Akhanda 2 Balayya Role : యాక్షన్ సినిమాల్లో మెరవాలన్న, ఎమోషన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేయాలన్న అది నందమూరి నటసింహం బాలకృష్ణకే సాధ్యం. ఈయన ఓవైపు డేంజరస్ ఫీట్స్ చేస్తునే, మరోవైపు తన డైలాగ్ డెలివరీతో అభిమానులను ఆకట్టుకుంటారు. అయితే ఈయన నటనకు బోయపాటి మెరుగులు దిద్ది తీసిన మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అఖండ విజయాన్ని సాధించాయి. ఇప్పుడు అదే జోష్‌తో ఈ కాంబో మళ్లీ 'అఖండ 2 : తాండవం' కోసం కలిసి పని చేస్తోంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభవ్వగా, అభిమానులు ఈ మూవీ అప్డేట్స్ గురించి తెగ ఆరా తీస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త నెట్టింట తెగ వైరలై ప్రేక్షకుల్లో 'అఖండ 2'పై మరించ అంచనాలు పెంచుతోంది. అదేంటంటే?
నిజ జీవితంలో బాలకృష్ణ సంప్రదాయలకు ఎంత విలువనిస్తారో అందరికీ తెలిసిందే. ఆయనకు దేవుడంటే అమితమైన భక్తి. 'అఖండ 2 : తాండవం'లో ఆయన ఇలానే కనిపించనున్నారట. ఆచారాల కోసం పోరాడే ఓ పాత్రకు ఈ చిత్రంలో ప్రాణం పోయనున్నట్లు సినీ వర్గాల టాక్. అయితే ఈ చిత్రం తొలి భాగంలో భాగంలోనూ బాలయ్య శివ భక్తుడిగా కనిపించారు. ఆ పాత్రలో ఎంతో చక్కగా ఒదిగిపోయి ఆకట్టుకున్నారు. ఇప్పుడీ రెండో భాగంలో ఆయన పాత్ర మరింత పవర్‌ఫుల్‌గా చూపించనున్నట్లు తెలుస్తోంది. ఆలయాలను, అలాగే వాటి పవిత్రతను కాపాడే ఓ పాత్రలో ఆయన కనిపించనున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, ఈ పవర్‌ఫుల్ పాత్రకు బోయపాటి డైలాగులు మరింత పవర్‌ను ఇచ్చేలా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టైటిల్ రివీల్ అండ్ పూజా కార్యక్రమంలో బాలయ్య చెప్పిన డైలాగ్ నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఆయన డిక్షన్ కూడా చాలా బాగుందంటూ అభిమానులు మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో అటువంటివి ఎన్నో ఉన్నాయట. హిందూ గ్రంథాల విషయంలో జోక్యం చేసుకొని వాటిని నాశనం చేయాలని ప్రయత్నించే కొందరి పని పట్టేందుకు నడుముబిగించే పాత్రలో బాలయ్య కనిపిస్తారట. పాన్ ఇండియా లెవెల్లో భారీగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందనుంది.
'GOD OF MASSES' #NandamuriBalakrishna roars with a powerful dialogue for the first shot of #Akhanda2 - Thaandavam at the pooja ceremony ❤️🔥
— 14 Reels Plus (@14ReelsPlus) October 16, 2024
Title theme out now💥💥
▶️ https://t.co/xmMACJPzNZ
Shoot begins soon!#BoyapatiSreenu @14ReelsPlus @MusicThaman @RaamAchanta #GopiAchanta… pic.twitter.com/5k6CQaiS4M
'అఖండ 2' కోసం క్రేజీ సీక్వెన్స్ - ఫస్ట్ సీన్లోనే బాలయ్య సూపర్ ఫైట్!
'అఖండ 2' టైటిల్ థీమ్ కూడా వచ్చేసింది - తమన్ తాండవం అదిరిపోయిందంతే!