తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

భార్యాభర్తల బంధం​ లైఫ్​లాంగ్​ రొమాంటిక్​గా ఉండాలంటే - సమయం దొరికినప్పుడు ఇలా చేయాలట! - RELATIONSHIP TIPS

దాంపత్య బంధం కలకాలం అన్యోన్యంగా ఉండాలా? - ఈ టిప్స్ పాటిస్తే సరిపోతుందంటున్న నిపుణులు!

Best Tips for Happier Relationship
RELATIONSHIP TIPS (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 19 hours ago

Best Tips for Happier Relationship : ప్రస్తుత రోజుల్లో భార్యాభర్తలు చిన్న చిన్న కారణాలతోనే దూరమవుతున్నారు. ప్రతి చిన్న విషయానికి అపార్థాలు, కోపాలు, అలకలు పెరిగిపోతున్నాయి. దాంతో దాంపత్య బంధంలో ప్రేమభావన, ఆత్మీయత తగ్గి నూరేళ్లు సంతోషంగా గడపాల్సిన వారు మున్నాళ్లకే విడిపోతున్నారు. అలాకాకుండా ఉండాలంటే కొన్ని సూత్రాలు పాటిస్తే భార్యభర్తలమధ్య ప్రేమ, సాన్నిహిత్యం మరింతగా పెరిగి దాంపత్య బంధం బలంగా మారుతుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం పాటించాల్సిన ఆ సూత్రాలేంటో ఇప్పుడు చూద్దాం.

భార్యభర్తల మధ్య బంధం దృఢంగా ఉండాలంటే ప్రేమను పంచుకోవడం, ఒకరి అభిరుచుల్ని మరొకరు గౌరవించుకోవడం, ఓదార్పునివ్వడం, సర్‌ప్రైజ్ చేసుకోవడం వంటివి చేయాలి. అయితే, ఇవి మాత్రమే కాకుండా రొమాన్స్ కూడా జోడిస్తే ఆ బంధంలోని మధురానుభూతి ఆకాశపుటంచులు తాకుతుందని చెబుతున్నారు నిపుణులు. అందుకోసం ఇవి ఫాలో అయితే సరిపోతుందంటున్నారు.

ఐ లవ్యూ చెబుతున్నారా?

"ఐ లవ్యూ" ఈ మాట లవర్స్మాత్రమే కాదు భార్యాభర్తలూ చెప్పుకోవాలి. అయితే, ఇలా చెప్పుకోకపోతే ఇద్దరి మధ్య ప్రేమ లేదని కాదు, అలాగని డైలీ చెప్పినా బోర్​గా అనిపించొచ్చు! కాబట్టి అప్పుడప్పుడూ విభిన్న రీతుల్లో, వేర్వేరు భాషల్లో ఐలవ్యూ చెప్పడానికి ట్రై చేయాలి. ఇలా చెప్పుకోవడం ఇద్దరికీ సరదానూ పంచుతుంది. ఇక బర్త్​ డే, మ్యారేజ్ డే, వాలెంటైన్స్ డే వంటి ప్రత్యేక సందర్భాల్లో మీ పార్ట్​నర్​కి నచ్చిన గిఫ్ట్​ కొని దాన్ని ఇస్తూ ఐ లవ్యూ చెబితే మరి సర్​ప్రైజింగ్​గా ఉంటుంది.

సమయం దొరికినప్పుడు ఇలా చేయాలి!

ఓ నవ్వు లైఫ్​లోని బాధల్ని మరిపిస్తుంది. అలాగే భార్యాభర్తల మనసుల్ని కూడా మరింత దగ్గర చేస్తుందంటున్నారు నిపుణులు. అందుకే ఇద్దరికి సమయం దొరికినప్పుడు దంపతులిద్దరూ అనవసర విషయాలతో కాలక్షేపం చేయకుండా, జోక్స్, నవ్వు తెప్పించే చిన్నప్పటి జ్ఞాపకాలు వంటివి షేర్ చేసుకోవాలి. అదేవిధంగా, ఉదయం లేదా సాయంత్రం ఇద్దరూ కలిసి చేతిలో చెయ్యేసి కాసేపు అలా నడుస్తూ రొమాంటిక్‌ వాక్‌ చేయడం బెటర్. అలాగే టైమ్ దొరికినప్పుడైనా ఇద్దరూ కలిసి తమకు నచ్చిన కామెడీ, రొమాంటిక్సినిమాలు చూడడమూ అలవాటు చేసుకోవాలంటున్నారు. ఇలా ఖాళీ సమయం దొరికినప్పుడల్లా భార్యాభర్తలు కలిసి రొమాంటిక్‌గా గడపడం వల్ల వారి మధ్య సాన్నిహిత్యం మరింతగా పెరిగే ఛాన్స్ ఉంటుందంటున్నారు.

నచ్చేలా, మెచ్చేలా!

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది దంపతులు క్షణం తీరికలేకుండా గడుపుతున్నారు. అయితే, కనీసం హాలిడే ఉన్నప్పుడో, అలా బయటకు వెళ్లినప్పుడో, లేదంటే ఏవైనా పండగలు, ప్రత్యేక సందర్భాలప్పుడో ఒకరికొకరు ఆకర్షణీయంగా కనిపించేలా అందంగా రడీ అవ్వాలి. అంతేకాదు, ఆ క్షణం మీ భాగస్వామిపై మీకున్న ఫీలింగ్‌ని వారితో చెప్పేయాలి. అవసరమైతే దగ్గరికి తీసుకొని లేదంటే నుదుటిపై ఓ ముద్దు పెడుతూ, ప్రేమగా హత్తుకుంటూ, రొమాంటిక్‌గా మీ మనసులోని భావాల్ని వ్యక్తపరచాలి. ఇలా చేయడం ద్వారా ఇద్దరి మధ్య ప్రేమ హద్దులు దాటుతుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు నిపుణులు.

ఇవీ చదవండి :

జీవిత భాగస్వామి దూరంగా ఉన్నారా? - ఇలా దగ్గరైపోండి!

'పెళ్లై ఇద్దరు పిల్లలున్నా.. అమ్మాయిలతో తిరుగుతున్నాడు' - ఏం చేయాలి?

ABOUT THE AUTHOR

...view details