తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

ఈ దేశానికి వీసా అవసరం లేదు - మూడు గంటల్లో వాలిపోవచ్చు! - KAZAKHSTAN VISA FOR INDIANS

- టూరిస్టులకు పండగే పండగ - భారతీయులను ఆకట్టుకుంటున్న కంట్రీ

Indian tourists do not need visa for Kazakhstan
Indian tourists do not need visa for Kazakhstan (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 22, 2025, 3:57 PM IST

Indian tourists do not need visa for Kazakhstan : ఒక దేశం నుంచి మరొక దేశం వెళ్లాలంటే ఆ దేశం అందించే వీసా కంపల్సరీ. కానీ, వీసా అనేది అంత త్వరగా తేలే అంశం కాదు. ఎన్నో అంశాలను బేరీజు వేసుకొని చాలా సమయం తర్వాత వీసా మంజూరు చేస్తుంటాయి ఆయా దేశాలు. అయితే, టూర్ వెళ్లాలనుకునే వారికి వెంటనే చాలా త్వరగా వీసా కావాల్సి ఉంటుంది. కొన్ని టూర్స్​ కాలంతో ముడిపడి ఉంటాయి. నిర్దిష్ట సమయంలోనే టూరిస్ట్ స్పాట్లను సందర్శించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఈ వీసా గొడవ ఇబ్బందిగా మారుతుంది. అయితే, మా దేశానికి రావాలనుకునే భారతీయులకు ఆ సమస్యే లేదు అంటోంది ఒక దేశం. మరి, ఏ దేశం ఏంటి? వీసా అవసరం లేదనడానికి కారణాలేంటి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

అవకాశం ఉన్నంత మేర ప్రపంచాన్ని చుట్టి రావాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. అలా టూర్​ వెళ్లాలనుకునే వారిలో భారతీయులు ముందు వరసలోనే ఉంటారు. అయితే కొందరు డబ్బు, టైమ్​ సరిపోక ప్రయాణాలు వాయిదా వేసుకుంటూ ఉంటారు. కానీ మరికొందరికి అన్నీ ఉన్నా కూడా "వీసా లేదు" అనే కారణంతో విదేశీ టూర్లకు వెళ్లలేకపోతుంటారు. ఇలాంటి వారు తమ దేశానికి రావాలంటూ ఆహ్వానం పలుకుతోంది కజకిస్థాన్.

ఈ మధ్య మన దేశంలో టూర్లకు వెళ్లే వారి సంఖ్య మరింతగా పెరిగింది. ముఖ్యంగా కరోనా తర్వాత టూరిస్టుల తాకిడి అంతటా పెరిగింది. ఈ మధ్య రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేసిన రిపోర్టు ప్రకారం, విదేశీ ప్రయాణాల కోసం ఇండియన్స్​ చేస్తున్న ఖర్చు ఏకంగా రూ. 12,500 కోట్లట! ఇది సంవత్సరం మొత్తానికి అనుకుంటే పొరపాటు పడ్డట్టే. కేవలం ఒక నెల ఖర్చు ఇది! టూర్లకు వెళ్లడాన్ని భారతీయులు అంతగా ఇష్టపడుతున్నారన్నమాట.

మీరు కూడా వెళ్లిరండి :

ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లడం ఏ టూరిస్టుకైనా ఎంతగానో నచ్చుతుంది. ఇలా చూసుకున్నప్పుడు భారతీయులకు కజకిస్థాన్ సూపర్ ఆప్షన్​గా కనిపిస్తోంది నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలో ఎన్నో దేశాల్లో అద్భుతమైన టూరిస్ట్ స్పాట్స్​ ఉండగా, కజకిస్థాన్ మాత్రమే ఎందుకు అంటే, పలు కారణాలు ఉన్నాయి.

14 రోజులు - నో వీసా :

అమెరికా, బ్రిటన్​తోపాటు యూరప్‌ లోని ఎన్నో దేశాలకు వీసా లేకుండా వెళ్లలేం. వీసా కోసం అవస్థలు పడడం ఒకెత్తైతే, ఆయా దేశాల్లో దిగిన తర్వాత అక్కడి ఖర్చులకు జేబులు పూర్తిగా ఖాళీ అవుతాయి. కానీ, కజకిస్థాన్‌ లో లిబరల్​గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మొదటి సమస్యైన వీసా తంటా ఈ దేశానికి లేదు. కేవలం ఇండియన్ పాస్‌ పోర్ట్ ఉంటే చాలు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్లైట్ ఎక్కి, కజకిస్థాన్‌ లో దిగిపోవచ్చు. ఇండియన్స్​కు 14 రోజుల వీసా ఫ్రీ పాలసీని కజకిస్థాన్‌ ఆమోదించింది. 2022లో ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. దీని ప్రకారం 180 రోజుల్లో ఒక ఇండియన్​ 3 సార్లు ఆ దేశానికి వీసా లేకుండా వెళ్లి, 14 రోజులపాటు అక్కడే ఉండొచ్చు. టూర్​ను ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాకుండా అక్కడ దిగిన తర్వాత అయ్యే ఖర్చు కూడా తక్కువేనని నిపుణులు చెబుతున్నారు.

3 గంటల జర్నీ :

మన రాజధాని ఢిల్లీ నుంచి కజకిస్థాన్‌లోని పెద్ద నగరం అల్మటికి మూడు గంటల్లోనే ప్రయాణించవచ్చు. ఈ విషయాలన్నీ నచ్చడంతో చాలా మంది భారతీయులు కజకిస్థాన్ ఫ్లైట్​ ఎక్కేందుకు క్యూలో నిల్చుంటున్నారు. గత సంవత్సరం ఇండియన్ టూరిస్టులు ఎక్కువ ప్రయాణించిన దేశాల్లో కజకిస్థాన్‌ మొదటి స్థానంలో నిలిచిందంటే అర్థం చేసుకోవచ్చు. 2023లో భారత్‌ నుంచి ఈ దేశానికి సుమారు 28,300 టూరిస్టులు ప్రయాణించారని అంచనా. సో, మీరు టూరిస్ట్ అయితే, ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా వెంటనే కజకిస్థాన్​లో వాలిపోయి, ఎంజాయ్​ చేసి రావొచ్చన్నది నిపుణుల మాట.

ABOUT THE AUTHOR

...view details