ETV Bharat / offbeat

'బేబమ్మ' చెప్పిందే కరెక్ట్! - 'తొందరగా ముసలోళ్లైపోతారు' - ఇదిగో రిపోర్ట్ - HEALTH PROBLEMS WITH ANGER

కోపం వల్ల శారీరక, మానసిక సమస్యలు - గుండెపోటుకు గురయ్యే ప్రమాదం

health_problems_with_anger
health_problems_with_anger (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 30, 2025, 1:42 PM IST

Updated : Jan 30, 2025, 2:15 PM IST

HEALTH PROBLEMS WITH ANGER : 'ముక్కు మీద కోపం ముఖానికే అందం' అనేది పచ్చి అబద్ధమట. 'వీడేంటే ఇంత కోపంగా ఉన్నాడు, త్వరగా ముసలోడైపోతాడు' అంటూ ఉప్పెన సినిమాలో హీరోయిన్ కృతిశెట్టి (బేబమ్మ) చెప్పే డైలాగ్ 100శాతం నిజమంటున్నారు వైద్య నిపుణులు. కోప్పడితే హార్మోన్లు విడుదలై చర్మం ముడతలు పడుతుందని, వృద్ధాప్యం తొందరగా రావడం ఖాయమని పేర్కొంటున్నారు. కోపం ఎన్నో అనారోగ్య సమస్యలకు మూలం, దాని వల్ల దీర్ఘకాలిక జబ్బుల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కోపం ఎక్కువగా ప్రదర్శించే వారిలో అవయవాల స్పందన, హార్మోన్ల ప్రభావం, గుండె పనితీరుపై చేసిన అధ్యయనాలు షాకింగ్ విషయాలను వెల్లడించాయి.

మీ హైట్ ఏంటి, వెయిట్ ఏంటి? - ఎవరెంత బరువుండాలో ఈ ఫార్ములాతో తెలుసుకోండి!

కోపం, నవ్వడం అనేవి మానసిక స్పందనలు. ఈ భావోద్వేగాలు కొన్నిసార్లు మనల్ని రక్షించడానికి ఉపయోగపడితే మరికొన్ని సార్లు మనకు కావలసిన వాటిని పొందడానికి సహాయపడతాయి. అదే పనిగా నవ్వినా, కోపానికి గురైనా అది ఆరోగ్య సమస్యగానే గుర్తించాలంటున్నారు నిపుణులు. కోపం తరచుగా, తీవ్రంగా వస్తే ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తుందట. కోపం వల్ల వచ్చే సమస్యలు, శరీరంలో జరిగే మార్పులేమిటో తెలుసుకుందామా!

కోపం శరీరంపై ఒత్తిడిని పెంచుతుంది. దీంతో కోపంగా వారిలో శరీరం, మనస్సు రెండూ ఒత్తిడికి గురవుతాయని పరిశోధనలు తేల్చాయి.

శారీరకంగా జరిగే నష్టాలు :

  • కోపం వచ్చినప్పుడు హృదయ స్పందన పెరుగుతుంది. శ్వాస వేగం పెరుగుతుంది. దాంతో సహజంగానే రక్తపోటు(BP) పెరిగి గుండె జబ్బులు, స్ట్రోక్, కిడ్నీ సమస్యలకు దారితీస్తుంది. గుండె జబ్బులకు ముఖ్యమైన ప్రమాద కారకం కోపమే అని వైద్యులు చెప్తున్నారు.
  • కోపానికి గురైన సమయంలో స్ట్రెస్ హార్మోన్లు అడ్రినల్, కార్టిసాల్ ఉత్పత్తి అవుతాయట. అవి నాలుగు నుంచి ఐదు గంటల పాటు రక్తంలో అలాగే ఉండిపోవడం వల్ల హృదయ స్పందన అమాంతం పెరుగుతుంది. శ్వాస వేగం అధిక రక్తపోటుకు దారితీస్తుందట. కోపం జీర్ణ వ్యవస్థను కూడా ప్రభావితం చేయడం వల్ల కడుపు నొప్పి, అల్సర్, ఇతర జీర్ణ సమస్యలకు దారితీస్తుందట. నిద్ర లేమి సమస్యకు కోపం మూల కారణమని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. రోగనిరోధక వ్యవస్థపై పెను ప్రభావం చూపడం వల్ల తరచూ అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందంటున్నారు.
  • రెండు నిమిషాల కోపం ఆరుగంటల పాటు ఇమ్యూనిటీని ప్రభావితం చేస్తుందట.
  • చర్మం కణాలు దెబ్బతినడంతో పాటు పొడిగా, కళా విహీనంగా మారుతుందట. తద్వారా వృద్ధాప్యం ఛాయలు తొందరగా వచ్చే అవకాశాలున్నాయి. కోపం వల్ల మెడ, భుజం, చెంప భాగాల్లో స్ట్రెస్ పెరిగి తలనొప్పికి దారి తీస్తుందట. చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా స్పందిస్తారట. కోపం వల్ల వచ్చే అనారోగ్య సమస్యపై పరిశోధనల కోసం ఇక్కడ (Health problems with anger) క్లిక్ చేయండి

దేహంలో జరిగే మార్పులు :

  • గుండె కొట్టుకోవడం పెరుగుతుంది. శ్వాస వేగం, రక్తపోటు పెరుగుతుంది. కండరాలు బిగుసుకుపోయి చెమటలు పడతాయి. తలనొప్పి, కడుపులో నొప్పి కూడా ఉంటుంది.

మానసికంగా వచ్చే సమస్యలు :

  • కోపం ఆందోళనకు దారితీస్తుందని, తద్వారా ఏదో ఒక ప్రమాదం జరుగుతుందని భయపడుతూ ఉండడానికి కారణం కూడా కోపమేనట. కోపంగా ఉన్నప్పుడు, నిస్సహాయంగా, నిరుత్సాహంగా ఫీలై డిప్రెషన్​ బారిన పడే ప్రమాదం ఉందట.
  • కోపాన్ని నియంత్రించుకోవడం అత్యంత ఆవశ్యకం. కోపాన్ని నియంత్రించడానికి యోగా, మెడిటేషన్, వ్యాయామం లాంటి ఎన్నో మార్గాలున్నాయి.
  • యోగా, ధ్యానం, వ్యాయామం చేయడం వల్ల మనస్సును శాంతపరచడంతో పాటు ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. శరీరానికి తగినంత విశ్రాంతి (నిద్ర) ఇవ్వడం వల్ల కూడా కోపం తగ్గిపోయే అవకాశాలున్నాయి.

NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది

ఇవి కూడా చదవండి :

అతి ప్రేమతో కొత్త సమస్య - అలా ఊహించుకుంటే ప్రమాదమే!

ఈ నూనెతో మొటిమలకు చెక్? - ముఖం సున్నితమై స్కార్ఫ్ కట్టుకోవాల్సిందేనట!

Last Updated : Jan 30, 2025, 2:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.