IRCTC Holy Uttar Pradesh Package: ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలనుకునే భక్తులకు, ప్రకృతి అందాలు వీక్షించాలనుకునే టూరిస్టుల కోసం ఇండియన్ రైల్వే అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అనేక టూరిజం ప్యాకేజీలను ఆపరేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అయోధ్య రామయ్యను, కాశీ విశ్వనాథుడిని దర్శించుకునేందుకు అద్దిరిపోయే ప్యాకేజీ తీసుకొచ్చింది. మరి ఈ టూర్ ప్రయాణం ఎలా ఉంటుంది? ఎన్ని రోజులు? ధర ఎంత? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
హోలీ ఉత్తర్‌ప్రదేశ్ యాత్ర(Holy Uttar Pradesh) పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది ఐఆర్సీటీసీ. హైదరాబాద్ నుంచి ట్రైన్లో వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీలో వారణాసి, అయోధ్య, ప్రయాగరాజ్ వంటి ప్రదేశాలను కవర్ చేస్తారు. ఈ టూర్ మొత్తంగా 5 రాత్రులు, 5 పగళ్లు ఉంటుంది. ఆదివారం రోజున ఈ టూర్ ఆపరేట్ చేస్తున్నారు.
ప్రయాణం ఇలా ఉంటుంది:
- మెదటి రోజు ఉదయం 9:25 గంటలకు సికింద్రాబాద్ (దానాపూర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ నం: 12791) నుంచి ట్రైన్ జర్నీ ప్రారంభమవుతుంది. ఆ రాత్రంతా ప్రయాణం ఉంటుంది.
- రెండో రోజు మధ్యాహ్నానికి వారణాసి చేరుకుంటారు. అక్కడి నుంచి పికప్ చేసుకుని ముందుగా బుక్ చేసిన హోటల్‌కు తీసుకెళ్తారు. అక్కడ చెకిన్ అవ్వాలి. ఆ రోజు సాయంత్రం కాశీ విశ్వనాథుని పుణ్యక్షేత్రం, గంగ హారతి వీక్షిస్తారు. ఆ రాత్రి అక్కడే వారణాసిలోనే బస ఉంటుంది.
- మూడో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత వారణాసిలో ప్రసిద్ధ ఆలయాలను (కాశీ విశ్వనాథ ఆలయం, కాలభైరవ్ మందిర్, బిర్లా మందిర్‌ను) సందర్శిస్తారు. మధ్యాహ్నం అయోధ్యకు స్టార్ట్ అవుతారు. అయోధ్య హోటల్లో చెకిన్ అయిన తర్వాత.. ఆ రాత్రికి అక్కడే స్టే చేస్తారు.
- నాలుగో రోజు టిఫెన్ తిన్న తర్వాత.. అయోధ్య ఆలయం, హనుమంతుని దర్శనం, దశరథ్ మహల్‌ను చూసి వస్తారు. మధ్యహ్నం ప్రయాగరాజ్‌కు బయలుదేరి నైట్‌కు అక్కడికి చేరుకుంటారు. హోటల్లో చెకిన్ అయిన తర్వాత ఆ రాత్రి అక్కడ బస చేస్తారు.
- ఐదో రోజు తెల్లవారుజామున త్రివేణి సంగమాన్ని సందర్శించుకుంటారు. అక్కడి నుంచి హోటల్‌కి వచ్చి బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకుంటారు. మధ్యాహ్నం హోటల్ నుంచి చెక్ అవుట్ తర్వాత ఆనంద్ భవన్, ఖుస్రో బాగ్ విజిట్ చేస్తారు. సాయంత్రానికి ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్ చేరుకుంటారు. రాత్రి 7:45నిమిషాలకు సికింద్రాబాద్ (ట్రైన్ నం: 12792)కు ట్రైన్ బయలుదేరుతుంది. రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.
- ఆరో రోజు రాత్రి 9:30 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్ కంప్లీట్ అవుతుంది.
హైదరాబాద్ to కాశీ - కేవలం రూ.15 వేలకే ఆరు రోజుల టూర్!
ఈ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే…