తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

కూరగాయలు కట్‌ చేసుకోవడానికి కొత్త నేస్తం - 12 రకాల పనులు చేస్తుంది! - EASY KITCHEN TOOLS

-మహిళల వంటింటి పనులు సులువు చేసే లేటెస్ట్​ కిచెన్​ టూల్స్​ -ఓసారి మీరూ పరిశీలించండి

Latest Kitchen Tools
Latest Kitchen Tools (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 4, 2024, 3:18 PM IST

Latest Kitchen Tools :కాలం చాలా మారిపోయింది. ఒకప్పడు వంటింట్లో కూరలు, అన్నం, పచ్చళ్లు వంటివి ప్రిపేర్​ చేయాలంటే ఎంతో శ్రమించాల్సి వచ్చేది. కానీ, నేడు మిక్సీలు, రైస్​ కుక్కర్లు, గ్యాస్​ స్టౌవ్​లతో పనులు చకచకా అయిపోతున్నాయి. ఇవన్నీ మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కానీ.. కిచెన్​లోకూరలు తరగడం మాత్రం ఇంకా సులువు కాలేదు. అందుకే.. మార్కెట్లో ఈ పనికి కూడా కొన్నిరకాల పరికరాలు లభిస్తున్నాయి. అవేంటో మీరు ఓ సారి చూసేయండి..

ఒక్క కటర్​తో అనేక ప్రయోజనాలు..

Multifunctional vegetable cutter (ETV Bharat)

ఒక వస్తువు రెండు మూడు ప్రయోజనాలుఅందించడం చాలా గొప్ప! కానీ, అలాంటిది ఈ 'మల్టీఫంక్షనల్‌ వెజిటబుల్‌ కటర్‌' (Multifunctional vegetable cutter)తో 12 రకాల లాభాలున్నాయి. దీన్లో ఉండే 6 రకాల బ్లేడ్లతో కూరగాయలు కట్‌ చేసుకోవడం, తురమడం, తొక్క తీయడం.. వంటివి చేయొచ్చు. అలాగే దీన్లోనే కోడిగుడ్డు తెల్లసొనను వేరుచేసుకునే ఏర్పాటు ఉంటుంది. కూరగాయలను శుభ్రం చేయడానికి ఓ గిన్నె, ఆ నీటిని వంపడానికి డ్రెయిన్‌ కూడా ఉంటుంది. అంటే ఒక వస్తువుతో అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు.

Peeler cum brush (ETV Bharat)

కూరగాయల కోసం ఓ బ్రష్‌..

మనలో చాలామందికి కూరగాయలు కట్‌ చేసుకుంటే చాలు.. వంట సగం అయిపోయిందన్న భావన కలుగుతుంది. ఎందుకంటే, వాటిని శుభ్రంగా కడిగి.. కట్​ చేయడానికి కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. ఇలాంటి వారి కోసం ఈ 'పీలర్‌ కమ్‌ బ్రష్‌' (Peeler cum brush) చాలా హెల్ప్​ అవుతుంది. దీన్లోని బ్రష్‌ సాయంతో బంగాళదుంప, క్యారెట్‌లకు అంటిన మట్టిని తొలగించొచ్చు. అలాగే పీలర్‌.. తొక్క తీయడం కోసం, దానికే అటాచ్‌ అయి ఉన్న 'డిగ్గింగ్‌ డిజైన్‌'.. పాడైపోయిన మేరకు తీసేయడానికి కూడా ఉపయోగపడతాయి. చేతికి నొప్పిలేకుండా చెక్క హ్యాండిల్‌ కూడా దీనికి ఉంటుంది. ఇంకా పనయ్యాక శుభ్రపరచడం కూడా ఈజీ.

ఫ్రెంచ్‌ఫ్రైస్‌ ఇక ఇంట్లోనే..

French fries cutter (ETV Bharat)

పిల్లలకు ఫ్రెంచ్‌ఫ్రైస్‌ అంటే ఎంతో ఇష్టం. అయితే, వాటిని బయట కొనకుండా ఇంట్లోనే చేస్తే ఎంతో ఆరోగ్యకరమని నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడైనా రెస్టారెంట్​ స్టైల్లో ఫ్రెంచ్‌ఫ్రైస్‌ వంటింట్లోనే చేయాలంటే.. 'ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ కటర్‌' (French fries cutter) మీ ఇంట్లో ఉండాల్సిందే. దీంతో బీట్‌రూట్, క్యారెట్, కీరాలాంటి వాటిని కూడా ఫ్రెంచ్‌ఫ్రైస్‌ షేప్​లో కట్‌ చేసుకోవచ్చు. పిల్లలకు ఆకర్షణీయంగా స్నాక్స్ వండి పెట్టాలనుకున్నప్పుడు ఈ కటర్‌ చాలా ఉపయోగపడుతుంది.

ఇవి కూడా చదవండి :

పల్లీలు ఒలిచేందుకు ఈ బాక్సు.. ఎగ్స్​ కోసం ఆ బాక్సు! - సరికొత్త కిచెన్​ టూల్స్​ చూశారా?

సులువుగా కొబ్బరి తీయొచ్చు - సొన అంటకుండా గుడ్డు పగులగొట్టొచ్చు - ఈ స్మార్ట్​ టూల్స్ చూశారా?

ABOUT THE AUTHOR

...view details