ETV Bharat / sports

రంజీలో రికార్డ్​ బ్రేకింగ్ డబుల్ సెంచరీ - 'శ్రేయస్! ఇదంతా అందుకోసమేనా' - SHREYAS IYER RANJI TROPHY

రంజీలో శ్రేయర్ డబుల్ సెంచరీ- టీమ్​ఇండియాలో చోటు దక్కేనా?

Shreyas Iyer Ranji Trophy
Shreyas Iyer (AFP)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 7, 2024, 4:00 PM IST

Shreyas Iyer Ranji Trophy : టీమ్​ఇండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ రంజీ ట్రోఫీలో అదరగొడుతున్నాడు. ముంబయి జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఈ స్టార్ క్రికెటర్, ఒడిశాపై డబుల్ సెంచరీ బాదాడు. 228 బంతుల్లో 24 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 233 పరుగులు బాదాడు. స్ట్రైక్ రేట్ ఏకంగా 102.19 ఉండడం గమనార్హం. అంతకుముందే మహారాష్ట్రపై సెంచరీ బాదిన శ్రేయస్, ఒడిశాపైనా విరుచుకుపడ్డాడు. భారత టెస్ట్ జట్టులో చోటే లక్ష్యంగా శ్రేయస్ చెలరేగుతున్నాడు.

దూకుడుగా బ్యాటింగ్
ముంబయి- ఒడిశా మధ్య జరుగుతున్న మ్యాచ్​లో ఐదో స్థానంలో బ్యాటింగ్​కు వచ్చిన అయ్యర్ మొదటి నుంచి దూకుడుగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. బౌండరీలతో చెలరేగిన శ్రేయస్ రంజీల్లో తన రెండో డబుల్ సెంచరీని పూర్తి చేశాడు. ఈ క్రమంలో ముంబయి జట్టు 4 వికెట్ల నష్టానికి 602 పరుగుల చేసి ఇన్సింగ్స్​కు డిక్లేర్ చేసింది.

గాయం, ఫామ్ లేమి కారణంగా జట్టుకు దూరం
కాగా, టెస్టు ఫార్మాట్​లో ప్రస్తుతం టీమ్​ఇండియా మిడిలార్డర్ తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సమయంలో అయ్యర్ భారీ ఇన్నింగ్స్​లతో ఆకట్టుకుంటున్నాడు. దీంతో అతడిని టెస్టు జట్టులోకి తీసుకోవాలనే ప్రతిపాదనలు మొదలయ్యాయి. కాగా, శ్రేయ‌స్ అయ్య‌ర్ త‌న‌ పేల‌వ ఫామ్ కార‌ణంగా భార‌త టెస్టు జ‌ట్టులో చోటు కోల్పోయాడు. అయ్య‌ర్ చివ‌ర‌గా ఇండియా త‌ర‌పున టెస్టుల్లో ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్​పై ఆడాడు. తొలి టెస్టు ఆడిన అయ్య‌ర్‌ వెన్ను గాయం తిరగ‌బెట్ట‌డం వల్ల సిరీస్ మొత్తానికి దూర‌మ‌య్యాడు.

బీసీసీఐ కాంట్రాక్ట్ రద్దు
ఆ త‌ర్వాత రంజీల్లో ఆడాల‌న్న బీసీసీఐ అదేశాలును లెక్కచేయనందు వల్ల అయ్య‌ర్ త‌న సెంట్ర‌ల్ కాంట్రాక్ట్​ను కోల్పోయాడు. ఈ క్రమంలో శ్రేయస్‌ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్​లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. దులీప్‌ ట్రోఫీ, రంజీ ట్రోఫీల్లో ఆడి అదరగొడుతున్నాడు. ఇక విధ్వంసకర డబుల్‌ సెంచరీతో ఆకట్టుకున్న అయ్యర్‌ తిరిగి భారత టెస్టు జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్‌ ఉంది.

అయితే కొన్ని రోజులుగా టెస్టుల్లో భారత బ్యాటర్లు ఆశించిన మేర రాణించడం లేదు. దీంతో న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్‌ ను 0-3తో భారత్ కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో ఫామ్​లోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్, టీమ్​ఇండియాకు ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు. మరి అతడికి జట్టులో చోటు కల్పిస్తారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు అభిమానులు ఓ వైపు ఈ సెంచరీ విషయంలో హర్షం వ్యక్తం చేస్తూనే మరోవైపు శ్రేయస్ ఇదంతా టీమ్ఇండియాలో చోటు దక్కించుకోవడం కోసమేనా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

శ్రేయస్​ను సంప్రదించని కేకేఆర్ ఫ్రాంచైజీ! - ఇక జట్టుకు దూరమేనా!

ప్రేమలో పడి క్రికెట్​పై శ్రేయస్ నో ఫోకస్​- వెంటనే అలా చేసిన తండ్రి- ఇక అయ్యర్ లైఫ్​ సెట్​! - Shreyas Iyer Life Story

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.