తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

ఎన్నిసార్లు చేసినా "ఇడ్లీలు" మెత్తగా రావట్లేదా ? - ఈ కొలతలు, టిప్స్​ పాటిస్తూ చేస్తే దూదిలాంటివి పక్కా!

-హోటల్ స్టైల్​ మృదువైన ఇడ్లీలు ఇంట్లోనే - ఇలా చేస్తే ఎప్పుడైనా చేసుకోవచ్చు పైగా పిండి పులియదు

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Spongy Idly Preparation Process
Spongy Idly Preparation Process (ETV Bharat)

Spongy Idly Preparation Tips : చాలా మంది ఉదయాన్నే ఎంతో ఇష్టంగా తినే బ్రేక్​ఫాస్ట్​ రెసిపీలలో ఇడ్లీలుకూడా ఒకటి. సాఫ్ట్​గా, లైట్​గా ఉండడంతో పాటు, ఆరోగ్యానికి మంచిదని వీటిని తినడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే ఇంట్లో రెగ్యులర్​గా ఇడ్లీలు చేస్తుంటారు. అయితే, ఇంట్లో చేసినప్పుడు ఇడ్లీలు సాఫ్ట్​గాకాకుండా, కొద్దిగా గట్టిగా వస్తుంటాయి. దీంతో కొంతమంది వీటిని చేయడానికి కాస్త వెనకడుగు వేస్తారు. అయితే, ఈ స్టోరీలో చెప్పిన విధంగా కొన్ని టిప్స్​, కొలతలు పాటిస్తూ చేసుకుంటే హోటల్ మాదిరిగా ఎంతో మృదువుగా వస్తాయి. అలాగే ఇడ్లీ పిండి త్వరగా పులిసిపోకుండాఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఇడ్లీలు సాఫ్ట్​గా రావడానికి పిండి ఏ విధంగా ప్రిపేర్​ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు..

  • మినప్పప్పు-కప్పు
  • సన్నని ఇడ్లీ రవ్వ-2 కప్పులు
  • మెంతులు-2 టీస్పూన్లు

ఇడ్లీలు మృదువుగా రావడానికి పిండి ఇలా ప్రిపేర్​ చేసుకోండి..

  • ముందుగా మినప్పప్పును రెండు మూడుసార్లు బాగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే మెంతులను కూడా కడిగి మినప్పప్పులో వేసుకుని నీళ్లు పోసుకోవాలి. 4 నుంచి 5 గంట‌ల పాటు మినప్పప్పు నాన‌బెట్టుకోవాలి. ఇంకా ఎక్కువ సేపు నానబెట్టుకున్నా మంచిదే.
  • ఇడ్లీ పిండిలో కలపడానికి సన్నని రవ్వను తీసుకోండి. ఈ రవ్వలో కొద్దిగా ఉప్పు, నీళ్లు పోసి బాగా కడిగి గంటపాటు నానబెట్టండి.
  • ఇప్పుడు మిక్సీ గిన్నెలో నానిన మినప్పప్పు వేసుకోవాలి. ఇందులో కొద్దికొద్దిగా కూల్​ వాటర్​ యాడ్​ చేసుకుంటూ.. మినప్పప్పు మెత్తగా​ గ్రైండ్​ చేసుకోవాలి. ఇడ్లీ పిండి మరీ పల్చగా, గట్టిగా ఉండకుండా నీళ్లను యాడ్​ చేసుకోవాలి.
  • గ్రైండ్​ చేసుకున్న మినప్పప్పుని ప్లాస్టిక్​ కంటైనర్లోకి తీసుకోండి. ఇడ్లీ పిండి ప్లాస్టిక్​ కంటైనర్లో పెట్టుకోవడం వల్ల తాజాగా ఉంటుంది. అలాగే తొందరగా పులియకుండా ఉంటుంది.
  • తర్వాత ఇడ్లీ రవ్వని చేతితో నీళ్లు లేకుండా పిండి.. మినప్పప్పు పిండిలో కలుపుకోండి. ఇడ్లీ రవ్వ, పిండి బాగా కలిసేలా కలిపి మూత పెట్టండి.
  • మీరు ఉదయం చేసుకోవాలనుకుంటే ఈ పిండిని మొత్తం రాత్రే ప్రిపేర్​ చేసుకోవాలి. సుమారు 8 గంటల తర్వాత ఇడ్లీ పిండి చక్కగా పులిసిపోతుంది. ఇడ్లీ పిండి పొంగితే, బాగా పులిసిందని అర్థం.
  • ఇడ్లీలు చేసుకునే ముందు పిండిని అవసరమున్నంత తీసుకుని.. అందులో కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. మిగతా పిండిని ఫ్రిడ్జ్​లో పెట్టుకోండి.
  • ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసుకుని అందులోకి కొద్దిగా నూనె అప్లై చేసుకోవాలి. లేదంటే వైట్​ కాటన్​ క్లాత్ తీసుకుని బాగా తడిపి పిండి ఇడ్లీ ప్లేట్లలో పెట్టి పిండి వేసుకోవాలి. ఇలా అన్ని ప్లేట్స్​ రెడీ చేసుకోవాలి.
  • ఇప్పుడు ఇడ్లీ కుక్కర్​లో కొద్దిగా నీళ్లు పోసి మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు రెడీ చేసుకున్న ఇడ్లీ ప్లేట్లు పెట్టి స్టవ్​ను మీడియంలో పెట్టి ఓ 5 నిమిషాలు, సిమ్​లో పెట్టి మరో 3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి ఓ 5 నిమిషాలు వదిలేసిన తర్వాత సర్వ్​ చేసుకుని తింటే సూపర్​ సాఫ్ట్​ అండ్​ టేస్టీగా హోమ్​మేడ్​ ఇడ్లీలు రెడీ. ​
  • ఈ విధంగా పక్కా కొలతలు, టిప్స్​తో మీరు ఇడ్లీ పిండి ప్రిపేర్​ చేసుకుంటే ఎన్ని ఇడ్లీలైనా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు.
  • నచ్చితే మీరు కూడా ఇలా ఓ సారి ట్రై చేయండి.

పప్పు నానబెట్టి రుబ్బాల్సిన పనే లేదు - ఈ పదార్థాలతో నిమిషాల్లో అతి మృదువైన ఇడ్లీలు రెడీ!

ఇడ్లీ/దోశ పిండి బాగా పులిసిపోయిందని పారేస్తున్నారా ? - ఇలా చేస్తే తాజాగా మారిపోతుంది! -

ABOUT THE AUTHOR

...view details