తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

నోటికి ఏమీ రుచించకపోతే - ఈ "కోడిగుడ్డు వెల్లుల్లి కారం" టేస్ట్ చేయండి - కచ్చితంగా ఫిదా అయిపోతారు! - Kodiguddu Vellulli Kaaram Recipe - KODIGUDDU VELLULLI KAARAM RECIPE

Kodiguddu Vellulli Kaaram Recipe : ఒక్కోసారి నోటికి ఏదీ రుచించదు. అలాంటప్పుడు నిమిషాల్లో ప్రిపేర్ అయిపోయే 'కోడిగుడ్డు వెల్లిల్లి కారం' ట్రై చేయండి. దీన్ని వేడి వేడి అన్నంలో తిన్నారంటే.. ఫిదా అయిపోతారు! మరి, దీన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

How to Make Kodiguddu Vellulli Kaaram
Kodiguddu Vellulli Kaaram Recipe (ETV Bharat)

By ETV Bharat Features Team

Published : Sep 18, 2024, 4:50 PM IST

How to Make Kodiguddu Vellulli Kaaram : కోడి గుడ్డుతో ఎన్నో రకాల రెసిపీలు చేస్తుంటారు. అందులో దేనికదే ప్రత్యేకం. అలాంటి రెసిపీల్లో ఒకటి "కోడిగుడ్డు వెల్లుల్లి కారం". నిమిషాల్లోనే ప్రిపేర్ అయ్యే ఈ రెసిపీ అద్దిరిపోతుంది. నోరు చప్పగా ఉండి ఏది తినబుద్ధికానప్పుడు కూడా ఈ కర్రీ సూపర్బ్ అనేలా ఉంటుంది. నాలుకకు మంచి రుచి తలుగుతుంది! అంతేకాదు.. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • వెల్లుల్లిపాయ - 1(పెద్ద సైజ్​లో ఉన్నది)
  • జీలకర్ర - 1 టీస్పూన్
  • మిరియాలు - అర టీస్పూన్
  • లవంగాలు - 3
  • యాలకులు - 2
  • కారం - 2 టేబుల్​ స్పూన్లు
  • ఉప్పు - రుచికి తగినంత

కోడిగుడ్డు వెల్లుల్లి కారం కోసం :

  • గుడ్లు - 6
  • నూనె - 4 టేబుల్ స్పూన్లు
  • ఆవాలు - అర టీస్పూన్
  • జీలకర్ర - అర టీస్పూన్
  • మినప పప్పు - అర టీస్పూన్
  • ఎండుమిర్చి - 2
  • పచ్చిమిర్చి - 2
  • పసుపు - చిటికెడు
  • కరివేపాకు - కొద్దిగా

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం మొదటగా వెల్లుల్లిని పాయలుగా విడదీసుకొని పొట్టుతీసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో జీలకర్ర, మిరియాలు, లవంగాలు, యాలకులు వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత అందులోనే పొట్టు తీసి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, కారం, ఉప్పు వేసుకొని మరో మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలి.
  • ఇప్పుడు.. వెల్లుల్లి కారం రెడీ అవుతుంది. దాన్ని ఒక ప్లేట్​లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • తర్వాత స్టౌపై.. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడెక్కాక.. ఆవాలు, జీలకర్ర, మినప పప్పు వేయించుకోవాలి. అవి వేగాక ఎండుమిర్చి, నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకొని మరోసారి కాసేపు ఫ్రై చేసుకోవాలి.
  • తాలింపు బాగా వేగిందనుకున్నాక.. గుడ్లను పగులకొట్టి అందులో పోసుకోవాలి.
  • ఆపై పసుపు చల్లుకొని మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి ​మూతపెట్టి కలుపకుండా రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
  • తర్వాత గరిటెతో మరీ పొడిపొడి కాకుండా.. ఎగ్స్ మిశ్రమాన్ని కాస్త పెద్ద ముక్కలుగా ఉండేట్లు కట్ చేసుకొని మరోవైపు తిప్పేసుకోవాలి. ఆపై మరో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి.
  • ఇప్పుడు గుడ్డు మిశ్రమం బాగా వేగిందనుకున్నాక.. దాన్ని ఒక సైడ్​కి అనుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారం అందులో వేసుకోవాలి.
  • వన్​సైడ్​లో కాసేపు వెల్లుల్లి కారాన్ని ఫ్రై చేసుకుని తర్వాత ఎగ్ మిశ్రమంలో కలిసేలా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి.
  • తర్వాత మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి మరో నాలుగు నిమిషాల సేపు వేయించుకోవాలి.
  • అప్పుడు పచ్చివాసన పోయి మిశ్రమం బాగా ఫ్రై అవుతుంది. ఇక చివరగా కొద్దిగా ఉప్పు వేసుకొని కలిపి దింపేసుకుంటే చాలు. అంతే.. సూపర్ టేస్టీగా ఉండే "కోడిగుడ్డు వెల్లుల్లి కారం" రెడీ!

ఇవీ చదవండి :

ఎగ్​ దోశ చేయడం ఇప్పుడు చాలా ఈజీ - ఈ టిప్స్ పాటించండి - టేస్ట్​ ఎంజాయ్​ చేయండి!

మీరు ఎప్పుడూ తినని "కోడిగుడ్డు చట్నీ" - మీ నోటికి ఎన్నడూ తగలని టేస్ట్! - ఈజీగా ఇలా ప్రిపేర్ చేయండి!

ABOUT THE AUTHOR

...view details