తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

ఎగ్, చికెన్​తో కాదు - ఓసారి ఇలా "మిల్లెట్ నూడుల్స్" చేయండి! - రుచితో పాటు ఆరోగ్యం బోనస్! - MILLET NOODLES RECIPE

ఎప్పుడూ ఎగ్, చికెన్ నూడుల్స్ బోర్ - ఓసారి ఇలా సరికొత్త స్టైల్​లో ట్రై చేయండి!

VEG MILLET NOODLES RECIPE
Millet Noodles Recipe (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 5, 2025, 4:06 PM IST

Millet Noodles Recipe in Telugu : నూడుల్స్‌ అంటే ఇష్టపడనివాళ్లు దాదాపుగా ఉండరు. పిల్లలకైతే ఆ పేరు నాలుక అంచుల మీదే ఉంటుంది. వేరే టిఫిన్లకు మారాలూ, పేచీలూ ఉంటాయి కానీ.. ఇది మాత్రం అందుకు మినహాయింపే! అందరికీ అంతగా నచ్చేసే నూడుల్స్‌ఎప్పుడూ ఒకే స్టైల్​లో కాకుండా ఈసారి కాస్త వెరైటీగా ప్రయత్నించండి. అదే.. "మిల్లెట్ నూడుల్స్". టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పైగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది! ఈ రెసిపీని చాలా తక్కువ సమయంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి, అందుకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • జొన్న పిండి - 75 గ్రాములు(అర కప్పు)
  • పెసరపప్పు పిండి - 30 గ్రాములు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • నూనె - తగినంత
  • సన్నని వెల్లుల్లి తరుగు - 1 టీస్పూన్
  • సన్నని క్యాప్సికం ముక్కలు - 30 గ్రాములు
  • ఉల్లిపాయ తరుగు - 30 గ్రాములు
  • క్యాబేజీ తరుగు - 50 గ్రాములు
  • క్యారెట్ తరుగు - 50 గ్రాములు
  • సన్నని బీన్స్ తరుగు - 50 గ్రాములు
  • మిరియాల పొడి - రుచికి సరిపడా
  • మసాలా పొడి - కొద్దిగా
  • సోయా సాస్ - పావుటీస్పూన్
  • స్ప్రింగ్ ఆనియన్స్ తరుగు - కొద్దిగా

తయారీ విధానం :

  • ముందుగా ఒక మిక్సింగ్ బౌల్​లో జొన్నపిండి, పెసర పిండి వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై ఒక గిన్నె పెట్టుకొని అరకప్పు వాటర్, చిటికెడు ఉప్పు వేసుకొని మరిగించుకోవాలి.
  • వాటర్ మరిగాయనుకున్నాక అందులో ముందుగా కలిపి పెట్టుకున్న జొన్నపిండిమిశ్రమాన్ని వేసుకొని లో ఫ్లేమ్ మీద బాగా కలిపి దింపుకోవాలి.
  • ఆపై పిండి కాస్త చల్లారాక చేతితో చపాతీ పిండి మాదిరిగా బాగా కలిపి దానిపై కాస్త ఆయిల్ అప్లై చేసి మూతపెట్టి గంటన్నర నుంచి 2 గంటలపాటు అలా వదిలేయాలి.
  • అనంతరం పిండిని మరోసారి సాఫ్ట్​గా కలుపుకోవాలి. ఇప్పుడు మురుకుల గొట్టం తీసుకొని అందులో నూడుల్స్ మాదిరిగా వచ్చే సన్నని అచ్చును ఉంచి లోపల ఆయిల్ అప్లై చేసుకోవాలి.
  • ఆపై దానిలో కలిపి పెట్టుకున్న పిండిని ఉంచాలి. ఇప్పుడు ఒక పొడవాటి ప్లేట్ తీసుకొని దానిపై కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలి. అనంతరం మురుకుల గొట్టం తీసుకొని లైన్​గా నూడుల్స్​ని వత్తుకోవాలి.
  • తర్వాత వత్తుకున్న నూడుల్స్​పై కొద్దిగా నూనె రాసుకొని స్టీమర్​లో పెట్టి పావుగంట పాటు ఉడికించుకోవాలి. స్టీమర్ లేనివారు స్టౌపై పెద్ద గిన్నెలో స్టాండ్ ఉంచి దానిపై నూడుల్స్ వత్తుకున్న ప్లేట్​ ఉంచి అవి మంచిగా ఉడికే వరకు స్టీమ్ చేసుకున్నా సరిపోతుంది.
  • ఆవిధంగా ఉడికించుకున్నాక నూడుల్స్​ని బయటకు తీసి మరోసారి వాటిపై కొద్దిగా నూనె అప్లై చేసుకొని చలార్చుకోవాలి. అదేవిధంగా రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయ, క్యారెట్, క్యాప్సికం, క్యాబేజీ, బీన్స్​ని పొడవుగా, సన్నని ముక్కలుగా కట్ చేసుకొని పక్కనుంచాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక వెల్లుల్లి తరుగు వేసి వేయించుకోవాలి. అవి వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికం, బీన్స్ స్లైసెస్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి.
  • ఆవిధంగా వేయించుకున్నాక అందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న నూడుల్స్ వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత ఉప్పు, మిరియాల పొడి, మసాలా పొడి, సోయా సాస్ యాడ్ చేసుకొని ఎగరేస్తూ కాసేపు వేయించాలి. ఆఖర్లో స్ప్రింగ్ ఆనియన్స్ తరుగు వేసుకొని కలిపి దింపేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "మిల్లెట్ నూడుల్స్" రెడీ!

ABOUT THE AUTHOR

...view details