్తొస్తుంటాయి. అయితే ఇవి మాత్రమే కాదు సాయంత్రం స్నాక్స్​గా ఎన్నో రకాల రెసిపీలు చేసుకోవచ్చు. అందులో ఎగ్​ 65 కూడా ఒకటి. ఈ రెసిపీ ఎంతో టేస్టీగా ఉంటుంది. పైగా చేసుకోవడం కూడా చాలా ఈజీ. అయితే చాలా మంది దీనిని చేయాలంటే సాస్​లు కావాలని అనుకుంటారు. కానీ అవేమి లేకుండా ఎంతో రుచికరంగా కేవలం నిమిషాల్లోనే ఎగ్​ 65 ప్రిపేర్​ చేసుకోవచ్చు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు:

కోటింగ్​ కోసం

  • ఉడికించిన గుడ్లు - 4
  • ఉప్పు - అర టీ స్పూన్​
  • వేయించిన జీలకర్ర పొడి - అర టీ స్పూన్​
  • ధనియాల పొడి - అర టీ స్పూన్​
  • కారం- 1 టీస్పూన్​
  • కార్న్​ఫ్లోర్​ - 2 టేబుల్​ స్పూన్లు
  • మైదా - 3 టేబుల్​ స్పూన్లు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​- అర టీ స్పూన్​

65 కోసం:

  • నూనె- 2 టేబుల్​ స్పూన్లు
  • వెల్లుల్లి సన్నని తరుగు - ఒకటిన్నర టేబుల్​ స్పూన్లు
  • పచ్చిమిర్చి - 2
  • ఎండుమిర్చి - 2
  • ఉల్లిపాయ తరుగు - 2 టేబుల్​ స్పూన్లు
  • కరివేపాకు - 2 రెబ్బలు
  • గరం మసాలా- అర టీ స్పూన్​
  • వేయించిన జీలకర్ర పొడి - అర టీ స్పూన్​
  • వేయించిన ధనియాల పొడి - అర టీ స్పూన్​
  • కారం - ముప్పావు టీ స్పూన్​
  • ఉప్పు - రుచికి సరిపడా
  • చిలికిన పెరుగు - 1 కప్పు
  • ఫుడ్​ కలర్​- చిటికెడు
  • అజినోమోటో పొడి - 1 టీస్పూన్​
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • నిమ్మరసం - అర చెక్క

తయారీ విధానం:

  • ముందుగా ఉడికించిన గుడ్లు తీసుకోవాలి. అవి పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టు తీసి పొడుగ్గా నాలుగు ముక్కలు కట్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు కోటింగ్​ కోసం.. ఓ బౌల్​లోకి ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, కార్న్​ఫ్లోర్​, మైదా వేసి కలపాలి. ఆ తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్​ వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ బజ్జీల పిండిమాదిరి కలుపుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ మీద పాన్​ పెట్టి డీప్​ ఫ్రై కి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కాక కట్​ చేసుకున్న కోడిగుడ్డు ముక్కలను కార్న్​ఫ్లోర్​ మిశ్రమంలో ముంచి కోటింగ్​ ఊడిపోకుండా నూనెలో వేసుకుని ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా అన్నింటిని చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నూనె పోసుకోవాలి. నూనె కాగాక సన్నగా తరిగిన వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి హై ఫ్లేమ్​ మీద వేగనివ్వాలి. ఆ తర్వాత అందులోకి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి.
  • ఉల్లిపాయ మెత్తబడ్డాక గరం మసాలా, వేయించిన జీలకర్ర పొడి, వేయించిన ధనియాల పొడి, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి.
  • అనంతరం బాగా చిలికిన పెరుగు వేసి మంటను తగ్గించి పెరుగు మసాలాలకు పట్టేలా స్పీడ్​గా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత అందులోకి ఫుడ్​ కలర్​ వేసి హై ఫ్లేమ్​ మీద ఉడికించుకోవాలి. ఆ తర్వాత అజినోమోటో వేసుకోవాలి.
  • మరో హై ఫ్లేమ్​ మీద ఉడికించిన తర్వాత ఫ్రై చేసుకున్న కోడిగుడ్ల ముక్కలు వేసుకుని టాస్​ చేసుకోవాలి.
  • ఆ తర్వాత కొత్తిమీర తరుగు, నిమ్మరసం పిండి మరోసారి టాస్​ చేసుకుని సర్వ్​ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్​ 65 రెడీ.

గుంటూర్​ స్పెషల్​ "కోవా మాల్పూరి" - ఈ టిప్స్​ పాటిస్తూ చేస్తే పర్ఫెక్ట్​- పైగా రుచి అద్భుతం!

దీపావళి స్పెషల్​ - నోరూరించే "పనీర్​ జిలేబీ"- తింటే అమృతమే!

ABOUT THE AUTHOR

...view details