IRCTC Ganga Sarayu Darshan Package:ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలనుకొనే భక్తులకు, ప్రకృతి అందాలు వీక్షించాలనుకునే టూరిస్టుల కోసం ఇండియన్ రైల్వే అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అనేక టూరిజం ప్యాకేజీలను ఆపరేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అవి కూడా అందరికీ అందుబాటు ధరలోనే టూర్లు నిర్వహిస్తోంది. మరి మీరు కూడా ఐఆర్‌సీటీసీ ప్యాకేజీలు ఉపయోగించి పలు ప్రదేశాలు కవర్ చేయాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్. తాజాగా అయోధ్య, వారణాసి పుణ్యక్షేత్రాల దర్శనం కోసం అద్దిరిపోయే ప్యాకేజీ తీసుకొచ్చింది. మరి ఈ టూర్ ప్రయాణం ఎలా ఉంటుంది? ఎన్ని రోజులు? ధర ఎంత? వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
గంగా సరయూ దర్శన్ (GANGA SARAYU DARSHAN) పేరిట IRCTC కొత్త టూర్ ప్యాకేజీని ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి టూర్ స్టార్ట్ అవుతుంది. యాత్ర ముగించుకున్నాక సికింద్రాబాద్‌లో దిగాల్సి ఉంటుంది. ఈ ట్రిప్ మొత్తం ఐదు రాత్రులు, ఆరు పగళ్లు కొనసాగుతుంది. అయోధ్య, వారణాసిలోని పలు ప్రదేశాలను సందర్శించవచ్చు. ప్రయాణ వివరాలు చూస్తే..
ప్రయాణం కొనసాగుతుందిలా..
- మెదటి రోజు ఉదయం 9:25 గంటలకు సికింద్రాబాద్ (దానాపూర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ నం: 12791) నుంచి టూర్ ప్రారంభమవుతుంది. ఆ రాత్రంతా ప్రయాణం ఉంటుంది.
- రెండో రోజు వారణాసి చేరుకుంటారు. అక్కడి నుంచి పికప్ చేసుకుని ముందుగా బుక్ చేసిన హోటల్‌కు తీసుకెళ్తారు. ఆరోజు సాయంత్రం కాశీ విశ్వనాథుని పుణ్యక్షేత్రం, గంగ హారతి వీక్షిస్తారు. ఆ రాత్రి అక్కడే బస ఉంటుంది.
- మూడో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత వారణాసిలో ప్రసిద్ధ ఆలయాలను (కాశీ విశ్వనాథ ఆలయం, కాలభైరవ్ మందిర్, బిర్లా మందిర్‌ను) సందర్శించుకోవచ్చు. సాయంత్రం షాపింగ్ ఉంటుంది. ఆ రాత్రి కూడాఅక్కడే స్టే చేయాలి.
- నాలుగో రోజు టిఫెన్ తిన్నాక హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి అయోధ్య స్టార్ట్ అవుతారు. అక్కడ హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత.. అయోధ్య ఆలయం, హనుమంతుని దర్శనం, దశరథ్ మహల్‌ను చూసి వస్తారు. ఇక సాయంత్రం సరయు ఘాట్ చూసేందుకు వెళ్తారు.
- ఐదో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు. ఆ తర్వాత ప్రయాగరాజ్ స్టార్ట్ అవుతారు. సాయంత్రానికి ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్ చేరుకుంటారు. రాత్రి 7:15నిమిషాలకు సికింద్రాబాద్ (ట్రైన్ నం: 12792)కు ట్రైన్ బయలుదేరుతుంది.
- ఆరో రోజు రాత్రి 9:30 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో యాత్ర పూర్తవుతుంది.
హైద్రాబాద్ To శ్రీలంక - రామాయణ జ్ఞాపకాలు చూసొస్తారా? - IRCTC స్పెషల్ ప్యాకేజీ!