How to Make Idli Rava at Home :ఆరోగ్యానికి మేలు చేసే బ్రేక్‌ఫాస్ట్‌లలో ఇడ్లీ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. అందుకే చాలా మంది రెగ్యులర్‌గా వీటిని చేసుకుని తింటుంటారు. వారంలో కనీసం రెండు మూడు రోజులైనా సరే ఇడ్లీ చేయాల్సిందే. అయితే ఇడ్లీ తయారు చేయాలంటే మినపప్పు ఎంత అవసరమో, ఇడ్లీ రవ్వ అంతకుమించి. అందుకే చాలా మంది మార్కెట్‌కు వెళ్లినప్పుడు ఇడ్లీ రవ్వ ఎక్కువ మొత్తంలో కొని తీసుకొస్తుంటారు. అయితే ఈసారి ఇడ్లీలు చేసేటప్పుడు ఇడ్లీ రవ్వను బయట కొనకుండా, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. అది కూడా రేషన్ బియ్యంతో. ఏంటి రేషన్ బియ్యంతో ఇడ్లీ రవ్వ అని ఆలోచిస్తున్నారా? నిజమే, కంట్రోల్ రైస్‌తో ఇడ్లీ రవ్వను ఈజీగా చేసుకోవచ్చు. ఈ రవ్వతో ఇడ్లీలు సాఫ్ట్‌గా వస్తాయి. మరి, దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
- రేషన్ బియ్యం - రెండు కప్పులు(అర కేజీ)
- నీళ్లు - 8 కప్పులు
- ఉప్పు - 1 టీ స్పూన్
తయారీ విధానం:
- రేషన్ బియ్యాన్ని ముందుగా శుభ్రం చేసుకోవాలి. అంటే అందులో రాళ్లు, మట్టి పెళ్లలు లేకుండా జల్లించి క్లీన్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు గిన్నెలోకి శుభ్రం చేసిన రేషన్ బియ్యం తీసుకుని ఓ రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెద్ద గిన్నె పెట్టి అందులో 8 కప్పుల నీరు పోసి హై ఫ్లేమ్ మీద మరిగించాలి. అయితే ఇక్కడ మీరు బియ్యాన్ని ఏ కప్పుతో అయితే తీసుకున్నారో అదే కప్పుతో నీళ్లు కొలుచుకోవాలి. అంటే 1 కప్పు బియ్యానికి 4 కప్పుల నీళ్లు. ఇక్కడ రెండు కప్పుల బియ్యం తీసుకున్నాం కాబట్టి 8 కప్పుల నీళ్లు పోసుకోవాలి.
- నీరు బాగా మరుగుతున్నప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు లేకుండా వేసి కలిపి ఓ నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి దింపి పక్కన పెట్టాలి. ఎక్కువసేపు అయితే బియ్యం ఉడుకుతుంది. ఇప్పుడు ఈ గిన్నెపై మూత పెట్టి 10 నిమిషాల సేపు వదిలేయాలి.
- 10 నిమిషాల తర్వాత నీటిని వడకట్టుకోవాలి.అందుకోసం ఓ గిన్నెలో జల్లెడ పెట్టి, అందులో ఓ కాటన్ క్లాత్ వేయాలి. ఆ తర్వాత అందులోకి బియ్యాన్ని ఒంపుకోవాలి. ఆపై చల్లని నీళ్లు పోసి గట్టిగా పిండుకోవాలి.
- ఇలా నీళ్లు లేకుండా వడకట్టిన బియ్యాన్ని ఎండబెట్టాలి. బాగా ఎండ ఉంటే ఓ రోజంతా, ఎండ మామూలుగా ఉంటే రెండు రోజుల పాటు బియ్యాన్ని ఎండబెట్టుకోవాలి. బియ్యం నమిలితే కరకరలాడాలి. ఒకవేళ రైస్ సరిగా ఆరక తడిగా ఉంటే ఇడ్లీ రవ్వ ముక్కవాసన వస్తుంది. కాబట్టి బియ్యాన్ని వీలైనంత వరకు బాగా ఎండబెట్టుకోవాలి.
- బాగా ఎండిన బియ్యాన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీజార్‌లోకి కొన్ని కొన్ని బియ్యం వేసుకుంటూ ఆపి ఆపి గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న రవ్వను జల్లించుకుని ఎయిర్‌టైట్ కంటైనర్‌లో పెట్టి స్టోర్ చేసుకుంటే సుమారు 4 నెలల పాటు తాజాగా ఉంటుంది. అయితే ఇక్కడ అరకేజీ బియ్యం మాత్రమే కాబట్టి మిక్సీ పట్టుకోవచ్చు. ఒకవేళ మీరు ఎక్కువ మొత్తం తయారు చేసుకోవాలనుకుంటే మిల్లు దగ్గర రవ్వ లాగా పట్టించుకోవడం మంచిది.
- ఇలా తయారు చేసుకున్న రవ్వను మినపప్పుతో కలిపి ఇడ్లీలు చేసుకుంటే సరి. సూపర్ టేస్ట్‌తో పాటు సాఫ్ట్‌గా వస్తాయి.
పప్పు రుబ్బే పనిలేదు - చిటికెలో "సేమియా ఇడ్లీ" - టేస్ట్ అద్దిరిపోతాయి!
టిఫెన్ సెంటర్ స్టైల్ "ఇడ్లీ కారం పొడి" - ఇలా తయారు చేస్తే ఎంతో కమ్మగా ఉంటుంది!