Recipes of Over Cooked Rice at Home:బ్రేక్‌ఫాస్ట్‌లు చేసే తీరిక, ఓపిక లేక మెజార్టీ పీపుల్ మూడు పూటలా అన్నాన్నే తింటుంటారు. అయితే అన్నం వండేటప్పడు నీళ్లు ఎక్కువైతే మెత్తగా అవుతుంది. లేదా ప్రెషర్ కుక్కర్లో వండుతున్నప్పుడు విజిల్స్ రాకపోయినా అన్నం మెత్తగా ఉడుకుతుంది. దీంతో ఇలా ఉడికిన అన్నాన్ని తినలేక చాలా మంది పారేస్తుంటారు. అయితే ఇకపై అన్నం మెత్తగా మారినప్పుడు పడేయాల్సిన అవసరం లేకుండా ఎంతో రుచికరమైన వంటలు చేసుకోవచ్చు. ఆ రెసిపీలు ఏంటో ఈ స్టోరీలో చూడండి.
క్రిస్పీ కాయిన్:
కావాల్సిన పదార్థాలు:
- ఉడికించిన అన్నం
- ఉడికించిన బంగాళాదుంపలు - 2
- మిరియాల పొడి - 1 టీ స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- చాట్ మసాలా - అర టీ స్పూన్
- పచ్చిమిర్చి - 2
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- బ్రెడ్ పొడి - పావు కప్పు
తయారీ విధానం:
- ఉడికించిన అన్నాన్ని ఓ గిన్నెలో వేయాలి. అందులోనే ఉడికించి పొట్టు తీసిన బంగాళాదుంపలు, ఉప్పు, మిరియాలపొడి, చాట్ మసాలా, పచ్చిమిర్చి, కొత్తిమీర, బ్రెడ్‌పొడి వేసి కలపాలి.
- ఈ మిశ్రమాన్ని గుండ్రని ముద్దల్లా చేసి, ఆ తరవాత అరచేతిలో పెట్టి మందపాటి కాయిన్ ఆకారంలో వత్తాలి.
- ఆపై దానికి ముక్కూ చెవులూ వచ్చేలా చేసి కాగిన నూనెలో వేసి సిమ్‌లో వేయించి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సరి.
వెజిటబుల్ రోల్:
- ఉడికించిన అన్నం
- క్యారెట్ - 1
- ఉల్లిపాయ - 1
- క్యాబేజీ - సగం ముక్క
- క్యాప్సికం - 1
- ఉడికించిన బఠానీ - పావు కప్పు
- ఉప్పు- రుచికి సరిపడా
- మిరియాల పొడి - 1 టీ స్పూన్
- సోయా సాస్ - 1 టీ స్పూన్
- టమాట సాస్ -1 టీ స్పూన్
తయారీ విధానం:
- ఉడికించిన అనాన్ని మిక్సీలో మెత్తగా దోశల పిండిలా రుబ్బుకోవాలి. ఆపై ఓ గిన్నెలోకి తీసుకుని చిటికెడు ఉప్పు వేసి కలపాలి.
- స్టవ్ ఆన్ చేలి దోశ పెనం పెట్టి ఈ మిశ్రమాన్ని పల్చగా పేపర్ దోశలా వేసి ఓ ప్లేట్లోకి తీసుకోవాలి.
- మరోవైపు క్యారెట్, క్యాబేజీ, ఉల్లిపాయ, క్యాప్సికమ్ సన్నగా తరిగి అందులోనే ఉడికించిన బఠాణీలూ వేసి కలపాలి.
- పాన్‌లో కాస్త నూనె వేసి కూరగాయల ముక్కలు వేసి మగ్గించుకోవాలి.
- అవి కాస్త మగ్గాక ఉప్పు, మిరియాలపొడి, సోయాసాస్, టమాటా సాస్ వేసి కలిపి దించాలి.
- చల్లారాక ఈ మిశ్రమాన్ని పేపర్ దోసెలో పెట్టి రోల్ చేసి విడిపోకుండా టూత్‌పిక్‌తో గుచ్చాలి. ఇలాగే అన్నీ చేసుకోవాలి.
- ఆ తర్వాత కాగిన నూనెలో వేయించి తీసి చట్నీతో సర్వ్ చేస్తే సూపర్ టేస్టీ వెజిటేబుల్ రోల్ రెడీ.
ఇవి కూడా: మెత్తగా ఉడికిన అన్నానికి కూరగాయ ముక్కలు జోడించి కిచిడీగా చేసుకోవచ్చు. మరీ ముద్దలా ఉంటే అందులో పాలు, పంచదార, యాలకులపొడి చేర్చి పుడ్డింగ్‌లానూ చేసుకోవచ్చు. లేదంటే దధ్యోజనంలానూ చేసుకుని తినొచ్చు. సో చూశారుగా మెత్తగా ఉడికిన అన్నాన్ని కూడా ఎలా తినొచ్చా. కాబట్టి ఈసారి అన్నాన్ని పడేయకుండా ఇలా చేయండి పిల్లలు ఇష్టంగా తింటారు.
దూదిలాంటి మెత్తటి 'స్పాంజ్ సెట్ దోశ'- రొటీన్‌గా కాకుండా ఇలా ఈజీగా చేసుకోండి! టేస్ట్ అదుర్స్!!
నాన్‌వెజ్ కంటే రుచికరంగా "జామకాయ మసాలా కర్రీ" - అన్నం, రోటీ, పులావ్‌లోకి సూపర్ కాంబో!