తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

ఈ పద్దతిలో "గుత్తొంకాయ కూర"ని నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు! - పైగా టేస్ట్ అద్భుతం! - GUTTI VANKAYA CURRY RECIPE

మీకు గుత్తొంకాయ కర్రీ అంటే ఇష్టమా? - అయితే, నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోండిలా!

How to Make Gutti Vankaya Curry
Gutti Vankaya Curry (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 25, 2024, 3:53 PM IST

Gutti Vankaya Curry Recipe in Telugu : చాలా మంది ఎక్కువగా ఇష్టపడే రెసిపీలలో ఒకటి.. గుత్తొంకాయ. అయితే, ఎక్కువ మంది దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కాస్త శ్రమతో కూడుకున్న పనిగా, టైమ్ ఎక్కువ పడుతుందని భావిస్తారు. కానీ, మీకు తెలుసా? ఎవరైనా సరే ఈ పద్ధతిలో నిమిషాల్లో సూపర్ టేస్టీగా గుత్తొంకాయ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా అద్దిరిపోతుంది! మరి, ఇంకెందుకు ఆలస్యం అందుకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • గుండ్రటి వంకాయలు - అరకేజీ
  • ఆయిల్ - తగినంత
  • ఆవాలు - అరటీ​స్పూన్
  • జీలకర్ర - అరటీస్పూన్
  • పచ్చిమిర్చి - 3
  • కరివేపాకు - కొద్దిగా

స్టఫింగ్ కోసం :

  • పల్లీలు - 2 టేబుల్​స్పూన్లు
  • మినప్పప్పు - 1 టేబుల్​స్పూన్
  • శనగపప్పు - 1 టేబుల్​స్పూన్
  • ధనియాలు - 1 టేబుల్​స్పూన్
  • మెంతులు - చిటికెడు
  • జీలకర్ర - అరటీస్పూన్
  • ఎండుకొబ్బరి పొడి - 1 టేబుల్​స్పూన్
  • తెల్ల నువ్వులు - 1 టేబుల్​స్పూన్
  • చింతపండు - కొద్దిగా
  • కారం - 3 టీస్పూన్లు
  • ఉప్పు - 1 టీస్పూన్
  • పసుపు - అరటీస్పూన్
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - 2 టీస్పూన్లు
  • ఉల్లిపాయలు - 2(మీడియం సైజ్​వి)
  • టమాటా - 1

లఖ్​నవూ స్పెషల్​ "మలై గుత్తొంకాయ కుర్మా" - ఒక్కసారి టేస్ట్ చేశారంటే జిందగీ ​ఖుష్ అయిపోతుంది!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా గుండ్రటివంకాయలనుశుభ్రంగా కడిగి తొడిమె ఉండేలా కింది వైపు నుంచి నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి. ఆపై వాటిని ఒక బౌల్​లో కొద్దిగా ఉప్పు వేసుకున్న వాటర్​లో వేసి పక్కన ఉంచుకోవాలి.
  • అలాగే రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయలు, టమాటాను సన్నగా తరుక్కొని పక్కన ఉంచుకోవాలి.
  • అనంతరం స్టఫింగ్​ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై చిన్న కడాయి పెట్టుకొని పల్లీలు, మినప్పప్పు, శనగపప్పును వేసుకొని దోరగా వేయించుకోవాలి.
  • ఆ తర్వాత అందులో ధనియాలు, మెంతులు, జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్​ మీద అన్నింటినీ మాడకుండా మరికాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇక చివరగా ఎండుకొబ్బరి పొడి, తెల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకొని అన్నింటినీ చక్కగా వేయించుకోవాలి.
  • అనంతరం మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న పల్లీల మిశ్రమం, చింతపండు, కారం వేసుకొని మెత్తని పొడిలా కాకుండా కాస్త బరకగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్​లోకి మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని తీసుకొని పసుపు, ఉప్పు, అల్లంవెల్లుల్లి పేస్ట్, సన్నని ఆనియన్, టమాటా తరుగు యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి.

ఎప్పుడైనా వంకాయ బజ్జీ కర్రీ తిన్నారా?- రాయలసీమ స్టైల్​లో తిన్నారంటే వావ్ అనాల్సిందే!

  • ఇప్పుడు ముందుగా కట్ చేసుకుని వాటర్​లో వేసుకున్న వంకాయలను తీసుకొని వాటిల్లో మీరు ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని చక్కగా స్టఫ్ చేసుకోవాలి. అన్నింటినీ స్టఫ్ చేసుకున్నాక కొంత మిశ్రమం మిగులుతుంది. దాన్ని పక్కన ఉంచుకోవాలి.
  • అనంతరం స్టౌపై కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకొని చిటపటలాడనివ్వాలి. ఆపై పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకువేసుకొని ఫ్రై చేసుకోవాలి.
  • అవి చక్కగా వేగాయనుకున్నాక మీరు ముందుగా స్టఫ్ చేసుకున్న వంకాయలను ఒక్కొక్కొటిగా వేసుకొని మధ్యమధ్యలో కలుపుతూ రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి.
  • ఆవిధంగా వేయించుకున్నాక మిగిలిన స్టఫింగ్​ కర్రీలో యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ మీద జాగ్రత్తగా కలుపుతూ మరో రెండు నుంచి మూడు నిమిషాలు మగ్గనివ్వాలి.
  • ఆ తర్వాత అందులో ఒక గ్లాసు వాటర్ పోసుకుని ముక్కలు చిదమకుండా జాగ్రత్తగా మిశ్రమం మొత్తం కలిసేలా కలుపుకొని ఉప్పు సరిచూసుకోవాలి. ఆపై మూతపెట్టుకొని లో ఫ్లేమ్ మీద ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
  • అలా ఉడికించుకున్నాక ప్రెజర్ మొత్తం పోయాక మూత తీసి కొత్తిమీర తరుగు వేసుకొని నెమ్మదిగా కలిపి సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "గుత్తొంకాయ కర్రీ" రెడీ!

గుత్తి వంకాయతో ఘుమఘమలాడే దమ్ బిర్యానీ - ఒక్కసారైనా తిని తీరాల్సిందే గురూ! - ఇలా ప్రిపేర్ చేయండి

ABOUT THE AUTHOR

...view details