తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

పప్పు రుబ్బే పనిలేదు - చిటికెలో "సేమియా ఇడ్లీ" - టేస్ట్​ అద్దిరిపోతాయి! - HOW TO PREPARE INSTANT SEMIYA IDLI

-ఆరోగ్యానికి మేలు చేసే ఇడ్లీలు -అయితే పప్పు రుబ్బకుండానే ఇలా ఈజీగా చేసుకోండి

How to Make Semiya Idli
How to Make Semiya Idli (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 4, 2025, 1:17 PM IST

How to Make Semiya Idli :సహజంగా సేమియాతో చేసే వంటలంటే పాయసం, ఉప్మా, దోశ, కేసరి వంటివి మాత్రమే గుర్తుకువస్తాయి. కానీ ఇవి మాత్రమే కాకుండా సేమియాతో ఇడ్లీ కూడా చేసుకోవచ్చు. దీని కోసం పప్పు నానబెట్టి.. రుబ్బుకోవాల్సిన పనే లేదు. రవ్వ కలపాల్సిన అవసరం అంతకన్నా లేదు. కేవలం నిమిషాల్లో ఎంతో మృదువైన, రుచికరమైన సేమియా ఇడ్లీలను తయారు చేసుకోవచ్చు. మరి ఆ ప్రాసెస్​ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు:

  • నూనె -1 టేబుల్​ స్పూన్​
  • ఆవాలు - 1 టీ స్పూన్​
  • పచ్చి శనగపప్పు - 1 టేబుల్​ స్పూన్​
  • సేమియా - 1 కప్పు/ 110 గ్రాములు
  • పెరుగు - అర కప్పు
  • క్యారెట్​ తురుము - అర కప్పు
  • బొంబాయి రవ్వ - 2 టేబుల్​ స్పూన్లు
  • నీళ్లు - అర కప్పు
  • అల్లం - ఇంచ్​
  • పచ్చిమిర్చి - 2
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కొత్తిమీర - కొద్దిగా

తయారీ విధానం:

  • ముందుగా క్యారెట్​ను పొట్టు తీసి సన్నగా తురుమి పక్కకు పెట్టుకోవాలి. అలాగే అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీరను కూడా సన్నగా కట్​ చేసి ఉంచాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్​ హీటెక్కిన తర్వాత ఆవాలు, పచ్చి శనగపప్పు వేసి ఎర్రగా వేయించుకోవాలి. అయితే ఇందులోకి మీకు ఆవాలు, శనగపప్పు వద్దనుకుంటే పక్కకు పెట్టుకోవచ్చు.
  • ఈ తాలింపు వేగిన తర్వాత స్టవ్​ను సిమ్​లో పెట్టి సేమియా వేసి ఎర్రగా వేయించుకోవాలి. సేమియా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఓ ప్లేట్​లోకి తీసి చల్లారనివ్వాలి.
  • ఇప్పుడు మిక్సింగ్​ బౌల్​ తీసుకుని పెరుగు, క్యారెట్​ తురుము, బొంబాయి రవ్వ వేసి కలుపుకోవాలి.
  • ఆ తర్వాత వాటర్​, వేయించిన సేమియా మిశ్రమం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి అల్లం తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి మూత పెట్టి ఓ 30 నిమిషాలు పక్కన పెట్టాలి.
  • అర గంట తర్వాత మూత తీసి కలపాలి. సేమియాను పట్టుకుని నలిపినప్పుడు మెత్తగా అయితే నానినట్లు అర్థం చేసుకోవాలి. ఒకవేళ సేమియా మిశ్రమం గట్టిగా ఉంటే మరికొన్ని నీళ్లు యాడ్​ చేసుకుని మరో 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా నీళ్లు కలుపుతున్నప్పుడు సేమియా మిశ్రమం అనేది సాధారణంగా చేసుకునే ఇడ్లీ పిండిలా ఉండేలా చూసుకోవాలి.
  • ఇడ్లీ ప్లేట్​లకు నెయ్యి లేదా నూనె అప్లే చేసి సేమియా మిశ్రమాన్ని పల్చగా పోసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని అన్ని ఇడ్లీ ప్లేట్లలోకి అడ్జస్ట్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి ఇడ్లీ పాత్ర పెట్టి అందులో తగినన్ని నీళ్లు పోసుకుని ఇడ్లీ ప్లేట్లను అందులో పెట్టుకోవాలి.
  • మూత పెట్టి మీడియం ఫ్లేమ్​లో 8 నిమిషాలు, సిమ్​లో 5 నిమిషాలు ఉడికించుకుని స్టవ్​ ఆఫ్​ చేసుకోవాలి.
  • వాటిని వేడివేడిగా సర్వ్​ చేసుకుని పల్లీ చట్నీ/ కొబ్బరి చట్నీ/ సాంబార్​తో.. ఎలా తిన్నా టేస్ట్​ అద్దిరిపోతాయి.
  • నచ్చితే మీరూ కూడా ఇంట్లో వీటిని ట్రై చేసి మీ పిల్లలకు తినిపించండి. కలర్​ఫుల్​గా ఉండటం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.

సేమియాతో ఎప్పుడూ రొటీన్​వే ఎందుకు? - ఈసారి 'నవాబి సేమియా' ట్రై చేయండి - తిన్నారంటే వారెవ్వా అనడం పక్కా!

బెస్ట్​ టీ టైమ్​ స్నాక్​ "సేమియా పకోడి" - ఇలా చేస్తే క్రిస్పీ అండ్​ టేస్టీ!

ABOUT THE AUTHOR

...view details