తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

మహా కుంభమేళాకు వెళ్తున్నారా? - ఈ టిప్స్​ పాటిస్తే మీ జర్నీసేఫ్ అండ్​ హ్యాపీ​! - MAHA KUMBH MELA 2025 TRAVELING TIPS

-అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం మహా కుంభమేళా -కుంభమేళాకు వెళ్లేవారు ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచిది

Maha Kumbh Mela 2025 Traveling Tips
Maha Kumbh Mela 2025 Traveling Tips (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 6, 2025, 3:41 PM IST

Maha Kumbh Mela 2025 Traveling Tips: ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అతి పెద్దది మహా కుంభమేళా. ఈ సందర్భంగా పవిత్ర నదుల్లో స్నానం చేయడం ముక్తి, మోక్ష మార్గమని భావించి లక్షల సంఖ్యలో భక్తులు వెళ్తుంటారు. కేవలం దేశీయులు మాత్రమే కాకుండా విదేశీ యాత్రికులు సైతం ఈ కుంభమేళాకు వెళ్తుంటారు. మరి, జనవరి 13వ తేదీ నుంచి ఉత్తరప్రదేశ్​ ప్రయాగ్​రాజ్​లో ప్రారంభంకానున్న కుంభమేళాకు మీరూ వెళ్దామనుకుంటున్నారా? అయితే కొన్ని టిప్స్ పాటిస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ టిప్స్​ పాటిస్తే మీరు హ్యాపీ జర్నీని ఎంజాయ్​ చేయవచ్చని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ముందుగానే బుక్ చేసుకోవాలి: మీరు మహా కుంభమేళాకు వెళ్లాలనుకుంటే జర్నీ కోసం, స్టేయింగ్​ కోసం ముందుగానే బుక్ చేసుకుంటే మంచిదని చెబుతున్నారు. ఎందుకంటే ప్రయాగ్​రాజ్‌ కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది పర్యాటకులు, భక్తులు తరలివస్తారు. ఈ క్రమంలోనే అక్కడికి వెళ్లిన తర్వాత ఇబ్బంది పడకూడదంటే ముందే ప్లాన్​ చేసుకోవాలి. అందుకోసం ఎలా వెళ్లాలి? వెళ్లిన తర్వాత ఎక్కడ స్టే చేయాలి అనే విషయాలు ముందుగానే తెలుసుకోవాలి. అవసరమైతే ప్రభుత్వ ట్రావెల్ ఏజెన్సీల సహాయం తీసుకోవచ్చు.

ప్యాకింగ్: కుంభమేళాకు వెళ్లేందుకు కావాల్సిన, అవసరమైన వస్తువులను ముందుగానే ప్యాక్ చేసుకోవాలి. అక్కడికి వెళ్లిన తర్వాత అవి లేవు ఇవి లేవు అని టెన్షన్​ పడకుండా కావాల్సిన అన్నింటినీ ముందే సర్దుకోవాలి. నడిచేందుకు అనువుగా ఉండే ఫుట్​వేర్​ తీసుకెళ్లాలి. స్నానం చేసిన తర్వాత తడికి కాలు జారిపోకుండా గ్రిప్​నిచ్చే చెప్పులు, షూలు ఎంచుకుంటే మంచిది. అక్కడి ఉష్ణోగ్రతలను బట్టి డ్రెస్సింగ్ ఉండాలి. అలాగే మందులు వాడుతున్న వారు కూడా వీటిని వెంట తీసుకెళ్లాలి.

ఆరోగ్యం కోసం: కుంభమేళాకు లక్షల్లో జనం వస్తుంటారు. ఈ క్రమంలో వైరస్​లు ప్రబలే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే చైనా వైరస్​ జనాలను భయపెడుతున్న క్రమంలో మాస్క్, శానిటైజర్​ కచ్చితంగా వెంట తీసుకెళ్లాలి. తినే తిండి, తాగే వాటర్​ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. స్నాక్స్​ తినాలనుకున్నప్పుడు బయటివి కాకుండా ఇంట్లో తయారు చేసినవి తీసుకెళితే మరీ మంచిదని, ఫ్రూట్స్​ కూడా తగినన్ని వెంట తీసుకెళ్లాలని చెబుతున్నారు. అలాగే సెపరేట్​ వాటర్​ బాటిల్స్​ తీసుకెళ్లాలని సూచిస్తున్నారు.

విలువైన వస్తువులు వద్దు: జన సందోహం అధికంగా ఉండే ప్రాంతాలకు వెళ్లినప్పుడు విలువైన వస్తువులు తీసుకెళ్లకపోవడమే మంచిదంటున్నారు. మొబైల్​ ఫోన్​, డబ్బులు, ఐడెంటిటీ కార్డులు జాగ్రత్తగా భద్రపరచుకోవాలని చెబుతున్నారు. సింగిల్​గా కాకుండా ఫ్రెండ్స్​, ఫ్యామిలీ వెళ్లినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు.

లిక్విడ్ క్యాష్​ అందుబాటులో ఉండాలి: ప్రస్తుతం ఆన్​లైన్​ పేమెంట్స్ ఎక్కువయ్యాయి. అయితే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వెళ్లినప్పుడు లిక్విడ్​ క్యాష్​ను దగ్గర ఉంచుకోవాలని, అత్యవసర సమయాల్లో ఇది ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

స్నానం సమయంలో జాగ్రత్త అవసరం: స్నానానికి నీటిలోకి దిగినప్పుడు జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. ఎందుకంటే జనం ఎక్కువ ఉన్నప్పుడు తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలంటున్నారు. అలాగే ఈతరానివారు లోతుగా ఉండే ప్రదేశాలకు వెళ్లొద్దని నది ఒడ్డునే స్నానం చేయడం మంచిదని సూచిస్తున్నారు.

ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళా - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్​ నుంచి మహా కుంభమేళాకు డైరెక్ట్ ట్రైన్స్ - కాశీని సైతం చూసొచ్చేలా IRCTC ప్యాకేజీ

ABOUT THE AUTHOR

...view details