తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

స్టీల్​ సింక్​ వాడుతున్నారా? - ఇలా క్లీన్​ చేస్తేనే జిడ్డు, దుర్వాసన పోయి కొత్తదానిలా!

-ప్రస్తుత రోజుల్లో కిచెన్​లో కామన్​గా సింక్​ -ఇలా క్లీన్​ చేస్తేనే ఎక్కువ కాలం మన్నికగా

Steel Sink Cleaning Tips
Steel Sink Cleaning Tips (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 22, 2024, 4:15 PM IST

Steel Sink Cleaning Tips:గిన్నెలు క్లీన్​ చేయడానికి.. కూరగాయలు కడగడానికి.. హ్యాండ్స్​ వాష్​ చేసుకోవడానికి.. ఇలా ప్రతి చిన్న పనికీ మనం ఉపయోగించేది కిచెన్ సింక్‌నే. అయితే కిచెన్​ సింక్​ విషయంలో చాలా మంది ఎన్నో రకాల సింక్స్​ను అమర్చుకుంటుంటారు. అందులో స్టెయిన్‌లెస్ స్టీల్ సింక్​ ఒకటి. ఇవి పెట్టిన కొత్తలో నీట్​గా ఉన్నా.. సరైన విధానంలో వాడకపోయినా, శుభ్రం చేయకపోయినా.. మొత్తం వంటగది లుక్‌నే మార్చేస్తాయి. ఈ క్రమంలో స్టీల్​ సింక్ ఎప్పుడూ కొత్తదానిలా తళతళలాడుతూ ఉండాలంటే ఏం చేయాలో చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

అప్పుడే క్లీన్​ చేయాలి:స్టెయిన్‌లెస్ స్టీల్ సింక్స్ శుభ్రం చేయడానికి చాలా అనువుగా ఉంటాయి. అయితే మనం రోజూ గిన్నెలు శుభ్రం చేసినప్పుడు, కూరగాయలు క్లీన్​ చేసినప్పుడు.. ఎంతో కొంత చెత్త సింక్‌లో ఉండిపోయే అవకాశం ఉంటుంది. అందుకే సింక్‌ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అయితే సింక్ వాడకాన్ని బట్టి ఎన్ని రోజులకోసారి పూర్తిగా శుభ్రం చేసుకోవాలనేది నిర్ణయించుకోవాలంటున్నారు. అంటే అది రోజూ లేదా రెండు రోజులకు ఒకసారి లేకపోతే వారం లేదా 15 రోజులు అనేది చూసుకోమంటున్నారు.

శుభ్రం చేసేందుకు టిప్స్​: సింక్‌ క్లీనింగ్​ అనగానే చాలా మంది రసాయనాలున్న లిక్విడ్స్‌తో గరుకుగా ఉన్న స్క్రబ్స్‌ని ఉపయోగిస్తారు. అయితే రసాయనాలతో కూడిన లిక్విడ్‌ వాష్‌లు, డిటర్జెంట్‌లు ఉపయోగించి సింక్‌ని శుభ్రం చేయడం వల్ల దాని నాణ్యత దెబ్బతింటుందని.. నేచురల్​గా తయారు చేసిన పదార్థాలతో క్లీన్​ చేయడానికే ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు. అందుకోసం.. ఇంట్లోనే ఉండే బేకింగ్ సోడా, వెనిగర్, ఆలివ్ నూనె, నిమ్మ లేదా నారింజ తొక్కలు.. మొదలైనవి ఉపయోగించి సింక్‌ని సులభంగా క్లీన్ చేయచ్చని సలహా ఇస్తున్నారు. అందుకోసం..

  • ముందుగా సింక్‌లో ఎలాంటి చెత్తా లేకుండా చూసుకోవాలి.
  • ఇప్పుడు కొద్దిగా బేకింగ్ సోడా వేసి ఒక మెత్తటి స్పాంజ్ సాయంతో సింక్ అంతా వ్యాపించేలా బాగా రుద్ది, ఆ తర్వాత వెనిగర్‌తో కడగాలి.
  • తర్వాత వాటర్​తో క్లీన్​ చేసి నిమ్మ లేదా నారింజ తొక్కలతో సింక్​ మొత్తాన్ని మెల్లగా రుద్దాలి.
  • ఆ తర్వాత నీళ్లతో మళ్లీ శుభ్రం చేసి, పూర్తిగా తడి ఆరిన తర్వాత సాఫ్ట్​ క్లాత్​పై ఆలివ్‌నూనె వేసి సింక్ మొత్తం తుడవాలి. ఇలా చేయడం వల్ల సింక్ నుంచి బ్యాడ్​ స్మెల్​ రాకుండా, తాజాగా ఉండడంతో పాటు ఎప్పటికీ కొత్తదానిలా మెరిసిపోతుందని అంటున్నారు.

ఈ జాగ్రత్తలు కూడా..

  • లిక్విడ్ సోప్ లేదా ఇతర హౌస్‌హోల్డ్ క్లీనర్స్‌ను స్టెయిన్‌లెస్ స్టీల్ సింకును శుభ్రం చేయడానికి ఉపయోగించకూడదు.
  • సింక్‌లో బ్లీచ్, క్లోరిన్ వంటి పదార్థాలు కూడా ఎక్కువ సమయం ఉంచకూడదు. అలా ఉంచడం వల్ల మెరుపు తగ్గే అవకాశం లేకపోలేదంటున్నారు.
  • స్టీల్ లేదా ఐరన్ స్క్రబ్స్ ఉపయోగించడం వల్ల గీతలు పడతాయి. కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని సింక్‌లో వాడకూడదు.
  • ఉపయోగించిన ప్రతిసారీ నీళ్లు నిల్వ ఉండిపోకుండా చూసుకోవాలి. అందుకోసం వేడినీళ్లలో మైల్డ్ సోప్ కలిపి వాటితో సింక్‌ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.
  • సింక్‌ని తరచూ ఉపయోగించడం వల్ల మచ్చలు ఎక్కువగా పడుతూ ఉంటాయి. కాబట్టి మెత్తని వస్త్రంపై వైట్ వెనిగర్ వేసి తుడవడం వల్ల ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని అంటున్నారు.

కిచెన్​, బాత్​రూమ్​లోని ట్యాప్స్​ జిడ్డుగా మారాయా ? ఇలా క్లీన్​ చేస్తే అప్పుడే కొన్న వాటిలా మెరుస్తాయి!

క్లీనింగ్ ప్రొడక్ట్స్​ కొనాల్సిన పని లేదు - ఇంట్లో ఇవి ఉంటే చిటికెలో దేన్నైనా తళతళా మెరిపించవచ్చు!

ABOUT THE AUTHOR

...view details