తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

చలికాలంలో వేడి వేడి "మిరియాల చారు" - దగ్గు, జలుబుకు చక్కటి మందు - HOW TO MAKE PEPPER RASAM IN WINTER

-మిరియాల చారుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు - రుచికి రుచీ.. ఆరోగ్యానికి ఆరోగ్యం

How to Make Pepper Rasam in Winter
How to Make Pepper Rasam in Winter (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Dec 26, 2024, 11:38 AM IST

How to Make Pepper Rasam in Winter :తెలుగు రాష్ట్రాల్లో చలి విపరీతంగా పెరిగిపోయింది. చాలా చోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక చలికాలం అంటే చాలా మంది వేడి వేడి చారు, రసానికి ప్రిఫరెన్స్​ ఇస్తారు. అందుకే మీకోసం మిరియాల రసం తీసుకొచ్చాం.

ఈ చారు కేవలం అద్భుతమైన రుచికోసమే కాకుండా.. ఈ సీజన్​లో వచ్చే జలుబు, దగ్గు సమస్యల నుంచి కాపాడుకోవడానికి కూడా చక్కగా పనిచేస్తుంది. అంతేకాదు.. ఈ చారు చేయడానికి ఎంతో సమయం పట్టదు. కేవలం 5 నిమిషాల్లోనే సిద్ధమైపోతుంది. ఈ రెసిపీకి కాంబినేషన్​గా బంగాళాదుంప ఫ్రై మొదలు.. ఏ వేపుడు అయినా చాలా టేస్టీగా ఉంటుంది. మరి.. ఇంతటి రుచికరమైన మిరియాల చారును ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు..

  • మిరియాలు - 1 టేబుల్ స్పూన్
  • జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
  • వెల్లుల్లి రెబ్బలు - 10 - 12
  • నూనె - 1 టేబుల్ స్పూన్
  • ఆవాలు - 1 టేబుల్ స్పూన్
  • పసుపు - పావు టేబుల్ స్పూన్
  • ఎండు మిర్చి - 3
  • టమాట - 1(పెద్దది)
  • ఉప్పు - రుచికి సరిపడా
  • చింతపండు - పెద్ద నిమ్మకాయ సైజు (నానబెట్టి రసం సిద్ధం చేసుకోవాలి)
  • కరివేపాకు - 3 రెమ్మలు
  • కొత్తిమీర – చిన్న కట్ట
  • ఇంగువ - 2 చిటికెలు

తయారీ విధానం..

  • ముందుగా నిమ్మకాయ సైజు​ చింతపండును నానబెట్టి దాని నుంచి రసాన్ని తీసి అందులో 600ml నీళ్లు కలిపి పక్కన ఉంచాలి.
  • ఇప్పుడు మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ ఆన్​ చేసి పాన్​ పెట్టి.. అందులో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, పసుపు, ఎండుమిర్చి వేసి వేగనివ్వాలి.
  • ఆ తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్​ మీద మగ్గించుకోవాలి.
  • అనంతరం రుచికి సరిపడా ఉప్పు వేసి టమాట ముక్కలు మెత్తగా ఉడికి గుజ్జులా మారేవరకు మగ్గించుకోవాలి.
  • ఆ తర్వాత ముందే సిద్ధం చేసుకున్న చింతపండు రసం పోసి బాగా కలపాలి. తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న మిరియాల మిశ్రమం వేసి మరోసారి బాగా కలపాలి.
  • ఇప్పుడు కాడలతో సహా కరివేపాకు, కొత్తిమీర, ఇంగువ వేసి కలుపుకోవాలి.
  • మీడియం ఫ్లేమ్​ మీద చారు ఓ పొంగు వచ్చే వరకు ఉంచి, స్టవ్​ ఆఫ్​ చేసి దించుకుంటే.. ఎంతో రుచికరమైన మిరియాల చారు రెడీ.
  • ఈ మిరియాల చారు అన్నంతోపాటు ఇడ్లీ, వడ వంటి టిఫెన్​లోనూ సూపర్​గా ఉంటుంది.
  • జలుబు, దగ్గుతో బాధపడుతున్న వారు.. వడకట్టి ఛాయ్​ మాదిరిగా తాగితే ఎంతో రిలీఫ్​గా ఉంటుంది.

ఈ టిప్స్​ కంపల్సరీ:

  • మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిని రోట్లో దంచితేనే చారు రుచి వస్తుంది. మిక్సీలో వేస్తే ఫ్లేవర్​ మిస్ అవుతుంది.
  • ఇక.. కొత్తిమీర, కరివేపాకును కాడలతో సహా చారులో వేసేయాలి.
  • అన్నిటికన్నా ముఖ్యమైనది.. చారు ఒక్క పొంగుతోనే దింపేసుకోవాలి. బాగా మరిగితే చారులోని సువాసన తగ్గిపోతుంది.

సూపర్ టేస్టీ : 10 నిమిషాల్లో టమాటా మిరియాల రసం - ఇలా ప్రిపేర్ చేస్తే ఒట్టి రసం కూడా తాగేస్తారు!

నిమిషాల్లో ఘుమఘుమలాడే "మైసూర్​ రసం" - ఇలా చేశారంటే సూపర్​ టేస్ట్​ పక్కా! తినడమే కాదు తాగేస్తారు కూడా!

వింటర్​ స్పెషల్​ - ఘుమఘుమలాడే "కళ్యాణ రసం" - ఇలా చేస్తే తినడమే కాదు డైరెక్ట్​గా తాగేస్తారు కూడా!

ABOUT THE AUTHOR

...view details