తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

"పాలకూర కిచిడీ" పోషకాల పంట - నిమిషాల్లో ప్రిపేర్​ చేసుకోండిలా - HOW TO MAKE PALAK KHICHDI AT HOME

-పాలకూరలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు -పిల్లలు పాలకూరను తినకపోతే ఓసారి ఇలా కిచిడీ ట్రై చేయండి

How to Make Palak Khichdi at Home
How to Make Palak Khichdi at Home (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

How to Make Palak Khichdi at Home : పాలకూర.. ఆరోగ్యానికి మేలు చేసే ఆకుకూరల్లో ఇదీ ఒకటి. ఇందులో విటమిన్లు, మినరల్స్ సహా ఎన్నో పోషకాలు ఉన్నాయి. అందుకే.. డాక్టర్లు కూడా దీనిని ఆహారంలో భాగం చేసుకోవాలని చెబుతుంటారు. అయితే చాలా మంది పాలకూరతో కేవలం కూర, పకోడీ వంటివి మాత్రమే ఎక్కువగా చేసుకుంటారు. అయితే.. పాలకూరతో అద్దిరిపోయే కిచిడీ కూడా చేసుకోవచ్చు. టేస్ట్​ సూపర్​గా ఉంటుంది. ఒకవేళ మీ పిల్లలు పాలకూర తినడానికి అంతగా ఆసక్తి చూపించకపోతే.. కిచిడీ చేసి పెట్టండి. వద్దనకుండా తినేస్తారు. మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు:

  • బియ్యం - కప్పు
  • పెసర పప్పు - అర కప్పు
  • పసుపు - అర టీ స్పూన్​
  • పాలకూర కట్టలు - 3(మీడియం సైజ్​)
  • నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు
  • నూనె - 1 టేబుల్ స్పూన్
  • వెల్లుల్లి రెబ్బలు - 3
  • ఎండుమిర్చి - 2
  • పచ్చిమిర్చి - 3
  • జీలకర్ర - 1 టీ స్పూన్
  • ఉల్లిపాయ తరుగు - కొద్దిగా
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • నీరు -3 కప్పులు

తయారీ విధానం:

  • ముందుగా బియ్యం, పెసర పప్పును వేర్వేరుగా కడిగి ఓ అరగంట పాటు నానబెట్టుకోవాలి. అలాగే పాలకూర ఆకులను కడిగి.. సన్నగా తరిగి మిక్సీలో మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి.
  • ఇప్పుడు ప్రెజర్ కుక్కర్‌లో బియ్యం, పెసర పప్పు వేయాలి. అందులో రెండున్నర కప్పుల నీరు పోయాలి. అందులోనే పసుపు వేసి మూత పెట్టి స్టవ్​ ఆన్ చేసి దాని మీద పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత పక్కకు పెట్టి స్టీమ్​ పోయేంతవరకు ఉంచాలి.
  • ఇప్పుడు స్టవ్‍పై మరో పాన్ పెట్టి అందులో నెయ్యి, నూనె వేసుకోవాలి. అవి వేడెక్కాక ఎండుమిర్చి, సన్నగా తరిగిన వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి తరుగు వేయాలి.
  • వెల్లుల్లి గోల్డెన్ కలర్‌లోకి వచ్చాక ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కరివేపాకు వేయాలి.
  • కరివేపాకు వేగిన తర్వాత అందులో పాలకూర పేస్ట్ వేసి, పచ్చివాసన పోయి నూనె పైకి తేలేవరకు మగ్గించుకోవాలి.
  • ఆ తర్వాత ఆ పాలకూర మిశ్రమంలో.. ఉడికించుకున్న అన్నం, పెసరపప్పు ముద్దను వేసి బాగా కలుపుకోవాలి.
  • అందులో అరకప్పు నీరు పోసి కలపాలి. మీడియం ఫ్లేమ్‍ మీద కాసేపు ఉడికించుకోవాలి. చివర్లో పైన ఓ టీస్పూన్ నెయ్యి వేయాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్​ చేసి పాన్​ దింపేస్తే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర కిచిడీ రెడీ.
  • దీన్ని బ్రేక్​ఫాస్ట్​, లంచ్​, డిన్నర్​గా ప్రిపేర్​ చేసుకోవచ్చు. వేడివేడిగా తింటే రుచి అద్దిరిపోతుంది.

బంధువులు వస్తే చికెన్, మటన్ కంటే - ఇలా "పాలకూర ఉల్లికారం" చేసి పెట్టండి! - ఇష్టంగా తింటారు!

నోరూరించే "పాలకూర వేపుడు" - ఇలా ట్రై చేస్తే సూపర్ టేస్ట్​​!

ABOUT THE AUTHOR

...view details