ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / offbeat

ఆ నూడుల్స్ మసాలా సీక్రెట్ ఇదే! - ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు - NOODLES MASALA RECIPE IN TELUGU

రెండు నిమిషాల్లో సిద్ధం చేసుకునే నూడుల్స్ - మసాలా తయారీ ఇలా

noodles_masala_recipe_in_telugu
noodles_masala_recipe_in_telugu (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 29, 2025, 3:26 PM IST

Noodles Masala Recipe in Telugu : రెండు నిమిషాల్లో చేసే వంటకం పేరు చెప్పమంటే వెంటనే గుర్తొచ్చేది మాగీ నూడుల్స్ మాత్రమే. వంట రాని వారు సైతం ట్రై చేసే ఏకైక వంటకం ఇదే. ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయాల్లో పిల్లలు కూడా మాగీ చేసుకుని తింటుంటారు. తయారీ చాలా సింపుల్​గా, టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మాగీ నూడుల్స్​ తయారీ సులభమే అయినా అందులో కలుపుకొనే రెడీమేడ్ మసాలాలోనే రుచి అంతా దాగి ఉంటుంది. చాలా మందికి మసాలా సీక్రెట్ ఏమిటో తెలియదు. అందుకే కొని తెచ్చుకుంటుంటారు. ఇలాంటి వారి కోసమే మసాలా తయారీ విధానం. ఈ మసాలా ఒక్కసారి తయారు చేసుకుని పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు నూడుల్స్​లో కలుపుకొని వాడుకోవచ్చు.

అతి ప్రాచీన వంటకం 'కుంభకోణం సాంబార్' - జీవితంలో ఒక్కసారైనా రుచి చూడాల్సిందే!

నూడుల్స్ మసాలా పొడి తయారీ

నూడుల్స్ అంటే పిల్లలందరికీ ఎంతో ఇష్టం. నూడుల్స్ లో వేసే మసాలా వల్ల దానికి మంచి రుచి వస్తుంది. ఆ మసాలా పొడి కోసమే ఎక్కువ మంది ప్యాకెట్లను కొంటుంటారు. నిజానికి ఆ మసాలాను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

కావాల్సిన పదార్థాలు :

  • ధనియాలు - 3 టీ స్పూన్లు
  • జీలకర్ర - అర స్పూను
  • సోంపు - 1 స్పూను
  • మిరియాలు - అర స్పూను
  • యాలకులు - 4
  • లవంగాలు -4
  • మెంతులు - పావు టీ స్పూన్
  • జాజికాయ - చిన్న ముక్కు
  • దాల్చిన చెక్క - చిన్న ముక్క
  • ఎండు మిర్చి - 4
  • పసుపు - అర స్పూన్
  • ఉల్లిపాయ పొడి - ఒక స్పూన్
  • వెల్లుల్లి పొడి - అర స్పూన్
  • ఆమ్ చూర్ - 1 స్పూన్
  • కార్న్ ప్లోర్ - 1 స్పూన్
  • టమోటా పౌడర్ - 3 స్పూన్లు

మ్యాగీ మసాలా పొడి రెసిపీ :

  • స్టవ్ పైన కడాయి మసాలా దినుసులు వేపుకోవాలి. ధనియాలు, జీలకర్ర, సోంపు గింజలు, నల్ల మిరియాలు, యాలకులు, లవంగాలు, మెంతులు, జాజికాయ, దాల్చినచెక్క, ఎండుమిర్చి వేసి వేయించాలి.
  • దినుసులు వేగాక వాటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
  • మసాలా పొడిలోనే ఉప్పు, పసుపు, వెల్లుల్లి పొడి వేసుకోవాలి. ఆమ్చూర్ పొడి, కార్న్ ఫ్లోర్ పొడి వేసి మళ్లీ ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి.
  • చివరగా ఉల్లిపాయ పొడి, కార్న్ ఫ్లోర్ వేసుకుని బాగా కలుపుకుంటే మసాలా తయారీ పూర్తయినట్లే.
  • మసాలా మొత్తం మిశ్రమాన్ని గాజు సీసాలో గాలి చొరబడకుండా భద్రపరుచుకుంటే దాదాపు ఆరు నెలల పాటూ తాజాగా ఉంటుందట. నూడుల్స్ వండుకున్నపుడల్లా ఈ మసాలా కొంచెం కలుపుకొంటే సరిపోతుంది.
  • ఇంట్లో స్వయంగా తయారు చేసుకున్నది కావడం, నిల్వ ఉంచడానికి ఎలాంటి రసాయనాలు కలిపేఅవకాశం లేనందున ఆరోగ్యానికి కూడా మంచిదే.

పాతకాలపు 'ఉప్మా' తయారీ విధానం - ఇలా చేస్తే మీకు 100 మార్కులు గ్యారెంటీ!

ఎన్ని వెరైటీలున్నా కరివేపాకు చికెన్ క్రేజ్ వేరే! - సింపుల్ టిప్స్​తో సూపర్ టేస్ట్

ABOUT THE AUTHOR

...view details