తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

నటి కీర్తి సురేశ్ పెళ్లి చీర - తయారీకి 405 గంటలు - ధర ఎంతో! - KEERTHY SURESH WEDDING SAREE

- సోషల్ మీడియాలో కీర్తి పెళ్లి చీర వైరల్ - వందల గంటలు పట్టిందన్న డిజైనర్

KEERTHY SURESH WEDDING SAREE
KEERTHY SURESH WEDDING SAREE (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 10 hours ago

KEERTHY SURESH WEDDING SAREE : తారలు అంటేనే తళక్కున మెరిసిపోవాలి. అప్పుడే అభిమానులు మురిసిపోతారు. అలాంటిది ఇక పెళ్లి వేడుకలో ఇంకెలా కనిపిస్తారు? ఈ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా పెళ్లి వేళ ముస్తాబైంది కీర్తి సురేశ్. అయితే.. ఆమె ధరించిన పెళ్లిచీర తయారు చేయడానికి వందల గంటలు పట్టిందనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. మరి, ఆ చీరలో అంత ప్రత్యేకత ఏముంది? ఎక్కడ తయారు చేశారు? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.

తనదైన అందం, అభినయంతో మాత్రమే కాకుండా.. తన ఫ్యాషన్‌ తోనూ నేటి యూత్​ ఐకాన్​గా మారిపోయింది కీర్తి సురేశ్‌. ఆమె ధరించే పార్టీ వేర్, ఫంక్షన్స్ డ్రెస్సులు అభిమానుల మనసు దోచేస్తుంటాయి. అలాంటి బ్యూటీ.. పెళ్లికి ఎలాంటి వస్త్రాలు ధరించనుందనే క్యూరియాసిటీ ఫ్యాన్స్​లో కలిగింది. అయితే.. అందరి అంచనాలకు అందకుండా.. అంతకు మించి అనేలా తయారైంది కీర్తి. ఎవరూ ఊహించని విధంగా.. "మడిసర్‌ కట్టు"లో కనిపించి వావ్ అనిపించింది. పెళ్లిరోజున ఆమె ధరించిన చీరలో ఎన్నో స్పెషాలిటీస్​ ఉన్నాయి.

పెళ్లి కోసం ఆకుపచ్చ-పసుపు పచ్చ రంగుల్లో తయారైన కాంజీవరం పట్టుచీర ధరించింది కీర్తి. ఈ చీరను కోర్వై నేత పద్ధతిలో రూపొందించారు. చీర, బోర్డర్‌ విడి విడిగా నేశారు. ఆ తర్వాత ఆ రెండింటినీ మిక్స్ చేయడమే ఈ కోర్వై నేత స్పెషాలిటీ! కనీసం దారపు పోగులు కూడా కనపడకుండా కలిసిపోయేలా ఈ రెండింటినీ కలుపుతారు.

చీరపైన కవిత అచ్చు..

కీర్తి కట్టుకున్న ఈ చీర మొత్తాన్ని బంగారు రంగు జరీతో కూడిన జామెట్రిక్‌ చెక్స్‌, అందులో జరీ మోటిఫ్స్‌తో అద్దారు. చీర బోర్డర్‌ అంతా జరీ, ఫ్లోరల్‌ మోటిఫ్స్‌తో డిజైన్‌ చేశారు. ఈ చీర బోర్డర్‌ చివర యాడ్ చేసిన పర్పుల్‌ కలర్‌ ప్లెయిన్‌ పట్టీ.. చీర అందాన్ని మరింత పెంచింది. ఇందులో మరో స్పెషాలిటీ ఏమంటే.. ఈ పెళ్లి చీరపై తన ప్రేమ కవితను కూడా రాయించుకుంది కీర్తి. తమిళ అక్షరాల్లో ఉన్న ఈ లవ్​ కవిత.. తానే స్వయంగా రాసుకున్నది కావడం మరో ప్రత్యేకత.

ఈ బ్యూటీఫుల్ సారీని.. ఫేమస్ డిజైనర్‌ అనితా డోంగ్రే డిజైన్‌ చేశారు. ఈ చీరను తయారు చేయడానికి.. దాదాపు 405 గంటలు పట్టిందట. ఈ చీర తయారీకి సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది వైరల్ అయ్యింది. మరి, దీని ధర ఎంత అన్నది ఆమె చెప్పలేదుగానీ.. సుమారు 3 లక్షల వరకు ఉండవచ్చని నెటిజన్లు అంచనా వేస్తున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. కీర్తి సురేష్ నటించిన మొదటి బాలీవుడ్‌ మూవీ "బేబీ జాన్‌". క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్‌ 25న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో ఉల్లాసంగా పాల్గొంటోంది కీర్తి. ఈ కార్యక్రమాల్లో మంగళసూత్రంతోనే కనిపించడంతో.. ఆమెకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు వైరల్‌గా మారాయి.

ABOUT THE AUTHOR

...view details