ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / offbeat

"హోటల్​ స్టైల్​ క్రిస్పీ దోశలు" - పక్కా కొలతలతో పర్ఫెక్ట్​గా వస్తాయి! - HOTEL STYLE CRISPY DOSA

అటుకులతో అద్దిరిపోయే దోశలు - ఇలా చేస్తే ఒకటికి రెండు తినాల్సిందే!

Poha Dosa Recipe
Poha Dosa Recipe in Telugu (Getty Images)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 24, 2025, 11:35 AM IST

Poha Dosa Recipe in Telugu :క్రిస్పీగా ఎర్రగా ఉండే హోటల్​ స్టైల్​ దోశలంటే అందరికీ ఇష్టమే! ఈ దోశలు చేయడానికి చాలా మంది ఇంట్లో ఎన్నోసార్లు ప్రయత్నించి ఉంటారు. అయినా కూడా కొన్నిసార్లు దోశలు మెత్తగా వస్తుంటాయి. అయితే, ఒక్కసారి ఈ స్టోరీలో చెప్పిన విధంగా కొలతలు పాటించి అటుకుల దోశలు ట్రై చేయండి. అచ్చం హోటల్​ స్టైల్​ క్రిస్పీ దోశలనుఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇక ఆలస్యం చేయకుండా అటుకుల దోశ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు? తయారీ విధానం ఏంటో చూసేయండి!

కావాల్సిన పదార్థాలు :

  • బియ్యం - 1 కప్పు
  • అటుకులు - అరకప్పు
  • పెరుగు - అరకప్పు
  • మినపపప్పు - 1 టేబుల్​స్పూన్​
  • ఉప్పు - రుచికి సరిపడా
  • వంటసోడా - పావుచెంచా
  • నూనె - తగినంత

రేషన్ బియ్యంతో మెత్తని దూదిలాంటి ఇడ్లీలు - రవ్వ కొనాల్సిన అవసరమే లేదు!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా ఒక మిక్సింగ్​ బౌల్లో బియ్యం తీసుకోండి. ఇందులో అటుకులు, మినప్పప్పు వేసి శుభ్రంగా కడగండి. ఆపై బౌల్లో నీళ్లు పోసి రెండుగంటల పాటు నాననివ్వండి.
  • తర్వాత మరో గిన్నెలో పెరుగు వేసి బాగా చిలకండి. తర్వాత నీళ్లు పోసుకుని పల్చని మజ్జిగలా చేసుకోండి. అనంతరం రెండుగంటలు నీటిలో నానబెట్టిన బియ్యం, అటుకుల మిశ్రమాన్ని మజ్జిగలో వేసి 3 గంటలు నానబెట్టండి.
  • తర్వాత మిక్సీ గిన్నెలో ఈ మిశ్రమం వేసుకుని మజ్జిగతోనే మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఇలా గ్రైండ్​ చేసుకున్న మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి తీసుకోండి. ఇందులో వంటసోడా, రుచికి సరిపడా ఉప్పు వేసి పూర్తిగా కలపాలి. ఆ తర్వాత మూత పెట్టి ఓ నాలుగు గంటలు లేదా రాత్రి మొత్తం పులిసేలా పక్కన ఉంచాలి.
  • ఆ మరుసటి రోజు మార్నింగ్​ పిండిని మరొక్కసారి బాగా కలపండి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి దోశ పెనం పెట్టి వేడి చేసుకోవాలి. పాన్​ వేడెక్కిన తర్వాత పిండిని పల్చగా దోశలా వేసుకోవాలి.
  • ఆపై అంచుల వెంట కొద్దిగా నూనె వేసుకుని దోశను ఎర్రగా కాల్చుకోవాలి. ఈ దోశ కాలుతున్న సమయంలో స్టవ్​ మీడియం ఫ్లేమ్​లో అడ్జస్ట్​ చేసుకోండి. లేదంటే దోశ మాడిపోయే అవకాశం ఉంటుంది.
  • ఈ దోశపై మీరు ఆలూ కర్రీ, నెయ్యి కారం కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా దోశ ప్రిపేర్​ చేసుకుంటే రుచి ఇంకా బాగుంటుంది.
  • క్రిస్పీగా కాలిన దోశను వేడివేడిగా కొబ్బరి చట్నీ, అల్లం పచ్చడితో తింటే సూపర్​గా ఉంటుంది.
  • అంతే మిగిలిన పిండితో ఇలా దోశలు వేసుకుంటే సరి. ఈ అటుకుల దోశలు చేయడానికి నాన్​స్టిక్ పాన్​ కంటే మందంగా ఉండే దోశ పెనం ఉపయోగిస్తే దోశలు ఇంకా ఎర్రగా సూపర్​ టేస్టీగా వస్తాయి.
  • అటుకుల దోశలను పిల్లలు, పెద్దలందరూ ఎంతో ఇష్టంగా తింటారు.
  • ఈ క్రిస్పీ అటుకుల దోశ నచ్చితే మీరు ఓసారి ఇంట్లో ట్రై చేయండి.

టిఫిన్స్​లోకి ఎప్పుడూ పల్లీ చట్నీనే కాదు - ఇలా​ "మురుగన్​ చట్నీ" ఓసారి ట్రై చేయండి!

కొనే పనిలేకుండా ఇంట్లోనే "దోశ మిక్స్‌ పౌడర్‌"! - కేవలం 5 నిమిషాల్లోనే వేడివేడి దోశ రెడీ!

ABOUT THE AUTHOR

...view details