PERUMAL VADA MAKING PROCESS : తిరుపతిలో స్వామి వారి దర్శనం చేసుకున్న భక్తులు శ్రీవారి ప్రసాదం కోసం ఉవ్విళ్లూరుతారు. తిరుమల శ్రీవారి ప్రసాదం ఎంతో అపూరూపంగా భావిస్తారు. తిరుపతి ప్రసాదం అనగానే లడ్డూ తర్వాత గుర్తొచ్చేది వడ. లడ్డూ ప్రారంభించడానికి ముందుగా తిరుపతిలో వడ ప్రసాదమే భక్తులకు అందించే వారట. పూర్వం శ్రీవారి ప్రసాదంగా భక్తులకు 'వడ', ఆ తర్వాత బూందీ లడ్డూ ప్రసాదాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం లడ్డూను భక్తులకు అందిస్తున్నారు.
10నిమిషాల్లో చిక్కటి గడ్డ పెరుగు - రసాయనాలు లేకుండానే చిన్న చిట్కాతో ఇలా తయారు చేసుకోండి
మీరు ఒకవేళ తిరుపతి లడ్డూ తయారు చేయాలనుకున్నా కుదిరే పని కాదు. ఎందుకంటే తిరుపతి లడ్డూకు పేటెంట్ హక్కులు ఉన్నాయి. ఎంతో విశిష్టత కలిగిన లడ్డూ 2009లో జీఐ (భౌగోళిక గుర్తింపు) దక్కించుకుంది. వడ ప్రసాదం ఇప్పటికీ కౌంటర్లలో విక్రయిస్తున్నారు. మినప్పప్పుతో కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండే ఈ వడ ప్రసాదం భక్తులకు ఎంతో ఇష్టం.
సరిగ్గా తిరుమలలో విక్రయించే వడ ప్రసాదాన్ని పోలిన వడ తయారీ ఎలాగో ఇవాళ చూసేద్దాం. చాలా మంది ఇలాగే తయారు చేస్తూ తిరుపతిలో తెచ్చుకున్నంత ఫీల్ ఆస్వాదిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం! మీరు కూడా చూసేయండి. వడ ప్రసాదం తయారు చేసే ప్రయత్నం కూడా ప్రారంభించండి!
వడ తయారీకి కావల్సిన పదార్థాలు
- పొట్టు తీయని మినప్పప్పు (2 కప్పులు లేదా 250 గ్రా)
- పొడి అల్లం (శొంఠి) - 10 గ్రా
- నల్ల మిరియాలు - 1/2 టీస్పూన్
- జీలకర్ర - 1 టీస్పూన్
- ఇంగువ - చిటికెడు
- వాము గింజలు - 1/4 టీస్పూన్
- ఉప్పు - 3/4 టీస్పూన్
- నీరు - పిండి కలుపుకోవడానికి సరిపడా
- నూనె - డీప్ ఫ్రై కోసం
పెరుమాళ్ వడ తయారీ విధానం
- ముందుగా పొయ్యిపై కడాయి పెట్టి మినప్పప్పు పోసుకుని సన్న మంటపై వేయించాలి.
- ఇందులోనే శొంఠి ముక్కలు, నల్ల మిరియాలు, జీలకర్ర వేసుకుని వేగనివ్వాలి.
- బాగా వేగుతుంటే ఘుమఘుమ లాడే వాసన వస్తుంది.
- వేగిన వెంటనే కడాయి దించేసి పక్కన పెట్టుకోవాలి.
- వేడి తగ్గి చల్లారిన దినుసులను మిక్సీలోకి తీసుకోవాలి. అందులోనే ఇంగువ, వాము గింజలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి.
- మిక్సీ పట్టిన మిశ్రమాన్ని కడాయిలోకి తీసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వడల మాదిరి వత్తుకునేందుకు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుని పిండిని కలుపుకోవాలి.
- చిన్న చిన్న పిండి ముద్దలుగా చేసుకుని పెట్టుకోవాలి.
- పూరీ ప్రెస్ తీసుకుని కవర్ కు రెండు వైపులా నూనె రాసుకుని వత్తుకోవాలి.
- ఇపుడు మరో కడాయిలో ఫ్రైకి సరిపడా నూనె పోసుకుని బాగా వేడెక్కిన తర్వాత వడలను ఫ్రై చేసుకుంటే సరిపోతుంది.
- వడలు కరకరలాడుతూ నోరూరిస్తుంటాయి. మీరూ ఓ సారి ట్రై చేయండి!
శివరాత్రికి ఎవరైనా ఉపవాసం ఉండొచ్చా? - ఫాస్టింగ్తో కలిగే ప్రయోజనాలు తెలుసా?
పల్నాడు "దోసకాయ ఎండు మిర్చి పచ్చడి" - వేడి వేడి అన్నంలో వేసుకుంటే గిన్నె ఖాళీ!