తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

'అటు ఆధ్యాత్మిక ప్రదేశాలు - ఇటు బీచ్​లో సరదాలు' - తక్కువ ధరకే IRCTC సూపర్​ ప్యాకేజీ! - IRCTC COASTAL KARNATAKA PACKAGE

-దేవాలయాలు, పర్యాటక ప్రదేశాలు చూసేందుకు ఐఆర్​సీటీసీ ప్యాకేజీలు -తక్కువ ధరలోనే ఎక్కువ రోజుల ప్యాకేజీలు

IRCTC Karnataka Package
IRCTC Coastal Karnataka Package (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 12, 2024, 4:49 PM IST

IRCTC Coastal Karnataka Package: దేశంలో ప్రముఖ దేవాలయాలను, అందమైన ప్రదేశాలను, పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని చాలా మంది అనుకుంటారు. కానీ అక్కడికి వెళ్లడం తెలియక, ధర ఎక్కువ అనే కారణాలతో చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. అయితే అలాంటివారందికోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) గుడ్​న్యూస్ చెప్పింది. కర్ణాటకలోని ప్రముఖ ఆలయాలను దర్శించుకునేందుకు వీలుగా తక్కువ ధరకే ఓ ప్యాకేజీ ప్రకటించింది. మరి ఈ ప్యాకేజీ ధర ఎంత? ఏఏ ప్రదేశాలు చూడొచ్చు? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..

"కోస్టల్ కర్ణాటక(Coastal Karnataka)"’ పేరుతో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలను సందర్శించడానికి IRCTC ఈ ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్​ నుంచి రైలు జర్నీ ద్వారా సాగే ఈ టూర్​ ప్రతీ మంగళవారం ఉంటుంది. ఈ టూర్​ మొత్తం 5 రాత్రులు, 6 పగళ్లు ఉంటుంది. ఈ ప్యాకేజీలో ఉడిపి, శృంగేరి, మురుడేశ్వర్ వంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. ప్రయాణ వివరాలు చూస్తే..

  • మొదటిరోజు కాచిగూడ స్టేషన్ నుంచి ఉదయం 6.05 గంటలకు కాచిగూడ - మంగుళూరు సెంట్రల్​ ఎక్స్​ప్రెస్​(ట్రైన్​ నెం 12789) రైలు బయల్దేరుతుంది. ఆ రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.
  • రెండో రోజు ఉదయం 09.30 గంటలకు మంగళూరు సెంట్రల్ స్టేషన్​కు చేరుకుంటారు. అక్కడి నుంచి పిక్​​ చేసుకుని ఉడిపికి తీసుకెళ్తారు. హోటల్​లో చెకిన్ అనంతరంశ్రీకృష్ణ టెంపుల్​, మల్పే బీచ్ విజిట్​ చేస్తారు. ఆ రాత్రి ఉడిపిలోనే బస చేస్తారు.
  • మూడో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత కొల్లూరు స్టార్ట్​ అవుతారు. అక్కడ మూకాంబికా ఆలయాన్ని దర్శించుకుంటారు. తర్వాత కొల్లూరు నుంచి మురుడేశ్వర్​కు చేరుకుంటారు. అక్కడ శివాలయాన్ని దర్శించుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం గోకర్ణకు బయలుదేరుతారు. అక్కడ దేవాలయాన్ని దర్శించుకున్న అనంతరం ​బీచ్​లో ఎంజాయ్​ చేయొచ్చు. ఆ తర్వాత మళ్లీ ఉడిపికి రిటర్న్​ అవుతారు. నైట్​ ఉడిపిలోనే స్టే ఉంటుంది.
  • నాలుగో రోజు ఉడిపి నుంచి చెక్​ అవుట్​ అయ్యి హోరనాడు బయలుదేరుతారు. అక్కడ అన్నపూర్ణ దేవి ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం అక్కడి నుంచి శృంగేరికి స్టార్ట్​ అవుతారు. అక్కడ శారదాంబ టెంపుల్​ దర్శించుకుని సాయంత్రానికి మంగుళూరుకు బయలుదేరుతారు. రాత్రి మంగుళూరులోనే బస ఉంటుంది.
  • ఐదో రోజు హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయ్యి మంగుళూరులోని మంగళదేవి టెంపుల్​, కద్రి మంజునాథ ఆలయం దర్శించుకుంటారు. సాయంత్రం తన్నిర్భావి బీచ్​, కుద్రోలి శ్రీ గోకర్ణనాథ క్షేత్రం దర్శనం ఉంటుంది. రాత్రి 7 గంటల వరకు మంగళూరు సెంట్రల్​కు చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు హైదరాబాద్​కు తిరుగు పయనం అవుతారు. రాత్రంతా జర్నీ ఉంటుంది.
  • ఆరో రోజు రాత్రి 11.40 గంటలకు కాచిగూడకు చేరుకోవటంతో టూర్ ముగుస్తుంది.

టికెట్ ధరలు:

  • కంఫర్ట్ క్లాస్​లో సింగిల్ షేరింగ్ రూ. 39,140, డబుల్ షేరింగ్ కు రూ.22,710, ట్రిపుల్ షేరింగ్​కు రూ.18,180గా ఉంది. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ రూ.11,610, విత్​ అవుట్​ బెడ్​ రూ.10,210 పే చేయాలి.
  • ఇక స్టాండర్డ్ క్లాస్​లో చూస్తే సింగిల్ షేరింగ్​కు రూ.36,120, డబుల్ షేరింగ్​కు రూ.19,690, ట్రిపుల్ షేరింగ్​కు రూ.15,150గా నిర్ణయించారు. . 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ రూ.8,590, విత్​ అవుట్​ బెడ్​ రూ.7,190 పే చేయాలి. గ్రూప్​ బుకింగ్​ బట్టి టికెట్​ ధరలు కొంత మేర తగ్గే అవకాశం ఉంటుంది.

ప్యాకేజీలో ఉండేవి ఇవే:

  • ట్రైన్​ టికెట్లు(స్టాండర్డ్​& 3AC
  • ట్రావెలింగ్​ కోసం ప్యాకేజీని బట్టి ఏసీ వెహికల్​
  • హోటల్​ అకామిడేషన్​ విత్​ 3 బ్రేక్​ఫాస్ట్​
  • ట్రావెల్​ ఇన్సూరెన్స్​
  • ప్రస్తుతం ఈ ప్యాకేజీ నవంబర్​ 19వ తేదీ నుంచి మార్చి 25, 2025 వరకు అందుబాటులో ఉంటుంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

ఉత్తరాఖండ్ అందాలను వీక్షించేందుకు అద్భుత అవకాశం - తక్కువ ధరకే IRCTC సూపర్ టూర్!

"మంచు కురిసే వేళలో కశ్మీరీ లోయలో" - IRCTC అద్భుతమైన ప్యాకేజీ - ధర కూడా తక్కువేనండోయ్​!

వైజాగ్​ to అండమాన్​ - IRCTC స్పెషల్​ ప్యాకేజీ - బీచ్​లో ఫుల్​ చిల్​ అవ్వొచ్చు బాస్​!

ABOUT THE AUTHOR

...view details