How To Store Apple To Avoid Colour : 'రోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు' అనే మాట చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఎందుకంటే ఇందులోని పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఈ క్రమంలోనే చాలా మంది డైలీ యాపిల్స్ తింటుంటారు. ఇదిలా ఉంటే కట్ చేసిన కొద్దిసేపటికే యాపిల్ రంగు మారుతూ ఉంటుంది. అవి రంగు మారకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటిస్తే సరిపోతుంది అంటున్నారు నిపుణులు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
అసలు యాపిల్ రంగు మారడానికి కారణం:యాపిల్ ఇలా రంగు మారడానికి కారణం దాని గుజ్జులోని పాలీఫినోల్ ఆక్సిడేస్ అనే ఎంజైమ్. ఈ ఎంజైమ్ గాలిలోని ఆక్సిజన్‌తో చర్య జరిపి గుజ్జును బ్రౌన్ కలర్లోకి మారుస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇవి కలర్ మారకుండా ఉండాలంటే
నిమ్మరసం: దాదాపుగా అందరి ఇళ్లల్లో నిమ్మకాయలు ఉంటాయి. వీటి ద్వారా యాపిల్ ముక్కలు రంగు మారకుండా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకోసం, కట్ చేసిన యాపిల్ ముక్కలపై కొన్ని చుక్కల నిమ్మరసాన్ని చల్లితే, అందులోని సిట్రిక్ ఆమ్లం యాపిల్ ముక్కలను ఎక్కువసేపు తాజాగా ఉంచుతుందని, రంగు మారదని అంటున్నారు. నిమ్మరసానికి బదులుగా పైనాపిల్ జ్యూస్‌ను ఉపయోగించినా అదే ఫలితాన్ని పొందొచ్చని చెబుతున్నారు. 2009లో జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం యాపిల్ ముక్కలపై నిమ్మరసం చల్లడం వల్ల ముక్కల రంగు మారలేదని, 4 గంటల వరకు తాజాగా ఉన్నట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనలో చైనాలోని Zhejiang University లోని ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్కు చెందిన డాక్టర్ X. Wang పాల్గొన్నారు.
దాల్చిన చెక్క పొడి: వంటల్లో ఉపయోగించే దాల్చిన చెక్క పొడితో కూడా యాపిల్ ముక్కలు రంగు మారకుండా చూడొచ్చని చెబుతున్నారు. అందుకోసం కట్ చేసిన యాపిల్ ముక్కలపై కాస్త దాల్చిన చెక్క పొడిని చల్లాలంటున్నారు. దీనివల్ల యాపిల్ ముక్కలకు మరింత రుచి కూడా వస్తుందని చెబుతున్నారు.