IRCTC LTC Special Andaman Emeralds Ex-Vishakhapatnam: దేశంలోనే అత్యంత అందమైన పర్యాటక ప్రాంతాల్లో అండమాన్ నికోబార్ దీవులు ఒకటి. ఇసుక తిన్నెలతో ఆహ్లాదకరంగా కనిపించే బీచ్‌లను చూడాలని.. అక్కడికి వెళ్లి ఎంజాయ్ చేయాలని చాలా మంది ఆశ పడుతుంటారు. కానీ.. ఖర్చు, అక్కడికి వెళ్లే విధానం గురించి తెలియక చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. మరి మీకు కూడా అండమాన్ అందాలను చూడాలనుందా? అయితే, మీకోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
LTC స్పెషల్ అండమాన్ ఎమరాల్డ్స్ ఎక్స్ విశాఖపట్నం పేరుతో ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీలో పోర్ట్ బ్లెయిర్, రోజ్ ఐలాండ్, నార్త్‌బే ఐలాండ్, హేవ్‌లాక్ ఐలాండ్, నెయిల్ ఐలాండ్ లాంటి పర్యాటక ప్రాంతాలను విజిట్ చేయవచ్చు. విశాఖపట్నం నుంచి ఫ్లైట్ జర్నీ ద్వారా ఈ టూర్‌ను ఆపరేట్ చేస్తున్నారు. ఈ టూర్ 5 రాత్రులు, 6 పగళ్లు కొనసాగుతుంది. ప్రయాణ వివరాలు చూస్తే..
- మొదటి రోజు వైజాగ్ నుంచి టూర్ ప్రారంభం అవుతుంది. ఉదయం 08.35 గంటలకు విశాఖపట్నం ఎయిర్ పోర్టు నుంచి ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నానికి పోర్ట్ బ్లెయిర్ చేరుకుంటారు. ఎయిర్పోర్ట్ ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత అక్కడి నుంచి ముందుగానే బుక్ చేసిన హోటల్‌కు తీసుకెళ్తారు. హోటల్‌లో చెకిన్ అయ్యాక సెల్యూలార్ జైల్ మ్యూజియాన్ని సందర్శిస్తారు. తర్వాత కోర్బికోవ్ బీచ్‌కు వెళతారు. ఆ సాయంత్రం సెల్యూలార్ జైల్ వద్ద లైట్ అండ్ సౌండ్ షో విజిట్ చేస్తారు. ఆ రాత్రికి పోర్ట్ బ్లెయిర్‌లోనే భోజనం, స్టే ఉంటుంది.
- రెండో రోజు ఉదయం టిఫెన్ తర్వాత రోస్ ఐలాండ్ అండ్ నార్త్ బే విజిట్ చేస్తారు. అక్కడ పలు యాక్టివిటీస్‌లో పాల్గొనొచ్చు. తిరిగి పోర్ట్ బ్లెయిర్‌కు చేరుకుని లంచ్ పూర్తి చేసిన తర్వాత సాముద్రిక మెరైన్ మ్యూజియం విజిట్ చేస్తారు. ఆ రాత్రికీ పోర్ట్ బ్లెయిర్‌లో స్టే చేయాలి.
- మూడో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి హావ్‌లాక్ ఐలాండ్‌కు వెళ్తారు. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత.. సాయంత్రం రాధానగర్ బీచ్ చూస్తారు. ఆ రాత్రి హావ్‌లాక్‌లోనే బస ఉంటుంది.
- నాలుగో రోజు బ్రేక్ ఫాస్ట్ అనంతరం హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి.. కాలాపత్తర్ బీచ్ విజిట్ చేస్తారు. నెయిల్ ఐలాండ్ కోసం ప్రీమియం క్రూయిజ్ ఎక్కాల్సి ఉంటుంది. అక్కడకు చేరుకున్న తర్వాత హోటల్‌లో చెక్ ఇన్ అవ్వాలి. తర్వాత నేచురల్ బ్రిడ్జ్, లక్ష్మణపూర్ బీచ్ సందర్శన ఉంటుంది. ఆ రాత్రికి నీల్ ఐలాండ్‌లోనే డిన్నర్, స్టే ఉంటుంది.
- ఐదో రోజు ఎర్లీ మార్నింగ్ భరత్పూర్ బీచ్‌లో సూర్యోదయాన్ని చూడొచ్చు. బ్రేక్‌ఫాస్ట్ అనంతరం హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి.. క్రూయిజ్ ద్వారా పోర్ట్ బ్లెయిర్‌కు బయలుదేరాలి. సాయంత్రం షాపింగ్ కోసం టైమ్ ఉంటుంది. పోర్ట్ బ్లెయిర్‌లో రాత్రి భోజనం, బస ఉంటుంది.
- ఆరో రోజు ఉదయం టిఫెన్ చేసి హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. అనంతరం పోర్ట్ బ్లెయిర్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లాలి. ఉదయం 07:25 గంటలకు వైజాగ్ వెళ్లే విమానం ఉంటుంది. 11:45 గంటలకు విశాఖపట్నం చేరుకోవడంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
ధర వివరాలు చూస్తే..
- కంఫర్ట్‌లో సింగిల్ ఆక్యూపెన్సీకి రూ. 75,115, డబుల్ ఆక్యూపెన్సీకి రూ. 58,860, ట్రిపుల్ ఆక్యూపెన్సీకి రూ.57,230 చెల్లించాలి.
- 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్ బెడ్ అయితే రూ.50,270 చెల్లించాలి అదే విత్ అవుట్ బెడ్ అయితే రూ. 46,810 పే చేయాలి.