How To Make Pudina Chutney :పుదీనా అనగానే ఏదైనా కూరల్లో సువాసన కోసం.. చివర్లో లుక్ కోసమో వేస్తుంటాం. పుదీనా ఆకులు వాసన చూస్తేనే చాలు.. ఎంత చిరాకులో ఉన్నా సరే, రీఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది. ఉదయం లేవగానే తాగే ఛాయ్ నుంచి చట్నీ వరకు.. మజ్జిగ, సలాడ్స్ ఇలా మనం తీసుకునే ఏదో ఒక ఆహారం లేదా పానీయంలో పుదీనా తప్పనిసరిగా ఉంటుంది. అలాంటి పుదీనాతో చేసే పచ్చడిని ఎప్పుడైనా తిన్నారా?
వేడి వేడి అన్నంలో ఈ పచ్చడితో పాటు కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. పెరుగు అన్నంలో కూడా ఇది మంచి కాంబినేషన్. ఇలా కేవలం అన్నంతోనే కాకుండా అన్ని బ్రేక్ ఫాస్ట్లకు కూడా అద్భుతంగా ఉంటుంది. రోటీ, చపాతీ, పుల్కాల్లోకి కూడా బాగుంటుంది. ఇదే కాకుండా పుదీనాను తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి టేస్టీ పుదీనా తొక్కు పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటి? దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు..
- ఒక కట్ట పుదీనా
- ఒక టేబుల్ స్పూన్ నూనె
- 8 పచ్చిమిరపకాయలు
- 8 వెల్లుల్లి ముక్కలు
- అర టీ స్పూన్ జీలకర్ర
- కరివేపాకు రెబ్బలు
- ఉసిరికాయంత చింతపండు
- ఒక ఉల్లిపాయ ముక్కలు
- రుచికి సరిపడా ఉప్పు