Tips to Get Rid of Spectacles Marks on Nose: సైట్ ఉందనో లేదంటే ఫ్యాషన్ కోసమో.. ప్రస్తుత రోజుల్లో కళ్లద్దాల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అంతేకాదు కళ్లను రక్షించుకోవడానికి కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే ఇలా కళ్లజోడు ధరించే చాలా మందిలో ముక్కుపై మచ్చలు పడుతుంటాయి. కళ్లజోడు పెట్టుకున్నప్పుడు ఈ మచ్చలతో పెద్దగా ప్రాబ్లమ్ లేదు కానీ.. ఇవి పెట్టుకోకపోతే మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి. పైగా ఇవి అందాన్నీ దెబ్బతీస్తాయి. అయితే.. కొన్ని టిప్స్ పాటించడం ద్వారా ముక్కుపై ఏర్పడిన మచ్చలను తొలగించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
నిమ్మరసం, రోజ్‌వాటర్:కళ్లజోడు మచ్చలు పడిన చోట నిమ్మరసాన్ని అప్లై చేయడం వల్ల ఈ సమస్య తగ్గే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. అందుకోసం.. కొద్దిగా నిమ్మరసం తీసుకుని, అందులో కాస్త రోజ్‌వాటర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని మచ్చలున్న చోట అప్లై చేయాలి. 15 నిమిషాల పాటు ఆరనిచ్చి ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల నల్లమచ్చలు తగ్గుతాయంటున్నారు.
రోజ్‌వాటర్, వెనిగర్: కొద్దిగా రోజ్‌వాటర్ తీసుకొని అందులో కాస్త వెనిగర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని మచ్చలు ఉన్న చోట రోజూ మర్దన చేసుకుంటే అతి తక్కువ సమయంలోనే మచ్చలు మాయమైపోతాయంటున్నారు.
బాదం నూనె:బాదంనూనెలో ఉండే విటమిన్ ‘ఇ ముక్కు మీద మచ్చలు తగ్గించడంలో సహకరిస్తుందని అంటున్నారు. ఈ క్రమంలో రోజూ బాదంనూనెతో మచ్చలు ఉన్నచోట మర్దన చేసుకుంటే చక్కని ఫలితం ఉంటుందని చెబుతున్నారు.