తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

తమిళనాడు స్టైల్ "చికెన్ చింతామణి" రెసిపీ - ఈ సండే విందు అద్దిరిపోతుంది!

- కొత్త వంటకాలను ఇష్టపడేవారికి సూపర్ అప్షన్

How to Make Chicken Chinthamani
Chicken Chinthamani (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 20, 2024, 11:47 AM IST

How to Make Chicken Chinthamani Recipe :చికెన్ అంటే ఎంత ఇష్టమైనా సరే.. ఎప్పుడూ ఒకటే తరహాలో తినాలంటే బోర్ కొడుతుంది. అందుకే.. కొందరు వెరైటీ రెసిపీస్ ప్లాన్ చేస్తుంటారు. అలాంటి వారికోసమే ఒక సూపర్ చికెన్రెసిపీ తీసుకొచ్చాం. అదే.. తమిళనాడు స్టైల్ చికెన్ చింతామణి. మసాలాలు వేయకుండా చాలా తక్కువ పదార్థాలతో ప్రిపేర్ చేసుకునే ఈ రెసిపీ చాలా రుచికరంగా ఉంటుంది! పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇంకెందుకు ఆలస్యం? ఈ సండే ఇంట్లో ఈజీగా ఒకసారి ఈ రెసీపీని ట్రై చేయండి. ఇంటిల్లిపాదీ ఆస్వాదించండి. మరి, ఇంతకీ దీని తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అన్నది ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • కిలో - చికెన్
  • 200 గ్రాములు - ఉల్లిపాయ తరుగు
  • 4 టేబుల్ స్పూన్లు - ఆయిల్
  • 10 - ఎండుమిర్చి
  • 1 టేబుల్ స్పూన్ - అల్లం వెల్లుల్లి పేస్ట్
  • రుచికి సరిపడా - ఉప్పు
  • చెంచా - మిరియాల పొడి
  • చెంచా - సోంపు పొడి
  • అర చెంచా - పసుపు
  • పావు చెంచా - ఇంగువ
  • 2 రెబ్బలు - కరివేపాకు
  • కొద్దిగా - కొత్తిమీర తరుగు

అసలు సిసలైన ఆంధ్రా స్టైల్​ "నాటుకోడి వేపుడు" - ఈ పద్ధతిలో చేశారంటే తినేకొద్దీ తినాలనిపిస్తుంది!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయలనుసన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే.. చికెన్​ను శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక.. ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేపుకోవాలి.
  • అవి వేగాక.. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగుని వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్​లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి.
  • ఆవిధంగా వేయించుకున్నాక.. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకూ ఫ్రై చేసుకోవాలి.
  • ఆ తర్వాత అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్‌ ముక్కలు, ఉప్పు, పసుపు, సోంపు పొడి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆపై మంటను పెంచి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
  • అలా ఉడికించుకున్న తర్వాత.. ఒకసారి కలిపి తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మంటను తగ్గించి నీళ్లు ఆవిరయ్యే వరకు 15 నుంచి 20 నిమిషాలపాటు ఉడికించుకోవాలి.
  • మధ్యలో అప్పుడప్పుడూ మూత ఓపెన్ చేసి కర్రీ అడుగంటకుండా గరిటెతో కలియ తిప్పుతుండాలి. చికెన్ ముక్కలు బాగా ఉడికిన తర్వాత మిరియాల పొడి, కొత్తిమీరతరుగు యాడ్ చేసుకొని ఒక నిమిషం ఉంచి దించేసుకోవాలి.
  • అంతే.. ఎంతో రుచికరంగా ఉండే తమిళనాడు స్టైల్ "చికెన్ చింతామణి" రెడీ! ఇక దీన్ని వేడివేడిగా పులావ్, అన్నం, చపాతీలలో తింటుంటే ఆ టేస్ట్ అద్దిరిపోతుంది!

సండే స్పెషల్​: టేస్టీ అండ్​ స్పైసీ "చికెన్​ ధమ్​ కిచిడి" - ఒక్కసారి తిన్నారంటే రుచి మర్చిపోరు!

ABOUT THE AUTHOR

...view details