Spanish Omelette Making Process:ఇంట్లో కోడిగుడ్లు ఉన్నాయంటే ఠక్కున గుర్తొచ్చేది ఆమ్లెట్. కాస్త వెరైటీగా తినాలంటే అప్పుడప్పుడూ బ్రెడ్ ఆమ్లెట్ తింటుంటాం. అయితే.. ఆమ్లెట్ అంటే కేవలం ఎగ్ ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్ మాత్రమే కాదు. ఇంకా చాలా రకాలు ఉన్నాయి. అందులో ఒక రెసిపీని మీ కోసం తీసుకొచ్చాం. అదే స్పానిష్ ఆమ్లెట్. మరి.. ఈ వెరైటీ ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ స్టోరీలో చూద్దాం..
స్పానిష్ ఆమ్లెట్:
కావాల్సిన పదార్థాలు:
- నూనె - 5 టేబుల్ స్పూన్లు
- బంగాళదుంప - 1
- ఉల్లిపాయలు - 1
- కోడిగుడ్లు - 6
- ఉప్పు - రుచికి సరిపడా
- మిరియాల పొడి - అర టీ స్పూన్
ఎగ్ దోశ చేయడం ఇప్పుడు చాలా ఈజీ - ఈ టిప్స్ పాటించండి - టేస్ట్ ఎంజాయ్ చేయండి!
తయారీ విధానం:
- ముందుగా ఆలుగడ్డను చెక్కు తీసి సన్నగా కట్ చేసుకోవాలి.
- అలాగే ఉల్లిపాయలను కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి.
- ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి.
- నూనె వేడెక్కాక సన్నగా తరిగిన ఆలుగడ్డ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్ మీద 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.
- ఆ తర్వాత సన్నగా చీలికలుగా చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద మరో 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.
- ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆలుగడ్డ, ఉల్లిపాయ ముక్కలను నూనె లేకుండా వడకట్టి ఓ గిన్నెలోకి తీసుకోవాలి.
- ఇప్పుడు మరో బౌల్ తీసుకుని అందులోకి 6 గుడ్లు పగలకొట్టి వేసుకోవాలి. ఆ తర్వాత వాటిని బాగా బీట్ చేసుకోవాలి.
- ఇప్పుడు కోడిగుడ్డు మిశ్రమంలో ముందే ఫ్రై చేసుకున్న ఆలుగడ్డ, ఉల్లిపాయ ముక్కలు వేసి మరోసారి బాగా కలుపుకోవాలి.
- ఆ తర్వాత అందులోకి రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ నల్ల మిరియాల పొడి వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి.
- ఇప్పుడు నాన్‌స్టిక్ పాన్ పెట్టి ఆలు, ఉల్లి వేయించగా ఉన్న మిగిలిన నూనె వేసి కోడిగుడ్డు మిశ్రమం పోసి సమానంగా పర్చాలి.
- ఆ తర్వాత మూత పెట్టి దానిని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి.
- ఆ తర్వాత పాన్ కంటే కొంచెం పెద్దగా ఉన్న ప్లేట్ తీసుకుని దానికి నూనె రాసుకోవాలి. ఆ తర్వాత ప్లేట్‌ను పాన్ మీద పెట్టి దానిని ఫ్లిప్ చేసుకోవాలి.
- ఆ తర్వాత నెమ్మదిగా ప్లేట్లోని ఆమ్లెట్‌ను కడాయిలోకి వేసుకోవాలి. రెండో వైపు కూడా ఆమ్లెట్‌ను మరో మూడు నిమిషాలు కుక్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మూత పెట్టాల్సిన అవసరం లేదు.
- అంతే ఎంతో టేస్టీగా అండ్ ప్లఫ్పీగా ఉండే స్పానిష్ ఆమ్లెట్ రెడీ. దీనిని టమాటా కెచప్‌తో తింటే అద్దిరిపోతుంది.
అద్దిరిపోయే రుచితో "కార్న్ క్యాప్సికం మసాలా" - ఇలా చేశారంటే మైమరచిపోవాల్సిందే!
తెలుగు వారికి ఎంతగానో నచ్చే సేమియా ఉప్మా - పొడి పొడిగా ఇలా చేసేయండి - పిల్లలు ఇష్టంగా తినేస్తారు!