తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

కాఫీ విత్ కర్ణాటక : హైదరాబాద్​ నుంచి IRCTC సూపర్​ ప్యాకేజీ! - తక్కువ ధరలోనే ఎంజాయ్​ చేసిరావొచ్చు! - Koffee With Karnataka Tour Package

IRCTC Karnataka Package: కూర్గ్​ అందాలను వీక్షించాలనుకుంటున్నారా? అయితే.. మీకోసమే IRCTC సూపర్ టూర్ ప్యాకేజీ తీసుకొచ్చింది. మరి ఈ ప్యాకేజీ ఎన్ని రోజులు? ధర ఎంత? ఏయే ప్రదేశాలు చూడొచ్చు? వంటి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

IRCTC Karnataka Package
IRCTC Karnataka Package (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 21, 2024, 2:18 PM IST

IRCTC Koffee With Karnataka Tour Package:దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన కూర్గ్​ చూసేందుకు ఇండియన్​ రైల్వే క్యాటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్ ప్రత్యేక ప్యాకేజీ తీసుకొచ్చింది. కూర్గ్​ అందాలతోపాటు ఇతర ప్రకృతి అందాలను కూడా చూడొచ్చు. దేవాలయాలను సైతం దర్శించుకోవచ్చు. మరి, ఈ ప్యాకేజీ ఎన్ని రోజులు? ధర ఎంత? ఏయే ప్రదేశాలు చూడొచ్చు? వంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కాఫీ విత్ కర్ణాటక(Koffee with Karnataka) పేరుతో ఐఆర్​సీటీటీ ప్యాకేజీ తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి ఫ్లైట్​ జర్నీ ద్వారా ఈ టూర్​ను​ ఆపరేట్​ చేస్తున్నారు. ఈ ప్యాకేజీ​ మొత్తం 5 రాత్రులు..6 పగళ్లు ఉంటుంది. ఈ ప్యాకేజీలో బేలూర్, కూర్గ్, హళేబీడు, మైసూర్​లోని ప్రముఖ ఆలయాలతో పాటు ప్రకృతి అందాలను వీక్షించవచ్చు. ప్రయాణ వివరాలు చూస్తే..

మొదటి రోజు: హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు ఉదయం 6:45గంటలకు ఫ్లైట్ జర్నీ​ స్టార్ట్​ అవుతుంది. బెంగళూరు ఎయిర్ పోర్టుకు రీచ్​ అయిన తర్వాత అక్కడ పికప్ చేసుకుని బస్సులో మైసూర్‌కి తీసుకెళ్తారు. మధ్యాహ్నానికి మైసూర్ చేరుకుని హోటల్‌లో చెకిన్​ అవుతారు. ఆ తర్వాత మైసూర్ ప్యాలెస్, బృందావన్ గార్డెన్స్ సందర్శిస్తారు. రాత్రికి మైసూర్‌లో వసతి ఉంటుంది.

రెండో రోజు:ఉదయం హోటల్‌లో బ్రేక్​ఫాస్ట్​ తర్వాత శ్రీరంగపట్నం ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత మెల్కోటేకి బయలుదేరతారు. అక్కడ చెలువనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం సోమనాథపుర, తలకాడు ఆలయాలకు బయలుదేరతారు. అక్కడ దర్శనం అనంతరం తిరిగి సాయంత్రానికి మైసూర్‌ చేరుకుంటారు. రాత్రికి మైసూర్​లోనే బస చేస్తారు.

హైదరాబాద్​ టూ వయనాడ్​ - అతి తక్కువ ధరకే ఐఆర్​సీటీసీ స్పెషల్​ ప్యాకేజీ!

మూడో రోజు: బ్రేక్​ఫాస్ట్ తర్వాత కూర్గ్‌కి బయలుదేరతారు. ఈ మార్గంలో టిబెటన్ మొనాస్టరీ, నిసర్ఘధామా సందర్శించవచ్చు. ఆ తర్వాత కూర్గ్ చేరుకుని హోటల్‌లో చెకిన్​ అవుతారు. మధ్యాహ్నం రాజా సీట్​ను సందర్శిస్తారు. రాత్రికి కూర్గ్‌లో బస ఉంటుంది.

నాలుగో రోజు: హోటల్‌లో టిఫెన్​ తర్వాత తాలా కావేరికి వెళ్తారు. కావేరి బర్త్ ప్యాలెస్, బాఘమండల ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం కూర్గ్​కు తిరిగి వెళ్తారు. రాత్రికి కూర్గ్‌లో బస చేస్తారు.

ఐదో రోజు: హోటల్‌లో బ్రేక్​ఫాస్ట్ తర్వాత చెక్ అవుట్ చేసి సకలేష్‌పూర్‌కి బయలుదేరతారు. మంజీరాబాద్ కోటను సందర్శిస్తారు. మధ్యాహ్నం హాసన్‌కు బయలుదేరతారు. అక్కడ హోటల్‌లో దిగి, ఆ రాత్రికి హాసన్‌లోనే బస చేస్తారు.

ఆరో రోజు: హోటల్‌లో బ్రేక్​ఫాస్ట్ తర్వాత చెక్ అవుట్ చేసి బేలూర్​కి బయలుదేరతారు. అక్కడ చెన్నకేశవ ఆలయాన్ని సందర్శిస్తారు. తర్వాత హళేబీడుకి వెళ్లి హోయసలేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటారు. మధ్యాహ్నం బెంగళూరుకు వస్తారు. సాయంత్రానికి బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేస్తారు. ఫ్లైట్ ఎక్కి రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు.

ధర వివరాలు చూస్తే:

  • ఈ ప్యాకేజీకి సంబంధించిన ధర వివరాలు(కంఫర్ట్​) చూస్తే.. సింగిల్​ ఆక్యూపెన్సీకి రూ.38,000, డబుల్​ ఆక్యూపెన్సీకి రూ.29,600, ట్రిపుల్​ ఆక్యూపెన్సీకి రూ.27,750గా నిర్ణయించారు.
  • 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు విత్​ బెడ్​ అయితే రూ.23,950, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.19,550గా నిర్ణయించారు.
  • 2 నుంచి 4 సంవత్సరాల పిల్లలకు విత్​ బెడ్​ అయితే రూ.16,400 చెల్లించాలి.

ప్యాకేజీలో ఇవి ఉంటాయి:

  • హైదరాబాద్​ నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి హైదరాబాద్​కు విమాన టికెట్లు
  • 5 రాత్రులు హోటల్​లో బస
  • 5 బ్రేక్​ఫాస్ట్​లు, 5 డిన్నర్​లు ఉంటాయి. లంచ్​ ఏర్పాట్లు ప్రయాణికులే చూసుకోవాలి.
  • పర్యాటక ప్రదేశాలను దర్శించుకునేందుకు ప్యాకేజీని బట్టి బస్సు ఏర్పాటు చేస్తారు.
  • ట్రావెల్​ ఇన్సూరెన్స్​ ఉంటుంది. గైడ్​ అందుబాటులో ఉంటారు.
  • ప్రస్తుతం ఈ టూర్​ సెప్టెంబర్​ 27 నుంచి స్టార్ట్​ అవుతుంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, ప్యాకేజీ బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

రాజస్థాన్​ కోటల రాజసం చూస్తారా? - తక్కువ ధరలోనే IRCTC అద్భుతమైన ప్యాకేజీ!

IRCTC ఉత్తరాంధ్ర స్పెషల్​ టూర్​​ ​- ఓవైపు భగవత్​ దర్శనాలు - మరోవైపు బీచ్​లో సరదాలు​ - ధర చాలా తక్కువ!

IRCTC దివ్యమైన తిరుమల ప్యాకేజీ - శ్రీవారి స్పెషల్​ దర్శనంతోపాటు మరెన్నో!

ABOUT THE AUTHOR

...view details