తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

అమ్మమ్మల కాలంనాటి పెసరపప్పు రసం - ఆహాఁ జుర్రుకుంటారు! - PESARA PAPPU RASAM MAKING PROCESS

- నేటి జనరేషన్​ కు తెలియని సూపర్ రెసిపీ - ప్రతి ఒక్కరూ రుచి చూసి తీరాల్సిందే!

Pesara pappu rasam
Pesara pappu rasam (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 15, 2025, 7:12 PM IST

Pesara pappu rasam : ఈ రోజుల్లో పప్పు చారు చేయడం అంటే కుక్కర్​లో వేసి ఉడికించడం, దానికి తాలింపుపెట్టేసి తినేయడం ఇంతే. కానీ, అసలైన రుచిని ఆస్వాదించాలంటే మాత్రం పాతకాలంలోకి వెళ్లాల్సిందే. అలాంటి రుచికరమైన రెసిపీని మీకోసం తీసుకొచ్చాం. అదే అమ్మమ్మల కాలంనాటి పెసరపప్పు రసం. మరి, దీన్ని ఎలా తయారు చేయాలి? ఏమేం ఇంగ్రీడియంట్స్ కావాలి? అన్నది ఇప్పుడు చూద్దాం.

కావలసిన పదార్థాలు :

పెసరప్పు - 1/2 కప్పు

నిలువునా చీరుకున్న ఉల్లిపాయ ముక్కలు - 1/2 కప్పు

పచ్చిమిర్చి - 6

నీళ్లు - 1/2 లీటర్

పసుపు - 1/2 టీస్పూన్

నిమ్మరసం - 3 స్పూన్లు

ఉప్పు - తగినంత

మసాలా కోసం :

నెయ్యి లేదా నెయ్యి - 2 స్పూన్లు

ఎండు మిరపకాయలు - 2

ఆవాలు - 1 టీస్పూన్

జీలకర్ర - 1 స్పూన్

కరివేపాకు - 4 రెమ్మలు

ఇంగువ - చిటికెడు

కొత్తిమీర - 1 కట్ట

తయారీ విధానం :

పెసర పప్పును ముందుగా చిన్న మంటపై వేయించండి. అవి ఫ్రై అవుతున్నప్పుడు మంచి సువాసన వస్తుంది. సరిగ్గా వేగిన తర్వాత దింపేసి పక్కన పెట్టండి.

కాస్త చల్లారిన తర్వాత శుభ్రంగా కడిగి, రెండున్నర కప్పుల నీటిలో వేసి మెత్తని పేస్ట్‌ మాదిరిగా ఉడికించాలి.

మరో గిన్నెలో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు, నీళ్లు పోసి ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించండి.

ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్లో ఉడికించిన పప్పు పేస్టు వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమం సాంబార్ మాదిరిగా మారుతుంది. దీన్ని 3 నుంచి 4 నిమిషాలపాటు ఉడికించాలి. ఇది చిక్కగా అనిపిస్తే మీరు మరికొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు.

మరుగుతున్న రసంలోనే నిమ్మరసం వేసి స్టవ్ ఆఫ్ చేయండి.

ఆ తర్వాత మసాలా దినుసులు ఒక్కొక్కటిగా వేసి, బాగా మిక్స్ చేయండి.

అంతా పూర్తయిన తర్వాత తరిగిన కొత్తిమీర వేసేయండి.

అంతే అద్దిరిపోయే పెసరపప్పు రసం సిద్ధమైపోతుంది.

ముఖ్యమైన సూచనలు :

ప్రతీ పప్పు చారులో చింతపండు తప్పకుండా ఉంటుంది. కానీ, ఈ పెసరపప్పు రసంలో చింతపండు రసం ఉండదు. బదులుగా నిమ్మరం వాడుతాం. అందువల్ల తప్పకుండా నిమ్మకాయలు కావాల్సిందే.

తేలికైన ఫుడ్ తినాలనిపిస్తే ఇది సూపర్ ఛాయిస్. వేడి వేడి అన్నంలో నెయ్యితో తింటే వేరే లెవెల్​లో ఉంటుంది.

పెసరపప్పును వండడానికి ముందు కాస్త వేయించాలి. ఇలా వేయించడం వల్ల ఎంతో అద్భుతమైన రుచి వస్తుంది.

పప్పులో సహజంగా ఎర్రకారం వేస్తుంటారు. కానీ.. ఇక్కడ దానికి బదులుగా వాడే గ్రీన్ చిల్లీస్ మంచి టేస్ట్​ను అందిస్తాయి.

ఇవి కూడా చదవండి :

నోరూరించే "గుమ్మడికాయ పప్పు చారు"- ఇలా చేస్తే రుచి ఎప్పటికీ మర్చిపోలేరు!

నిమిషాల్లో ప్రిపేర్​ అయ్యే ఆంధ్ర స్టైల్​ "పప్పు చారు" - ఇలా చేస్తే తినడమే కాదు తాగేస్తారు కూడా

ABOUT THE AUTHOR

...view details