ETV Bharat / offbeat

బేకరీ స్టైల్ ​"వెనీలా స్పాంజ్​ కేక్" - ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా లాగిస్తారు! - VANILLA SPONGE CAKE RECIPE

- ఒక్కసారి తింటే మళ్లీ చేసుకుంటారు

Bakery Style Vanilla Sponge Cake
Bakery Style Vanilla Sponge Cake (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 21, 2024, 4:29 PM IST

Bakery Style Vanilla Sponge Cake : బేకరీల్లో కూల్​ కేక్​ మొదలు.. పఫ్స్​ వరకు అన్నీ ఎంతో రుచికరంగా ఉండేవే. ఇక వివిధ ఫ్లేవర్లలో నోరూరించే కేకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చూసిన ప్రతి కేకు ముక్కనూ.. చటుక్కున నోట్లో వేసుకోవాలనిపిస్తుంటుంది ఎవరికైనా! అయితే.. ఈ బేకరీ ఐటమ్స్​లో అందరికీ ఇష్టమైన వాటిలో స్పాంజ్​ కేక్​ కూడా ఒకటి. ఈ స్పాంజ్​ కేకుల్లో వెనీలా ఫ్లేవర్లో​ ఉండే కేక్​ని ఎక్కువ మంది ఇష్టంగా తింటారు.

అయితే.. స్పాంజ్​ కేకుల రుచి ఎంత బాగున్నా కూడా.. తరచూ బేకరీల్లో చేసినవి తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, ఇంట్లో చేసుకోవడమే బెటర్​. ఈ స్టోరీలో చెప్పిన విధంగా చేస్తే చాలా ఈజీగా ఫ్లఫ్ఫీ స్పాంజ్​ కేక్​ని మీరు ఇంట్లోనే చేయచ్చు. మరి, ఇక ఆలస్యం చేయకుండా ఫ్లఫ్ఫీ స్పాంజ్​ కేక్ చేయడానికి కావాల్సిన పదార్థాలు? తయారీ విధానం ఏంటో ఓ లుక్కేయండి!

కావాల్సిన పదార్థాలు :

  • గుడ్లు-4
  • చక్కెర -150 గ్రాములు
  • వెనీలా ఎక్స్​ట్రాక్ట్​-1 టీస్పూన్
  • మైదాపిండి-130 గ్రాములు
  • బేకింగ్ పౌడర్-1/2 స్పూన్
  • ఉప్పు- చిటికెడు
  • నూనె-50 గ్రాములు

తయారీ విధానం :

  • ముందుగా ఒక మిక్సింగ్​ బౌల్లోకి ఎగ్స్​ పగలగొట్టి తీసుకోండి. ఇందులోనే పంచదార వేసుకుని.. హ్యాండ్​ బ్లెండర్​ సాయంతో లైట్​ క్రీమ్ కలర్​ వచ్చేంత వరకు స్పీడ్​గా బీట్​ చేసుకోవాలి.
  • ఆ తర్వాత వెనీలా ఎక్స్​ట్రాక్ట్ వేసుకుని మరోసారి బీట్​ చేసుకోవాలి.
  • మిశ్రమంపైన నురగలు వచ్చేంత వరకు హ్యాండ్​ బ్లెండర్​తో బీట్​ చేయాలి. ఆపై జల్లెడ తీసుకుని బేకింగ్ పౌడర్, మైదా పిండి వేసుకుని బౌల్లో జల్లించుకోండి.
  • తర్వాత పిండిని గరిటెతో బాగా కలుపుకోండి. ఇప్పుడు ఆయిల్​, ఉప్పు వేసి హ్యాండ్​ బ్లెండర్​ సాయంతో బీట్​ చేసుకోండి. తర్వాత మిశ్రమాన్ని కొద్దిసేపు పక్కన పెట్టుకోండి.
  • ఇప్పుడు కేక్​ పాన్​లో పూర్తిగా నెయ్యితో గ్రీస్​ చేయండి. ఆపై పాన్​లో బటర్​ పేపర్​ వేయండి. ఇందులో బీట్​ చేసుకున్న మిశ్రమం పూర్తిగా వేసేసుకోండి.
  • ఇప్పుడు ప్రీ హీటెడ్​ ఓవెన్​లో 150 డిగ్రీల దగ్గర.. లోవర్​ రాడ్​ మాత్రమే ఆన్​ చేసి.. 35-40 నిమిషాలు బేక్​ చేసుకోండి.
  • ఆ తర్వాత కేక్​ పాన్​ ఓవెన్​లో నుంచి బయటకు తీసి పూర్తిగా చల్లారనివ్వండి.
  • ఇప్పుడు కేక్​ని డీ మౌల్డ్​ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. మీకు ఎంత సైజ్​లో కావాలో ఆ విధంగా కట్​ చేసుకుంటే సరిపోతుంది.
  • ఎంతో మృదువుగా, రుచిగా ఉండే వెనీలా స్పాంజ్​ కేక్​ మీ ముందుంటుంది.

ఇవి కూడా చదవండి :

మీ పిల్లలకు కేక్స్ అంటే ఇష్టమా? - అయితే నోరూరించే ఎగ్​లెస్ రవ్వ కేక్ ఇంట్లోనే తయారు చేసేయండిలా!

క్రిస్మస్​ రోజు ఈ కేక్స్​ చేయండి - ఫ్యామిలీతో తియ్యని వేడుక చేసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.