ETV Bharat / offbeat

పోషకాల పరంగా ఏ చేపలు మంచివో తెలుసా? - ఆరోగ్యానికి సముద్ర చేపలు మంచివేనా? - SEA FOOD BENEFITS

చేపల్లో ఎన్నో రకాలు - సముద్ర, మంచినీటి చేపల్లో పోషకాల్లో తేడా

omega-3_fatty_acids_in_fish
omega-3_fatty_acids_in_fish (GettyImages)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 24, 2025, 5:12 PM IST

Omega-3 Fatty Acids in Fish : బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ రేట్లు పతనం కాగా, చేపల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నదులు, సముద్ర తీర ప్రాంతాల్లో ధరల్లో పెద్దగా తేడా లేనప్పటికీ పట్టణాలు, నగరాల్లో చేపల వ్యాపారులు ధరలను అమాంతం పెంచేసి అమ్ముతున్నారు. ఈ ధరల విషయం పక్కనబెడితే అసలు చేపల్లో ఏ రకం మంచివో తెలియక జనం తల పట్టుకుంటున్నారు. మంచి నీటి చేపలు బెటరా? ఉప్పు నీటి చేపలు మంచివా? అనే సందిగ్ధంలో ఉన్నారు. నదుల్లో దొరికే చేపల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయా లేక సముద్ర చేపల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయా అనే విషయం ఇవాళ తెలుసుకుందాం.

నాన్ వెజ్ ప్రియులు ఎక్కువగా ఇష్టపడేది చేపలే! మాంసాహారంలో చేపల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. చికెన్, మటన్​ నెలలో రెండు, మూడు సార్లు తీసుకుంటే సరిపోతుంది. కానీ, చేపలు అంతకు మించి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనట.

omega-3_fatty_acids_in_fish
omega-3_fatty_acids_in_fish (GettyImages)

10నిమిషాల్లో చిక్కటి గడ్డ పెరుగు - రసాయనాలు లేకుండానే చిన్న చిట్కాతో ఇలా తయారు చేసుకోండి

చేపల్లో అనేక రకాలు ఉంటాయి. కొంత మంది వాటిని నల్ల చేపలు, తెల్ల చేపలుగా వర్గీకరిస్తుంటారు. ఇంకొందరు రవ్వ, బొచ్చ, కొర్రమీను అంటూ చేపల్లో రకాల గురించి చెప్తుంటారు. చేపల వేపుడు, చేపల కూర, చేపల సూప్ ఉన్నట్లే చేపల్లోనూ రకాలున్నాయి. నది చేపలు, చెరువు చేపలు, సముద్ర చేపలు, బురద గుంటల్లో చేపలు ఇలా ఎన్నో రకాలున్నాయి. వాటన్నింటినీ ప్రధానంగా నది చేపలు, సముద్రపు చేపలుగా రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. మంచి నీటి చేపలతో పోలిస్తే ఉప్పు నీటి చేపల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.

omega-3_fatty_acids_in_fish
omega-3_fatty_acids_in_fish (ETV Bharat)

చేపలలో అనేక రకాల పోషకాలు ఉంటాయి, ఇవి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చేపల్లో లభించే ముఖ్యమైన పోషకాలు:

  • చేపల్లో లభించే అధిక నాణ్యమైన ప్రొటీన్ కండరాల నిర్మాణం, మరమ్మతుకు సహకరిస్తుంది.
  • ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చేపల్లో అధికంగా లభిస్తాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు రక్తపోటును తగ్గించి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
  • చేపల్లో విటమిన్ డి, విటమిన్ బి2 (రిబోఫ్లావిన్), విటమిన్ బి12 సహా కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, జింక్, అయోడిన్, మెగ్నీషియం వంటి ఖనిజాలు లభిస్తాయి. సెలీనియం, నియాసిన్, టౌరిన్ లాంటి ముఖ్యమైన పోషకాలను చేపల ద్వారా లభిస్తాయి.
  • చేపల్లో లభించే మంచి కొవ్వులు ఆరోగ్య పరంగా అనేక ప్రయోజనాలు కలిగిస్తాయి.

మంచినీటి చేపలు అంటే!

నదులు, సరస్సులు, చెరువుల్లో పెరిగే చేపలు పురుగులు, మొక్కలు, నాచు, కీటకాలను తిని పెరుగుతాయి. ఇలాంటి చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పరిమాణం తక్కువగా ఉంటుందట.

సముద్ర చేపల్లో అధికం

నదీ చేపలతో పోలిస్తే సముద్ర చేపల్లో ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయట. వీటిలో పెద్దవి కాకుండా సాల్మన్, ట్యూనా, మాకేరెల్, సార్డినెస్, హెర్రింగ్ వంటి చిన్న చేపలు ఆరోగ్య పరంగా చాలా బెటర్. ప్రోటీన్‌ సమృద్ధిగా లభించడంతో పాటు చర్మం కాంతి వంతగా ఉంచడంలో సహకరిస్తాయి. నది చేపలతో పోలిస్తే సముద్ర చేపల్లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది.

కశ్మీర్​ స్టైల్​ మటన్​ "రోగన్‌ జోష్‌" - ఒక్కసారి రుచి చూస్తే మళ్లీమళ్లీ చేసుకుంటారు!

'షుగర్ పేషెంట్లకు సూపర్ ఫుడ్'! - జొన్నపిండితో అప్పటికప్పుడు హెల్దీ దోసెలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.