IRCTC Heritage Triangle Tour Package :వందేళ్ల నాటి చరిత్ర దేశ రాజధాని దిల్లీకి సొంతం. ఇక్కడ సందర్శించడానికి అనేక చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. వీటిని చూసేందుకు దేశం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. మరి మీరు కూడా ఆ ప్రదేశాలను విజిట్ చేయాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్ చెబుతోంది ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. దిల్లీలోని పలు ప్రదేశాలను చూసేందుకు సూపర్ ప్యాకేజీ తీసుకొచ్చింది. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
"హెరిటేజ్ ట్రయాంగిల్" పేరుతో ఐఆర్సీటీసీ ఈ ప్యాకేజీ తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ మొత్తం 5 రాత్రులు, 6 పగళ్లు కొనసాగనుంది. హైదరాబాద్ నుంచి ట్రైన్ ద్వారా టూర్ ఉంటుంది. ప్రతీ సోమవారం ఈ టూర్ ఉంటుంది. ఈ టూర్లో భాగంగా దిల్లీ, ఆగ్రా, మథుర వంటి ప్రదేశాలు విజిట్ చేయవచ్చు. ప్రయాణ వివరాలు చూస్తే..
- మొదటి రోజు ఉదయం 6 గంటలకు హైదరాబాద్ నుంచి ట్రైన్(ట్రైన్ నెం 12723) జర్నీ స్టార్ట్ అవుతుంది. ఆ రోజు మొత్తం ప్రయాణం ఉంటుంది.
- రెండో రోజు ఉదయం 8 గంటలకు దిల్లీ చేరుకుంటారు. అక్కడి నుంచి పికప్ చేసుకుని ముందుగానే బుక్ చేసిన హోటల్‌కు తీసుకెళ్తారు. అక్కడ హోటల్లో చెకిన్ అవ్వాలి. ఫ్రెష్ అయిన తర్వాత దిల్లీలోని కుతుబ్ మినార్, లోటస్ టెంపుల్, అక్షరధామ్ వంటి ప్రదేశాలు సందర్శించవచ్చు. ఆ రాత్రికి దిల్లీలోనే బస చేయాలి.
- మూడో రోజు హోటల్ చెక్ అవుట్ చేసి ఇండియా గేట్, రెడ్ ఫోర్ట్ విజిట్ చేయాలి. ఆ తర్వాత ఆగ్రాకు బయలుదేరుతారు. సాయంత్రానికి ఆగ్రా చేరుకుని హోటల్లో చెకిన్ అవుతారు. ఆ రాత్రికి అక్కడ బస చేస్తారు.
- నాలుగో రోజు తాజ్ మహల్ సందర్శించవచ్చు. ఆ తర్వాత చెక్ అవుట్ చేసి ఆగ్రా ఫోర్ట్ విజిట్ చేస్తారు. అక్కడ నుంచి మథుర బయలుదేరుతారు. మథురలోని కృష్ణ జన్మభూమి దర్శించుకున్న తర్వాత ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు.
- ఐదో రోజు హోటల్లో చెక్ అవుట్ తర్వాత బృందావనం విజిట్ చేస్తారు. మధ్యాహ్నం తర్వాత మథుర జంక్షన్ రైల్వే స్టేషన్లో డ్రాప్ చేస్తారు. సాయంత్రం 5:30 గంటలకు దిల్లీ నుంచి ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ఆ రాత్రంతా జర్నీ ఉంటుంది.
- ఆరో రోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ పూర్తవుతుంది.
ధర వివరాలు చూస్తే:
1 నుంచి 3 ప్రయాణికులకు:
- కంఫర్ట్‌లో సింగిల్ షేరింగ్‌కు రూ.41,670, డబుల్ షేరింగ్‌కు రూ.24,180, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.18,970 చెల్లించాలి. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్ బెడ్ అయితే రూ.14,320, విత్ అవుట్ బెడ్ అయితే రూ.12,840 చెల్లించాలి.
- స్టాండర్డ్‌లో సింగిల్ షేరింగ్‌కు రూ.39,270, డబుల్ షేరింగ్‌కు రూ.21,340, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.16,220 చెల్లించాలి. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్ బెడ్ అయితే రూ.11,850, విత్ అవుట్ బెడ్ అయితే రూ.10,540 చెల్లించాలి.