తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

ఇంటిల్లిపాదికీ నచ్చే "సేమియా దోశ" - చిటికెలో ప్రిపేర్ చేసుకోండిలా! - టేస్ట్ అదుర్స్! - SEMIYA DOSA RECIPE

దోశ తినాలని ఉంది కానీ ఫ్రిజ్‌లో పిండి లేదా? - అయితే, మీకోసమే ఇన్​స్టంట్ బ్రేక్​ఫాస్ట్ రెసిపీ!

Semiya Dosa Recipe
Instant Semiya Dosa Recipe (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 20, 2024, 7:56 PM IST

Instant Semiya Dosa Recipe :దోశ.. ఎక్కువ మందికి ఇష్టమైన మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్​ రెసిపీలలో ఒకటి. ఈ సౌత్ ఇండియన్ స్పెషల్ టిఫెన్ పేరు చెప్పగానే చాలా మందికి నోట్లో నీళ్లూరతాయి. అయితే, కొన్నిసార్లు ఇంట్లో దోశలు ప్రిపేర్ చేసుకోవడానికి పిండి సిద్ధంగా ఉండదు. అదే సమయంలో ఉప్మాచేసుకుందామంటే పెద్దగా నచ్చదు. పూరీలకు చాలా టైం పడుతుంది. మరేం చేయాలో తోచదు. అయితే, అలాంటి సందర్భాల్లో ఈ ఇన్​స్టంట్ దోశను ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉండే ఈ దోశ ఇంటిల్లిపాదికీ నచ్చేస్తుంది. పైగా దీన్ని 5 నుంచి 10 నిమిషాల్లో చాలా ఈజీగా వేసుకోవచ్చు. అదే.. "ఇన్​స్టంట్ సేమియా దోశ". ఇంతకీ, ఈ దోశ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • సేమియా - 1 కప్పు
  • ఉప్మారవ్వ - 1 కప్పు
  • పెరుగు - కప్పున్నర
  • ఉప్పు - రుచికి సరిపడా
  • టమాటా సాస్ - కొద్దిగా
  • అల్లం తరుగు - కొంచం
  • ఉల్లిపాయ తరుగు - కొద్దిగా
  • సన్నని పచ్చిమిర్చి తరుగు - కొద్దిగా
  • వాటర్ - తగినన్ని
  • నూనె - తగినంత

సూపర్ బ్రేక్​ఫాస్ట్ రెసిపీ - పుల్లపుల్లని "సేమియా పులిహోర" - నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం తరుగుని రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో సేమియా, ఉప్మారవ్వ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  • తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మిక్సీ పట్టుకున్న సేమ్యా, ఉప్మారవ్వ మిశ్రమం, పెరుగు, ఉప్పుతో పాటు తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఆపై దాన్ని కాసేపు పక్కనుంచాలి.
  • అనంతరం స్టౌపై దోశపాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. పెనం వేడయ్యాక కాస్త ఆయిల్ అప్లై చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమంలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని దోశలా వేసుకోవాలి.
  • ఆపై స్టౌను మీడియం ఫ్లేమ్​లో ఉంచి దోశను కాల్చుకోవాలి. కొంచం కాలిన తర్వాత దోశపై కొద్దిగా టమాటా సాస్ వేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సన్నని ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం తరుగుతో గార్నిష్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత కాసేపు కాల్చుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే ఘుమఘుమలాడే "సేమియా దోశ" రెడీ!
  • ఇక ఈ దోశలకు పల్లీ లేదా కొబ్బరి పచ్చడి సూపర్ కాంబినేషన్. తరచూ తినే మినప్పిండి దోశల కంటే కాస్త ప్రత్యేకంగా ఉండే సేమియా దోశలను ఇంట్లో వారందరూ చాలా ఇష్టంగా తింటారు. మరి, ఆలస్యమెందుకు మీకు నచ్చితే ఓసారి ప్రయత్నించి చూడండి!

గుంత పొంగనాల కోసం పిండి ఎందుకు గురూ? - వీటితో క్షణాల్లో చేసేయండి - టేస్ట్​ ఎంజాయ్​ చేయండి

ABOUT THE AUTHOR

...view details