YS Sharmila Comments on Jagan for Protesting in Assembly: జనాలు ఛీకొడుతున్నా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ తీరు మాత్రం మారడం లేదని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. నేడు అసెంబ్లీకి వచ్చింది 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి 11 నిమిషాలు ఉండేందుకా? అని నిలదీశారు. ప్రజా సమస్యల కన్నా జగన్‌కు ప్రతిపక్ష హోదానే ముఖ్యమా సభ్యత్వాలు రద్దవుతాయనే భయంతో అటెండెన్స్ కోసం వచ్చారా అని ప్రశ్నించారు.
కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడానికి జగన్‌కు ప్రతిపక్ష హోదానే కావాలా అని షర్మిల అన్నారు. ప్రజల శ్రేయస్సు కంటే పదవులే ముఖ్యమని అసెంబ్లీ సాక్షిగా నిరూపించుకున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ సభ్యులకు పదవులు ముఖ్యం కాదు అనుకుంటే ప్రజాసమస్యల మీద చిత్తశుద్ధి ఉంటే మంగళవారం నుంచి అసెంబ్లీకి వెళ్లాలని హితవుపలికారు. సభకు వెళ్లే దమ్ము లేకపోతే తక్షణం పదవులకు రాజీనామాలు చేయాలని షర్మిల పేర్కొన్నారు.
గవర్నర్ ప్రసంగంలో పసలేదు: మరోవైపు గవర్నర్ ప్రసంగంలో పసలేదని షర్మిల విమర్శలు గుప్పించారు. సూపర్ సిక్స్ హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన లేదని ఆక్షేపించారు. హామీల అమలు కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు గవర్నర్ ప్రసంగం నిరాశను మిగిల్చిందని షర్మిల అన్నారు. కొత్త సీసాలో పాత సారా అనే సామెత లెక్క కూటమి మ్యానిఫెస్టోనే గవర్నర్ చదివారు తప్పిస్తే కొత్త అంశాలు ఒక్కటి లేవని షర్మిల మండిపడ్డారు.
గవర్నర్ గారి ప్రసంగంలో పసలేదు. దిశా-నిర్దేశం అంతకన్నా లేదు. అన్ని అర్థసత్యాలు, పూర్తి అబద్ధాలు. సూపర్ సిక్స్ హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన లేదు. సంక్షేమం, పునరుజ్జీవనం అంటున్నారే కానీ ఎప్పటి నుంచి అమలు చేస్తారో క్లారిటీ లేదు. ఇచ్చిన గ్యాస్ సిలిండర్ తప్పా మిగతా 5 హామీలపై స్పష్టత…
— YS Sharmila (@realyssharmila) February 24, 2025
సభ్యత్వాలు పోతాయనే భయం - అందుకే అలా వచ్చి వెళ్లారు: అచ్చెన్నాయుడు
జగన్‌కి కావాల్సింది ప్రతిపక్ష హోదా మాత్రమే ప్రజా సమస్యలు కాదు: మంత్రులు