How to Make Korean Style Potato Bites:చాలా మంది ఇష్టంగా తినే రెసిపీలలో ఒకటి.. ఆలూ. అయితే, దానితో ఎప్పుడూ రొటిన్‌గా కర్రీ, ఫ్రైలు, చిప్స్ మాత్రమే కాకుండా.. ఈసారి ఇలా వెరైటీగా ట్రెండింగ్‌లో ఉన్న "కొరియన్ స్టైల్ పొటాటో స్నాక్" రెసిపీని ట్రై చేయండి. ఇది చూడడానికి మంచి లుకింగ్‌తో కనిపించడమే కాకుండా.. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు! మరి.. ఇంకెందుకు ఆలస్యం ఈ సూపర్ టేస్టీ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- బంగాళదుంపలు - 3(మీడియం సైజ్‌వి)
- ఉప్పు - రుచికి సరిపడా
- కార్న్ ఫ్లోర్ - 1 కప్పు(150 గ్రాములు)
- నూనె - తగినంత
- వెల్లుల్లి రెబ్బలు - 15 నుంచి 20
- పచ్చిమిర్చి - 2
- ఉల్లిపాయ - 1
- చిల్లీ ఫ్లేక్స్ - 1 టీస్పూన్
- సోయా సాస్ - 1 టేబుల్ స్పూన్
- స్ప్రింగ్ ఆనియన్స్ తరుగు - కొద్దిగా
- నువ్వులు - 2 టీస్పూన్లు
- కారం - 1 టీస్పూన్
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా బంగాళదుంపలనుశుభ్రంగా కడిగి మధ్యలోకి కట్ చేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత వాటిని పొట్టు తీసి కడిగి గ్రేటర్ సహాయంతో ఒక మిక్సింగ్ బౌల్లో సన్నని తురుములా తరుక్కోవాలి.
- తర్వాత అందులో ఉప్పు, సగం కప్పు కార్న్‌ఫ్లోర్ వేసుకొని ముందుగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆపై మిగతా కార్న్‌ఫ్లోర్ కూడా యాడ్ చేసుకొని మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి.
- ఆవిధంగా కలుపుకుంటున్నప్పుడు పిండి స్టిక్కీగా అనిపిస్తుంది. అలా స్టిక్కీగా అనిపించకుండా ఉండడానికి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. అయితే, పిండి మరీ ఎక్కువ స్టిక్కీగా అనిపిస్తే.. అదనంగా మరో పాపు కప్పు పిండిని యాడ్ చేసుకోవచ్చు. అలాగే.. పిండిని మరీ గట్టిగా కాకుండా.. కాస్త సాఫ్ట్‌గా స్టిక్కీ స్టిక్కీగానే ఉండేలా కలుపుకోవాలి.
- ఆవిధంగా పిండిని ప్రిపేర్ చేసుకున్నాక.. చేతికి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని అందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్‌గా చేసుకోవాలి.
- తర్వాత సాస్ బాటిల్ క్యాప్ లేదా ఇంకేదైనా చిన్న క్యాప్‌ను శుభ్రంగా కడిగి తీసుకొని దానితో రౌండ్‌గా చేసుకున్న పిండి ముద్దను మధ్యలో కొంచం డిజైన్ వచ్చేలా నొక్కి ప్లేట్లోకి తీసుకోవాలి.
- లేదంటే.. పిండి మొత్తాన్ని బాల్స్‌లా చేసుకున్నాక ప్లేట్లో విడివిడిగా పెట్టుకొని ఏదైనా శుభ్రమైన బాటిల్‌తో మధ్యలోకి కాస్త డిజైన్ వచ్చేలా పిండి ముద్దలను వత్తుకున్నా సరిపోతుంది.
- అయితే, మరీ పెద్దవి కాకుండా కాస్త మీడియం సైజ్‌లోనే వీటిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మొత్తం పిండిని తయారు చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
నోరూరించే క్రిస్పీ "ఆలూ కుర్ కురే " - ఇంట్లోనే సింపుల్‌గా ఇలా ప్రిపేర్ చేసుకోండి - పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు!
- ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టుకొని ఒక లీటర్ వరకు వాటర్ పోసుకొని బాగా వేడి చేసుకోవాలి. నీళ్లు వేడయ్యాక.. అందులో మీరు ముందుగా చేసి పెట్టుకున్న పొటాటో బాల్స్ అన్నింటినీ జాగ్రత్తగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆపై స్టౌను హై ఫ్లేమ్‌లో ఉంచి రెండు నుంచి 3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది.
- అవి మంచిగా ఉడికి నీటిలో తేలుతున్నప్పుడు.. వాటిని మరో బౌల్లో వాటర్ తీసుకొని గరిటెతో అందులో వేసుకోవాలి. 2 నుంచి 3 నిమిషాలు వాటిని అలాగే ఉంచి తర్వాత వాటర్ వంపేసి పక్కన ఉంచుకోవాలి.
- తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయను సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. అలాగే.. పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై.. పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక.. సన్నని వెల్లుల్లి తరుగు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
- ఆ తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని స్టౌ ఆఫ్ చేసి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి.
- అనంతరం అందులో రుచికి సరిపడా ఉప్పు, సోయా సాస్, స్ప్రింగ్ ఆనియన్స్ తరుగు వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆపై ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న పొటాటో బైట్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి.
- ఇక చివరగా నువ్వులు, కారం వేసుకొని అన్నీ కలిసేలా మరోసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే కొరియన్ స్టైల్ "పొటాటో స్నాక్" రెసిపీ రెడీ!
ఆలుగడ్డతో అద్దిరిపోయే వడలు పది నిమిషాల్లోనే! - ఇలా ప్రిపేర్ చేస్తే వహ్వా అంటారు!