Husband Cheating Wife in Telugu : ఈ రోజుల్లో ఖర్చులు పెరిగిపోవడంతో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేయడం కామన్ అయిపోయింది. దీనివల్ల భార్యభర్తలు ఎక్కువ సమయం ప్రేమగా గడపలేకపోతున్నారు. వారి మధ్య కమ్యూనికేషన్ లేకపోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం, వంటి కారణాల వల్ల బంధంలో దూరం పెరుగుతోంది. ఈ క్రమంలోనే కొందరు మరో వ్యక్తికి దగ్గరవుతున్నారు. దీనివల్ల అన్యోన్యమైన దాంపత్యంలో చిక్కులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితి ఓ మహిళకు ఎదురైంది. ఇంతకీ ఆమె సమస్య ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఇదీ సమస్య :
'మా పెళ్లై పదేళ్లు అవుతోంది. మాకో పాప. ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం. రోజూ ఆఫీస్కు వెళ్లడం, ఇంటికి రావడంతో ఇద్దరం బిజీ అయిపోయాం. దీనివల్ల మా మధ్య ఎమోషనల్ బంధం తగ్గిపోయింది. ఈ క్రమంలోనే మా ఆయనలో చాలా మార్పు గమనించా. ఓ రోజు ఆయన నా దగ్గరకొచ్చి అకస్మాత్తుగా ఏడవడం మొదలుపెట్టారు. తప్పు చేశాననీ, వేరే అమ్మాయితో దగ్గరయ్యాననీఅన్నారు. అతనితో విడిపోదామంటే పాప గుర్తుకొస్తోంది. కానీ, ఒకసారి నన్ను మోసం చేసినవారు, ఇంకోసారి చేయరు అన్న గ్యారెంటీ లేదు. ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు. మా ఆయనకి రెండో అవకాశం ఇవ్వొచ్చా?' అని ఓ మహిళ మానసిక నిపుణుల సలహా కోరుతోంది. ఈ సమస్యకు ప్రముఖ మానసిక నిపుణురాలు డాక్టర్ మండాది గౌరీదేవి ఆన్సర్ ఇస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
యాంత్రికంగా మారిపోతుంది!
ప్రస్తుతం భార్యాభర్తలిద్దరూ జాబ్స్ చేస్తున్నారు. దాంతో కొంతమంది కుటుంబానికీ, కెరియర్‌కీ సమయాన్ని సరిగ్గా విభజించుకోలేరు. దానివల్ల జీవితం యాంత్రికంగా మారిపోతుంది. మీరిద్దరూ ఎక్కువ సమయం గడపలేకపోవడం వల్ల శారీరకంగా, మానసికంగానూ దూరమవుతున్నారు. అయితే, ఇదే సమయంలో కొందరు తెలియకుండానే ఇతరుల ఆకర్షణలకు లోనవుతున్నారు. ఇది మొదట ఫ్రెండ్షిప్గా మొదలై ఆ తర్వాత అన్ని విధాలుగానూ దగ్గరవుతుంటారు. మీ ఆయన విషయంలోనూ అదే జరిగింది.