Spoiled Milk Used for Cooking :టీ లేదా కాఫీ తయారీ కోసం.. పాలు మరిగిస్తున్నప్పుడు అనుకోకుండా అవి విరిగిపోతుంటాయి. అలాగే పాలు ఎక్కువ టైమ్ ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా బయట ఉంచడం వల్ల కూడా అవి విరిగిపోతాయి. ఇక ఈ విరిగిన పాలను ఏం చేయాలో తెలియక కొంతమంది బయట వృథాగా పారబోస్తుంటారు. మరికొంతమంది మాత్రం కలాకండ్, పనీర్.. వంటివీ చేస్తుంటారు. అయితే, పాలు విరిగినప్రతిసారీ ఇలా చేయడం కుదరదు. కాబట్టి ఈసారి పాలు విరిగితే ఓసారి ఇలా ట్రై చేయమని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
చర్మానికి మెరుపు :చలికాలంలో వాతావరణం చల్లగా ఉండడంతో చర్మం పొడిబారుతుంటుంది. స్కిన్ పొలుసులుగా ఊడిపోతుంది. ఇలాంటప్పుడు విరిగిన పాల మిశ్రమాన్ని స్కిన్‌కి అప్లై చేసుకొని కొద్దిసేపు మర్దన చేసుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత నీటితో కడిగేసుకుంటే చక్కటి ఫలితం ఉంటుందని.. చర్మానికి మెరుపును కూడా అందిస్తుందని అంటున్నారు.
బేకింగ్ మిశ్రమం కోసం : సాధారణంగా బేకింగ్ మిశ్రమాన్ని కలిపే క్రమంలో బటర్, క్రీమ్, పెరుగు వంటివి ఉపయోగిస్తుంటారు. అయితే వీటికి బదులుగా విరిగిన పాలనూ ఉపయోగించవచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా పాన్‌కేక్స్, కేక్స్, బ్రెడ్.. వంటి బేకింగ్ మిశ్రమాల తయారీలో ఈ పాలను ఉపయోగిస్తే అవి మరింత టేస్టీగా, పర్‌ఫెక్ట్‌గా వస్తాయంటున్నారు.
నాన్‌వెజ్ వంటకాల కోసం :చాలా మంది చికెన్, మటన్, చేపలు.. తదితర మాంసాహార వంటకాలు ప్రిపేర్ చేసే ముందు మ్యారినేట్ చేయడం కోసం పెరుగు, మజ్జిగను వాడుతుంటారు. అయితే వీటికి బదులుగా విరిగిన పాలతోనూ ఈ మాంసాన్ని మ్యారినేట్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కర్రీ రుచి మరింత పెరుగుతుందని చెబుతున్నారు.